Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్! Bollywood Big Production House Yash Raj Films chanting Pan India!

Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!

బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ రాబోయే రోజులు మావే అంటోంది. బాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ టూర్ చేస్తామంటోంది. ముంబై సూపర్ స్టార్స్ పెద్ద సినిమాలన్నీ తన చేతిలోనే ఉంచుకున్న ఆ నిర్మాణ సంస్థ.. ఆ ప్రాజెక్టులతో పాన్ ఇండియా పన్నాగాలను అమలు చేయనుంది.

Yash Raj Films: పాన్ ఇండియా జపం చేస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్!

Yash Raj Films: బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ రాబోయే రోజులు మావే అంటోంది. బాలీవుడ్ లో మళ్లీ సక్సెస్ టూర్ చేస్తామంటోంది. ముంబై సూపర్ స్టార్స్ పెద్ద సినిమాలన్నీ తన చేతిలోనే ఉంచుకున్న ఆ నిర్మాణ సంస్థ.. ఆ ప్రాజెక్టులతో పాన్ ఇండియా పన్నాగాలను అమలు చేయనుంది. ఇంతకీ ఎవరిదా అతిపెద్ద బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్. గాలం వేస్తోంది ఏ సినిమాలతో..?

Yash Raj Films : నాలుగు వారాల తర్వాత ఓటీటీలోనే.. డీల్ అదిరిందిగా..

గతేడాదే 50 సంవత్సరాలను పూర్తి చేసుకుంది యశ్ రాజ్ ఫిలింస్. యశ్ చోప్రా ప్రారంభించిన ఈ నిర్మాణ సంస్థ అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం ఆదిత్యా చోప్రా నడిపిస్తోన్న ఈ బిగ్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి కొన్ని క్రేజీ సినిమాలు రానున్నాయి. అయితే కోవిడ్ తర్వాత బంటీ ఔర్ బబ్లీ 2.. రీసెంట్ గా జయేశ్ బాయ్ జోర్దార్ ను చూపించిన ఈ సంస్థ.. రాబోయే రోజులు మాత్రం ఇలా ఉండవంటోంది.

OTT Platforms: నువ్వా నేనా తేల్చుకుందాం.. ఆడియన్స్ కోసం ఓటీటీల పోటీ!

షారుఖ్, సల్మాన్, ఆమీర్, అక్షయ్ లాంటి స్టార్స్ తో గతంలోనూ చాలా సినిమాలే చేశారు ఆదిత్యా చోప్రా. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయ్యాక కొన్ని, బాలీవుడ్ తో పాటే మరికొన్ని తెలుగులోనూ సౌత్ లోనూ రిలీజయ్యాయి. కొన్ని ప్రాజెక్టులను అసలు డబ్బింగ్ కూడా చేయలేదు. ఒక వేళ చేసినా ప్రమోషన్స్ చేయడం కానీ.. ఇక్కడికి అక్కడి స్టార్స్ రావడం కానీ పెద్దగా ఉండేది కాదు. కానీ ముందు ముందు అలా కాదట. యశ్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చే సినిమాలను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు నిర్మాతలు.

Tollywood Movies: కుర్ర హీరోలకి కలిసొస్తున్న పెళ్లి కాన్సెప్ట్!

య‌శ్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్‌లో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ న‌టించిన పృథ్విరాజ్ జ‌న‌వ‌రిలోనే విడుద‌ల కావాల్సింది. కానీ రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్ సినిమా కార‌ణంగా వాయిదా వేస్తూ వ‌చ్చారు మేక‌ర్స్. ఫైన‌ల్‌గా జూన్ 3న విడుద‌ల తేదీని ఫిక్స్ చేశారు. హిందీ వెర్ష‌న్‌తోపాటు ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇన్నాళ్లు చేసిన తప్పును ఇకపై చేయకుండా పృథ్వీరాజ్ నుంచే జాగ్రత్త పడుతున్నారు. అందుకే పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tollywood Movies : దేశాలు దాటుతున్న సినిమాలు..

రణ్ బీర కపూర్, వాణీ కపూర్ జంటగా షంషేరా సినిమాను నిర్మిస్తున్నాడు ఆదిత్యా చోప్రా. సంజయ్ దత్ కీ రోల్ చేస్తోన్న ఈ మూవీని కరణ్ మల్హోత్రా తెరకెక్కిస్తున్నాడు. కేజీఎఫ్2తో సంజయ్ దత్ కి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమానూ నేషనల్ వైడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగూ రణ్ బీర్ కపూర్ కి నేషనల్ పాపులారిటీ ఉంది. కాగా ఈ సినిమా జూలై 22న రిలీజ్ కానుంది.

Upcoming Movies: సౌత్ సినిమాలపై దేశం చూపు.. ఆశలన్నీ ఈ సినిమాలపైనే!

జూలై 1న మాధవన్ నటించిన రాకెట్రి.. ది నంబీ ఎఫెక్ట్ విడుదల కాబోతుంది. ఈ సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించలేదు కానీ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దక్కించుకుంది. మాధవన్ కు ఉన్న సౌత్ పాపులారిటీని వాడుకుని రాకెట్రిని చూపించబోతున్నారు. సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాకు మాధవనే డైరెక్టర్. షారుఖ్ ఖాన్ స్పెషల్ రోల్ చేసాడిందులో. అంతేకాదు రీసెంట్ గా ఈ మూవీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లోనూ ప్రదర్శితమైంది.

