Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..

ఓ ఇంటర్వ్యూలో శివ్యా మాట్లాడుతూ.. ''హమ్‌ సఫర్‌ షో అయిపోయాక ఛాన్సులు రాలేదు. ఏం చేయాలో తెలీలేదు. చాలా రోజులు ఖాళీగానే ఉన్నాను. ఎవరు ఆడిషన్ కి పిలిచినా వెళ్లేదాన్ని. అలాంటి సమయంలో..............

Shivya Pathania : నాతో కాంప్రమైజ్ అయితే స్టార్ హీరో పక్కన ఛాన్స్ అన్నాడు.. కాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి..

Shivya Pathania

Shivya Pathania :  సినీ, టీవీ పరిశ్రమలో అప్పుడప్పుడు వినపడే పేరు కాస్టింగ్ కౌచ్. అవకాశాల కోసం వచ్చిన వాళ్ళని ఛాన్సులు ఇప్పిస్తాము అంటూ వాడుకోవడానికి ట్రై చేస్తారు కొంతమంది. చాలా మంది హీరోయిన్స్ కెరీర్ లో ఒక్క సారైనా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డ వాళ్ళే. దీని గురించి కొంతమంది బయటకి చెప్తారు. కొంతమంది బయటకి చెప్పరు. ఇటీవల కొంతమంది తమ ఇంటర్వ్యూలలో గతంలో తాము ఎదుర్కున్న కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పుతున్నారు. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి శివ్యా పఠానియా తాను ఎదుర్కున్న క్యాస్టింగ్‌ కౌచ్‌ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

 

హమ్ సఫర్ షో, లాల్ ఇష్క్, రాధాకృష్ణ లాంటి పలు టీవీ సిరీస్ లతో అక్కడి ప్రేక్షకులకి దగ్గరైంది శివ్యా పఠానియా. రాధా, సీత, లక్ష్మి, పార్వతి.. ఇలా ఎక్కువగా దేవతల రోల్స్ వేసి బుల్లితెర ప్రేక్షకులకి బాగా దగ్గరైంది. ప్రస్తుతం పలు టీవీ సీరియల్స్, షోస్ తో బిజీగా ఉంది శివ్యా. ఇటీవలే హాట్‌స్టార్‌ లో షూర్‌వీర్‌ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.

Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..

ఓ ఇంటర్వ్యూలో శివ్యా మాట్లాడుతూ.. ”హమ్‌ సఫర్‌ షో అయిపోయాక ఛాన్సులు రాలేదు. ఏం చేయాలో తెలీలేదు. చాలా రోజులు ఖాళీగానే ఉన్నాను. ఎవరు ఆడిషన్ కి పిలిచినా వెళ్లేదాన్ని. అలాంటి సమయంలో ఆడిషన్‌కు రమ్మంటూ ఓ కాల్ వచ్చింది. ముంబైలోని శాంతాక్రజ్‌లో ఆ అడ్రస్ ఉంది. అక్కడికి వెళ్తే అది ఒక చిన్న గది, లోపల ఓ వ్యక్తి ఆడిషన్ తీసుకున్నాడు. తర్వాత ఆ వ్యక్తి నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్‌ అయితే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్‌ ఇప్పిస్తాను అన్నాడు. అప్పుడు అతడు ల్యాప్‌టాప్‌లో హనుమాన్‌ చాలీసా వింటున్నాడు. వెంటనే నేను అతడు అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వి.. కొంచెమైనా సిగ్గుందా? భజన పాట వింటూ ఏం అడుగుతున్నావు అని తిట్టేశాను. ఈ విషయాన్ని నాలాగే ఆడిషన్స్ కి వెళ్లే వాళ్ళకి చెప్పి జాగ్రత్తపడమన్నాను. అయితే ఆ తర్వాత అతడసలు నిర్మాతే కాదని, అతడి బ్యానర్‌ కూడా ఫేక్ అని తెలిసింది” అంటూ తనకి ఎదురైన ఈ చేదు అనుభవాన్ని చెప్పింది.