Pathaan – Baahubali 2 : హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 రికార్డుని బ్రేక్ చేయడానికి.. బాలీవుడ్ స్టార్స్‌కి 5 ఏళ్ళు పట్టింది!

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే ఇండియన్ సినిమాకి సిగ్నేచర్ గా ఉండేవి. కానీ బాహుబలి సినిమాతో అంతా మారిపోయింది. బాహుబలి-1&2, పుష్ప, RRR, కార్తికేయ-2.. ఇలా ప్రతి సినిమా బాలీవుడ్ ని డామినెటే చేశాయి. ఇక బాహుబలి-2 కలెక్షన్స్ పరంగా..

Pathaan – Baahubali 2 : హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద బాహుబలి-2 రికార్డుని బ్రేక్ చేయడానికి.. బాలీవుడ్ స్టార్స్‌కి 5 ఏళ్ళు పట్టింది!

Pathaan - Baahubali 2

Pathaan – Baahubali 2 : ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు అంటే ఇండియన్ సినిమాకి సిగ్నేచర్ గా ఉండేవి. కానీ బాహుబలి సినిమాతో అంతా మారిపోయింది. బాలీవుడ్ సినిమాల మాదిరి మన చిత్రాలు ఎప్పుడు 100 కోట్ల కలెక్షన్స్ అందుకుంటాయి అన్న ఆలోచనలు దగ్గర నుంచి, ఏకంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద నెంబర్ 1 ప్లేస్ ని కబ్జా చేసే వరకు టాలీవుడ్ సినిమాలు ఎదిగాయి. ఒకప్పుడు రీజినల్ మూవీస్ అంటూ తక్కువగా చూసిన మన సినిమాలను.. బాలీవుడ్ మేకర్స్ పొగిడే పరిస్థితిని తీసుకువచ్చారు టాలీవుడ్ దర్శకులు.

Pathaan : బాహుబలి-2 వసూళ్లను దాటేసి ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేసిన పఠాన్..

బాహుబలి-1&2, పుష్ప, RRR, కార్తికేయ-2.. ఇలా ప్రతి సినిమా బాలీవుడ్ ని డామినెటే చేశాయి. ఇక బాహుబలి-2 కలెక్షన్స్ పరంగా ఇండియా వైడ్ టాప్ ప్లేస్ లో ఉండడమే కాదు, బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద హిందీ సినిమాలను వెనక్కి నెట్టి మరి మొదటి ప్లేస్ లో నిలిచింది. 2017 లో రిలీజ్ అయిన బాహుబలి-2 హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద లైఫ్ రన్ పూర్తీ అయ్యేసరికి రూ.510 కోట్ల నెట్ షేర్ సాధించింది. దాదాపు 5 ఏళ్లగా ఈ రికార్డుని ఏ హిందీ సినిమా బ్రేక్ చేయలేక పోయింది.

5 ఏళ్ళ తరువాత ఇప్పుడు పఠాన్ సినిమా ఆ రికార్డుని బ్రేక్ చేసింది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టిస్తుంది. రిలీజ్ అయిన 28 రోజుల్లో 500 కోట్ల నెట్ షేర్ సాధించి, ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ హిందీ మూవీగా రికార్డు సృష్టించడమే కాకుండా.. 38 రోజుల్లో హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద రూ.510.65 నెట్ షేర్ సాధించి, నెంబర్ 1 పొజిషన్ లో ఉన్న బాహుబలి స్థానాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం హిందీ బాక్స్ ఆఫీస్ వద్ద పఠాన్ మొదటి స్థానంలో ఉండగా.. బాహుబలి-2, కేజీఎఫ్-2, దంగల్ తరువాత స్థానాల్లో ఉన్నాయి. ఏదేమైనా 5 ఏళ్ళ పాటు ఒక టాలీవుడ్ సినిమా బాలీవుడ్ లో నెంబర్ 1 పొజిషన్ ని ఏలింది.