IMDb-2019 Ranks : టాప్ 10 బాలీవుడ్ సెలబ్రిటీలు వీరే!

  • Published By: sreehari ,Published On : December 16, 2019 / 10:11 AM IST
IMDb-2019 Ranks : టాప్ 10 బాలీవుడ్ సెలబ్రిటీలు వీరే!

భారతీయ సినిమా, టెలివిజన్ సెలబ్రిటీలకు సంబంధించి ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb) విడుదల చేసిన వార్షిక జాబితాలో టాప్ 10లో బాలీవుడ్ సెలబ్రిటీలు నిలిచారు. ఈ ఏడాది మొత్తంలో సాధారణ పేజీ వ్యూస్ ఆధారంగా ర్యాంకింగ్స్ విడుదల చేయగా, IMDbPro వీక్లీ స్టార్ మీటర్ ఛార్ట్‌లో బాలీవుడ్ తారలే టాప్ ర్యాంకుల్లో ఉన్నారు. నెలవారీ యూజర్లలో 200 మిలియన్లకు పైగా యూనిక్ యూజర్లు IMDb విజిట్ చేస్తుంటారు.

ఈ ఏడాదిలో దేశీ గర్ల్ మూవీతో రెచ్చిపోయిన గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా టాప్ లిస్టులో నిలిచింది. బాలీవుడ్ నటుల్లో అక్షయ్ కుమార్ 5వ ర్యాంకులో నిలవగా, కండలవీరుడు సల్మాన్ ఖాన్ 6వ ర్యాంకులో నిలిచాడు. 2018లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునె ఫస్ట్ ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాదిలో మాత్రం దీపికాకు జాబితాలో చోటు దక్కలేదు. ఎందుకంటే 2019లో దీపికా మూవీలు రిలీజ్ కాకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. 

టాప్ 10లో ఎవరెవరు ఉన్నారంటే? :

1. ప్రియాంక చోప్రా : 
ప్రపంచ సుందరి ప్రియాంకా చోప్రా.. దేశీ గర్ల్‌తో మూవీతో.. గ్లోబల్ డామినేషన్ యాక్టరస్‌గా అవతరించింది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు పాపులర్ అయింది. IMDb ర్యాంకింగ్స్ లో కూడా చోప్రా టాప్ ర్యాంకులో నిలిచింది. ఇటీవలే రిలీజ్ అయిన SEMrush ప్రపంచ పాపులారిటీ జాబితాలో కూడా ప్రియాంక చోప్రా అగ్రస్థానంలో నిలిచింది. హాలీవుడ్ మూవీలతో బిజీ అయిన చోప్రా.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తోంది. ది సోనాలీ బోస్ దర్శకత్వంలో వచ్చిన ‘స్కై ఈజ్ పింక్’ అనే మూవీతో చోప్రా మళ్లీ అందరిని మెప్పించింది. 

2. దిషా పటానీ :  
బాలీవుడ్ బ్యూటీ దిషా పటానీ.. యాక్టింగ్ కెరీర్.. తెలుగు మూవీతోనే మొదలైంది. ఎంఎస్ ధోనీ స్పోర్ట్స్ బయోపిక్ The Untold Storyతో బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే.. 2019లో ఈ భామ.. కేవలం ‘భారత్’ ఒక మూవీ మాత్రమే చేసినప్పటికీ, తన సహా నటుడు సల్మాన్ ఖాన్ ‌ను వెనక్కి నెట్టేసి రెండో ర్యాంకు కొట్టేసింది. 

3. హృతిక్ రోషన్ :
హృతిక్ రోషన్.. అమ్మాయిల కలల రారాజు. ఇండియాలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటుల్లో కూడా ఈయన ఒకరు. బాలీవుడ్ లో తనదైన నటనతో ఎన్నో అవార్డులను పొందారు. 2019 ఏడాదిలో హృతిక్ నటించిన మూవీలు రెండే విడుదలయ్యాయి. ‘వార్..’ ‘సూపర్ 30’. 2019 హిందీ మూవీల్లో అత్యధిక వసూళ్లు రాబట్టాయి. బ్రిటీష్ న్యూస్ వీక్లీ నిర్వహించిన ఆన్ లైన్ పోల్ లో దశాబ్దకాలంలో సెక్సియస్ట్ ఏషియన్ మ్యాన్ గా హృతిక్ కు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. 

