Tollywood : బాలీవుడ్ హీరోలను విలన్స్ గా మారుస్తున్న టాలీవుడ్..

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన సైఫ్ ఆలీఖాన్(Saif Alikhan) ప్రస్తుతం అతడిది అంత రేంజ్ కాకపోయినా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు.

Tollywood : బాలీవుడ్ హీరోలను విలన్స్ గా మారుస్తున్న టాలీవుడ్..

Bollywood Heros acting as villains in Tollywood Movies

Tollywood :  బాలీవుడ్(Bollywood) లో ఒకప్పుడు హీరోలుగా వెలిగిన స్టార్ హీరోలు, గతంలో మంచి సక్సెస్ సాధించిన టైర్ 2 హీరోలు ఇప్పుడు క్యారెక్టర్ పాత్రలతో సరిపెట్టుకుంటూ మంచి బ్రేక్ కోసం చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో వారు సెకండ్ ఇన్నింగ్స్ గా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా నటించే ఛాన్సెస్ అందుకుంటున్నారు.

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలిగిన సైఫ్ ఆలీఖాన్(Saif Alikhan) ప్రస్తుతం అతడిది అంత రేంజ్ కాకపోయినా స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ తన కెరీర్ ను లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడతడికి డబుల్ బంపర్ ఆఫర్ తగిలింది. ఒక పక్క ప్రభాస్ ‘ఆదిపురుష్’(Adipurush) మూవీలో రావణాసురుడి పాత్రలో నటిస్తూ మరోపక్క ఎన్టీఆర్, కొరటాల శివ కాంబో మూవీలో పవర్ ఫుల్ విలన్ గా మరో ఆఫర్ అందుకోవడం విశేషం. ఈ రెండు సినిమాలతో సైఫ్ ఆలీఖాన్ సెకండ్ ఇన్నింగ్స్ గా టాలీవుడ్ లో విలన్ గా సెటిల్ అయిపోయే ప్రయత్నంలో ఉన్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హిస్టారిక్ ఫిక్షనల్ మూవీ ‘హరిహర వీరమల్లు’ మొఘలాయిల పాలన బ్యాక్ డ్రాప్ లో ఫిక్షనల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో పవన్ గజదొంగ వీరమల్లు అనే మల్లయోధుడిగా నటిస్తున్నాడు. అయితే ఇందులో పవర్ స్టార్ కు సరైన పోటీనిచ్చేందుకు బాలీవుడ్ నటుడు బాబీడియోల్ ను రంగంలోకి దింపారు. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నాడు. వీరమల్లుకు, ఔరంగజేబుకు మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కు ఐఫీస్ట్ ఇవ్వబోతున్నాయి.

నటసింహ బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని మూవీ ప్రస్తుతం సెట్స్ పై ఉంది. బాలయ్యకు 108 వ సినిమా ఇది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. వెరైటీ కథతో, డిఫరెంట్ స్టోరీతో ఈ సినిమాను తెరకెకక్కిస్తున్నాడు అనిల్. అయితే ఈ సినిమాలో బాలయ్య ను ఢీకొట్టే పవర్ ఫుల్ విలన్ గా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. త్వరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు.

Rajamouli : పాకిస్తాన్ నాకు పర్మిషన్ ఇవ్వలేదు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ కు రాజమౌళి సంచలన రిప్లై..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లోని సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. దీనికి ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఒక థియేటర్ బ్యాక్ డ్రాప్ లోని కామెడీ హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీకి విలన్ లాంటి ప్రభాస్ తాత పాత్ర కోసం బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. త్వరలోనే సంజయ్ దత్ ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు.