Bollywood : సక్సెస్‌లు కరువై యాక్షన్ సీక్వెల్స్ మీద పడ్డ బాలీవుడ్
బాలీవుడ్ లో సీక్వెల్స్ హంగామా ఎప్పటి నుంచో ఉన్నా ఈమధ్య హిట్ మూవీ సీక్వెల్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. కొత్తగా కథ రెడీ చేసి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడేకంటే సీక్వెల్ చేసి..................

Bollywood : ఇటీవల బాలీవుడ్ లో సక్సెస్ రేటు తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క సౌత్ సినిమాలన్నీ వరుస సక్సెస్ లు సాధిస్తుంటే బాలీవుడ్ మాత్రం భారీ విజయం సాధించడానికి తలక్రిందులవుతుంది. గత ఆరు నెలల్లో బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ విజయాలేమి లేవు. ఇటీవల ఒక్క భూల్ భూలయ్య2 మాత్రం 100 కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. అన్ని రకాల జోనర్లని టచ్ చేస్తున్నా ఏ జోనర్ బాలీవుడ్ ని బతికించట్లేదు. దీంతో బాలీవుడ్ కి బాగా కలిసొచ్చిన యాక్షన్ సినిమాలే తీద్దామని ఫిక్స్ అయినట్టున్నారు స్టార్ హీరోలు. అది కూడా గతంలో సూపర్ హిట్ అయిన యాక్షన్ సినిమాలకి బాలీవుడ్ సీక్వెల్స్ తీద్దామని చూస్తున్నారు.
బాలీవుడ్ లో సీక్వెల్స్ హంగామా ఎప్పటి నుంచో ఉన్నా ఈమధ్య హిట్ మూవీ సీక్వెల్స్ మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. కొత్తగా కథ రెడీ చేసి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అని టెన్షన్ పడేకంటే సీక్వెల్ చేసి సక్సెస్ కొడదామని డిసైడ్ అవుతున్నారు. సీక్వెల్స్ అంటే అలా ఇలా కాదు, ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న సాలిడ్ యాక్షన్ ని యాడ్ చేసి యాక్షన్ లవర్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు బాలీవుడ్ బడా హీరోలు.
బాలీవుడ్ హీరోలు సీక్వెల్స్ మీద తెగ మోజు పడుతున్నారు. అంతేకాదు ఆ సినిమాలకు సీక్వెల్స్ తీసే వరకూ డైరెక్టర్ల వెంట పడుతున్నారు. ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకి ఏమాత్రం లేట్ చెయ్యకుండా సీక్వెల్స్ ని స్పీడప్ చేసే పనిలో ఉన్నారు స్టార్ హీరోలు. సీక్వెల్స్ కదా అని ఏదో ఒకటి చెయ్యడం కాదు, షూర్ షాట్ సక్సెస్ ని తెచ్చిపెట్టే యాక్షన్ సినిమా మీదే కన్నేశారు బాలీవుడ్ హీరోలు. అందుకే వరసపెట్టి యాక్షన్ సీక్వెల్స్ తో రెడీ అవుతున్నారు.
Pooja hegde : బాలీవుడ్ లో కూడా హిట్ కొడతానంటున్న బుట్టబొమ్మ..
