Gumraah: బాలీవుడ్‌లో ఆశలు రేకెత్తిస్తున్న మరో రీమేక్.. వర్కవుట్ అయ్యేనా?

బాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్ చిత్రాల హవా కొనసాగుతోంది. దక్షిణాది కథలను రీమేక్ చేస్తూ బాలీవుడ్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌కు వరుస ఫెయిల్యూర్స్ నుండి ఊరటనిచ్చింది అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం-2 మూవీ. సౌత్‌లో తెరకెక్కిన దృశ్యం-2కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ జనాలను చాలా కాలం తరువాత థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఇక ఆ తరువాత కూడా వరుసగా రీమేక్ చిత్రాలు అక్కడ తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Gumraah: బాలీవుడ్‌లో ఆశలు రేకెత్తిస్తున్న మరో రీమేక్.. వర్కవుట్ అయ్యేనా?

Gumraah: బాలీవుడ్‌లో ప్రస్తుతం రీమేక్ చిత్రాల హవా కొనసాగుతోంది. దక్షిణాది కథలను రీమేక్ చేస్తూ బాలీవుడ్ మేకర్స్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌కు వరుస ఫెయిల్యూర్స్ నుండి ఊరటనిచ్చింది అజయ్ దేవ్గన్ నటించిన దృశ్యం-2 మూవీ. సౌత్‌లో తెరకెక్కిన దృశ్యం-2కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా బాలీవుడ్ జనాలను చాలా కాలం తరువాత థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఇక ఆ తరువాత కూడా వరుసగా రీమేక్ చిత్రాలు అక్కడ తెరకెక్కుతుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాలపై మంచి అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Bholaa Movie: ‘ఖైదీ’ మూవీకి డిట్టో కాదు.. చాలా మార్పులు చేసిన అజయ్ దేవ్గన్!

అయితే, కొన్ని రీమేక్ సినిమాలు మాత్రం దక్షిణాదిన సూపర్ హిట్ సక్సెస్ అందుకున్నా, బాలీవుడ్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ జాబితాలో జెర్సీ, హిట్, అల వైకుంఠపురములో చిత్రాల రీమేక్‌లు ఉన్నాయి. ఈ సినిమాలు ఇక్కడ మంచి విజయాలను అందుకున్నా, బాలీవుడ్‌లో మాత్రం ఫ్లాపులుగా మిగిలాయి. దీంతో ఇప్పుడు తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘తడం’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి రిలీజ్‌కు రెడీ చేశారు మేకర్స్. ఈ సినిమాలో హీరో ఆదిత్య రాయ్ కపూర్ నటిస్తుండగా, అందాల భామ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Drishyam 2: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద హాఫ్ సెంచరీ కొట్టిన అజయ్ దేవ్గన్!

తమిళంలో అరుణ్ విజయ్ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాను తెలుగులో యంగ్ హీరో రామ్ పోతినేని ‘రెడ్’ అనే టైటిల్‌తో తెరకెక్కించాడు. ఏప్రిల్ 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తుండగా, వర్ధన్ కేట్కర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. మరి ఈ రీమేక్ సినిమాకు బాలీవుడ్ జనం ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.