Telugu Young Heroes: ఒక్క హిట్టుతో సెన్సేషనల్ స్టార్స్.. సినిమాల ఎంపికలో తర్జన భర్జన

కింగ్ ఖాన్ షారుఖ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తోన్న సినిమా పఠాన్. బాద్షా నుంచి రాబోతున్న భారీ సినిమా ఇది. దీపికా పదుకోన్, జాన్ అబ్రహం లీడ్ రోల్స్ చేసారిందులో. కోవిడ్ కారణంగా, షారుఖ్ పర్సనల్ ఇష్యూస్ కారణంగా ఇప్పటికే అనేక వాయిదాలు పడింది పఠాన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను చివరికి 2023 జనవరి 25న తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. హిందీతో పాటూ తెలుగు, తమిళ్ భాషల్లోనూ విడుదల చేస్తామని స్పెషల్ గా మెన్షన్ చేసారు.

Young Heroes: కుర్రాళ్ళ యాక్షన్.. డిజాస్టరవుతున్న సినిమాలు!

సల్మాన్ ఖాన్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ టైగర్3 కూడా యస్ రాజ్ ఫిల్మ్స్ ఖాతాలోనే ఉంది. టైగర్ ఫ్రాంచైజ్ లో రానున్న ఈ మూడో సినిమా కోసం సల్లూభాయ్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మనీష్ శర్మ డైరెక్షన్లో కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా కనిపించబోతున్నాడు. ఈద్ స్పెషల్ గా 2023 ఏప్రిల్ 21న నార్త్ తో పాటూ సౌత్ లోనూ టైగర్ 2ని గ్రాండ్ గా రిలీజ్ చేసేలా సన్నాహాలు షురూ చేసారు.

Telugu Young Heroes: కంటెంట్ చాలు.. కటౌట్ అవసరం లేదంటున్న చిన్న హీరోలు!

ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఏ ప్రొడక్షన్ హౌజ్ లైన్ లో పెట్టనన్ని సినిమాలను రూపొందిస్తోంది యశ్ రాజ్ ఫిల్మ్స్. అవి కూడా అన్ని భారీ సినిమాలే. అజయ్ దేవ్ గణ్ హీరోగా ఓ సూపర్ హీరో ఫిల్మ్స్ స్టార్ట్ చేసింది ఈ సంస్థ. 2021లోనే మొదలవ్వాలి కానీ కోవిడ్ కారణంగా లేట్ అయింది. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని.. త్వరలోనే ఈ అతిపెద్ద సైన్స్ ఫిక్షన్ మూవీ డిటేల్స్ రివీల్ చేస్తామని.. రన్ వే34 ప్రమోషన్స్ లో అజయ్ చెప్పుకొచ్చాడు.

Young Heroes: పడుతూ లేస్తున్న యంగ్ హీరోలు.. ఒక్క బ్లాక్ బస్టర్ ప్లీజ్!

2019లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమా వార్. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కాంబినేషన్ లో సిద్ధార్ద్ ఆనంద్ తెరకెక్కించాడు. ఇప్పుడీ సినిమా సీక్వెల్ కు రంగం సిద్ధం చేసే పనిలో ఉన్నారు నిర్మాత ఆదిత్య చోప్రా. ప్రస్తుతం వార్ 2 ప్రీప్రొడక్షన్ వర్క్ నడుస్తోంది. అయితే ఈ సీక్వెల్ లో కూడా హీరోలుగా హృతిక్, టైగర్ నటించే ఛాన్స్ ఉంది. అయితే ప్రభాస్ ఇందులో విలన్ గా నటిస్తాడనే వార్తలను కొట్టిపారేసాడు సిద్ధార్ద్ ఆనంద్.

Young Directors: ఫ్లాప్ రీజన్ ఏదైనా.. భారం మొత్తం డైరెక్టర్లదేనా?

ఇక ధూమ్1, 2, 3 సినిమాలతో రికార్డులను కొల్లగొట్టింది యశ్ రాజ్ ఫిల్మ్స్. ఈ సినిమాలు తెలుగులోనూ మంచి సక్సెస్ సాధించినవే. అయితే ధూమ్ 4ను అంతకుమించి అనే లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. జాన్ అబ్రహం, హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్ యాంటీ రోల్స్ చేసిన గత మూడు సినిమాల తర్వాత… ధూమ్ 4 కోసం సల్మాన్, అక్షయ్, షారుఖ్ లలో ఎవరో ఒకర్ని ఫిక్స్ చేస్తారనే టాక్ నడించింది. కానీ ఇంతవరకు ధూమ్4 కాస్ట్ రివీల్ చేయలేదు.

Star Heroes: నాన్ స్టాప్ షెడ్యూల్స్.. స్టార్ హీరోల మూవీ లైనప్ అదుర్స్!

అన్నింటికి మించి యశ్ రాజ్ ఫిల్మ్ స్పై యూనివర్స్ క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ ను తెరపైకి తీసుకురానుంది. షారుఖ్ పఠాన్ లో సల్మాన్ ను… సల్మాన్ టైగర్ 3లో షారుఖ్ ను స్పెషల్ గెస్ట్ లుగా చూపించబోతున్న యశ్ రాజ్ ఫిల్మ్స్… హృతిక్ ధూమ్ 4లో అక్షయ్ కుమార్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. అలాగే ఇలా బాలీవుడ్ సూపర్ స్టార్స్ తో బిగ్ ప్రాజెక్ట్ ను కూడా ప్లాన్ చేస్తోంది. మొత్తానికి పెద్ద లైనప్ తో భారీ ప్రయత్నాలతో యశ్ రాజ్ ఫిల్మ్స్ బాలీవుడ్ ఉనికికి కాపాడేందుకు గట్టిగా పూనుకుంది.

×