RSS చీఫ్ పై హీరోయిన్ సోనమ్ కపూర్ ఫైర్

  • Publish Date - February 17, 2020 / 06:39 AM IST

విద్యావంతులు, ధనవంతుల కుటుంబాల్లోనే విడాకుల కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)  చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అహ్మాదాబాద్ లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మోహన్ భగవత్  విద్య, ధనంతో అహంకారం కూడా పెరుగుతోందని… దీంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని అన్నారు.  సమాజం కూడా ఓ కుటుంబమే. కాబట్టి సమాజం కూడా పతనమవుతోంది. దేశంలో హిందూ సమాజానికి ప్రత్యామ్నాయం లేదని ఆ సభలో ఆయన వ్యాఖ్యానించారు. 

ఇలాంటి తెలివి తక్కువ మాటలు ఎలా మాట్లాడతారంటూ సోనమ్ కపూర్  మండిపడ్డారు. ఆదివారం అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మోహన్‌ భగవత్ మాట్లాడుతూ‌.. ఉన్నత విద్యావంతుల కుటుంబాల్లోనే ఎక్కువగా విడాకుల కేసులు నమోదవుతున్నాయన్నారు. చిన్న చిన్న విషయాలకే కొట్లాడుకుంటూ విడిపోతున్నారని విమర్శించారు.

‘‘ఈరోజుల్లో విడాకుల కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్థంపర్థంలేని విషయాల కోసం విడాకుల దాకా వెళ్తున్నారు. ముఖ్యంగా బాగా చదువుకున్న వాళ్లు.. ఐశ్వర్యవంతులైన వారే విడాకులు తీసుకుంటున్నారు. విద్య, డబ్బుతో పొగరుబట్టిన కారణంగా ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. దాంతో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. సమాజంలో కూడా అంతరాలు పెరిగిపోతున్నాయి’’అని మోహన్‌ భగవత్‌ పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలపై సోనం కపూర్‌ ట్విటర్‌లో ఘాటుగా  స్పందించారు. ‘‘ఈ మనిషి.. అసలు ఇలా ఎలా మాట్లాడతారు? ఇవి పూర్తిగా తెలివితక్కువ, వెనుకబాటుతనాన్ని సూచించే మాటలు’’ అంటూ ఫైర్‌ అయ్యారు.  

Read More>>2 వేల ఐ ఫోన్లు ఉచితంగా పంపిణీ

ట్రెండింగ్ వార్తలు