4. కైరా అద్వానీ : 
బాలీవుడ్ నటి కైరా అద్వానీ హిందీలో నటించిన Lust Storiesకు అత్యధిక పేజీవ్యూస్ రావడంతో IMDb ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో దక్కింది. ఈ ఏడాదిలో అద్వానీ మొత్తం 4 మూవీల్లో నటించింది. అందులో ఒకటి తెలుగు చిత్రం వినయ విధేయ రామ ఉంది. ‘హిందీ మూవీ కళాంక్’ లో స్పెషల్ అప్పిరెన్స్ తో మెప్పించింది. ఇక మరొకటి రొమాంటిక్ డ్రామా మూవీ ‘కబీర్ సింగ్’ లో ఫిమేల్ లీడ్ రోల్ చేసింది. 

5. అక్షయ్ కుమార్ :
బాలీవుడ్ లో సక్సెపుల్ యాక్టర్, డైరెక్టర్లలో అక్షయ్ కుమార్ ఒకరు. 29ఏళ్ల తన మూవీ కెరీర్ లో ఆయన ఎన్నో విలక్షణమైన రోల్స్ చేసి మెప్పించారు. ఈ ఏడాదిలో బాలీవుడ్ నుంచి కిల్లాడి కుమార్ నటించిన మూడు బ్లాక్ బస్టర్ మూవీలు రిలీజ్ కానున్నాయి. ఇందులో ఒకటి డిసెంబర్ నెలాఖరులో రిలీజ్ కానుంది. 

6. సల్మాన్ ఖాన్ : 
నిర్మాతగా హీరోగా సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ ఈ ఏడాదిలో రిలీజ్ అయింది. దబాంగ్ సిరీస్ లో మూడో మూవీ ఈ క్రిస్మస్ పండుగకు రిలీజ్ కానుంది. హిందీలో పాపులర్ రియాల్టీ టెలివిజన్ షో Bigg Boss 13సీజన్ కు సల్మాన్ హోస్టుగా వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. 

7. అలియా భట్ : 
అలియా భట్.. అత్యంత కష్టంగా IMdbలో ఏడో ర్యాంకులో నిలిచింది. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన ‘గల్లీ బోయ్’ మూవీలో అలియా భట్ నటించింది. అంతకుముందు కాళాంక్ మూవీలో ఫిమేల్ లీడ్ రోల్ చేసి మెప్పించింది ఈ భామ. 

8. కత్రినా కైఫ్ :
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్.. IMDb ర్యాంకింగ్స్ లో 8వ స్థానంలో నిలిచింది. హిందీ మూవీ ‘భారత్’ లో నటించిన ముగ్గురు సెలబ్రెటీల్లో కత్రినా కైఫ్ ఒకరు. 2019లో Kay Beauty అనే ప్రొడక్టును తన సొంత మేకప్, బ్యూటీ లైన్ లాంచ్ చేసింది. 

9. రకుల్ ప్రీత్ సింగ్ : 
టాలీవుడ్ లో తనదైన నటతో టాప్ యాక్టరస్‌గా నిలిచిన అందాల భామ.. రకుల్ ప్రీత్ సింగ్.. బాలీవుడ్ లోనూ తన నటనతో మెప్పించింది. 2019లో రకుల్.. రెండు హిందీ మూవీలు రిలీజ్ అయ్యాయి. అందులో ‘దే.. దే ప్యార్ దే అండ్ మరజవాన్’ మూవీకి IMDbలో అత్యధిక పేజీవ్యూస్ వచ్చాయి. దీంతో రకుల్ IMDb ర్యాంకింగ్స్ లో 9వ ర్యాంకులో నిలిచింది. 

10. శోభితా ధూళిపాల :
హిందీలో వచ్చిన థ్రిల్లర్ మూవీ.. రామన్ రాఘవ్ 2.0లో  ఈ బ్యూటీ నటించింది. జోయా అక్తర్ నటించిన భారతీయ డ్రామా వెబ్ సిరీస్ ’మేడ్ ఇన్ హెవెన్’ నటించిన తర్వాతే శోభితాకు మంచి ఫేమ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఏడాదిలో వచ్చిన మరో వెబ్ సిరీస్‌ ‘బార్డ్ ఆఫ్ బ్లడ్’ లో కూడా ఇమ్రాన్ హష్మీతో కలిసి శోభితా నటించింది.