ఏ హీరో అయినా, ఏ సినిమా అయినా యాక్షన్ సీక్వెన్స్ లేకుండా కంప్లీట్ అయినట్టు అనిపించదు. అసలే ఈ మద్య హీరోల ఇమేజ్, క్రేజ్ ఎక్కువవడంతో పనిగట్టుకుని మరీ ఫైటింగ్ సీన్స్ పెడుతున్నారు. ఇదే యాక్షన్ ని హైలెట్ చేసి తన కెరీర్ కి సూపర్ క్రేజ్ తెచ్చిపెట్టిన డాన్ సినిమా సీక్వెల్ కి ప్లాన్ చేస్తున్నారు షారూఖ్ ఖాన్. తన స్టైల్, స్వాగ్ తో యాక్షన్ హీరో డాన్ గా ఎంటర్టైన్ చేశారు షారుఖ్. అప్పటి వరకూ సీరియస్ డాన్ క్యారెక్టర్లు చెయ్యని షారూఖ్ ఖాన్ 2006, 2011లో ఫుల్ డాన్ గా డాన్, డాన్ 2 లాంటి యాక్షన్ సినిమాలు చేశారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి డాన్ 3 తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ డాన్ సీక్వెల్ లో వింటేజ్ డాన్ అయిన అమితాబ్ ని కూడా యాడ్ చేసేలా చూస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ డైరెక్షన్లో ఈ డాన్ 3 తెరకెక్కబోతోందని, లేటెస్ట్ గా అమితాబ్, తను షారూఖ్ తో కలిసున్న ఫోటోని షేర్ చెయ్యడంతో న్యూస్ వైరల్ అవుతోంది.
ఆల్రెడీ సల్మాన్ ఖాన్ తన యాక్షన్ తో అదరగొట్టిన హిట్ సిరీస్ టైగర్ లో మూడో సినిమా చేస్తున్నారు. టైగర్ 3గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో స్పై క్యారెక్టర్ లో యాక్షన్ డోస్ ని ఇంకాస్త పెంచేస్తున్నారు సల్మాన్ ఖాన్. ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కుతున్న ఈ టైగర్ 3 సినిమా 2023 ఏప్రిల్ లో రిలీజ్ అవనుంది.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హల్క్ హృతిక్ రోషన్ కూడా సీక్వెల్ సక్సెస్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన ధూమ్, క్రిష్ సూపర్ యాక్షన్ సిరీస్ ని మరోసారి ప్లాన్ చేస్తున్నారు. సూపర్ న్యాచురల్ పవర్స్ తో సూపర్ హిట్ అయిన సిరీస్ క్రిష్ 4కి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన హృతిక్ రోషన్ యాక్షన్ హీరో ఇమేజ్ ఇచ్చిన ధూమ్ సీక్వెల్ ధూమ్ 4ని కూడా తెరమీదకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
Tamil Directors : తెలుగులోకి తమిళ డైరెక్టర్ల రాక..
బాలీవుడ్ మాస్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా తన సూపర్ హిట్ యాక్షన్ సిరీస్ ని స్టార్ట్ చేస్తున్నారు. సింగం సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అజయ్ దేవగన్ సింగం 4 చెయ్యబోతున్నారు. నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ కి షూటింగ్ స్టార్ట్ చేసి 2024లో సినిమాని రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు డైరెక్టర్ రోహిత్ శెట్టి. సింగం సిరీస్ లో ఈ సింగం 3 సీక్వెల్ ఇంకా మ్యాసివ్ గా ఉండబోతోందని, యాక్షన్ లో నెక్ట్స్ లెవల్ చూపించబోతున్నామని అంటున్నారు రోహిత్.
మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా సూపర్ హిట్ యాక్షన్ మూవీ సీక్వెల్ ని తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన రవితేజ విక్రమార్కుడు సినిమాని హిందీలో రౌడీ రాథోడ్ గా రీమేక్ చేసి సూపర్ హిట్ కొట్టారు. ఫుల్ లెన్త్ యాక్షన్ రోల్ లో అదరగొట్టిన అక్షయ్ కుమార్ ఇప్పటికే రౌడీ రాథోడ్ కి సీక్వెల్ స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యాక్షన్ సినిమాతో మరో హిట్ కొట్టి తన యాక్షన్ పవర్ చూపించడానికి రెడీ అవుతున్నారు అక్షయ్ కుమార్. ఇలా బాలీవుడ్ స్టార్స్ అంతా యాక్షన్ సీక్వెల్స్ బాట పట్టారు. మరి ఇవైనా బాలీవుడ్ కి ఊపిరి పోస్తాయేమో చూడాలి.
- Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..
- Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..
- Kriti Sanon : గోల్డ్ శారీలో ధగధగలాడుతున్న కృతి సనన్..
- Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..
- Anushka Sharma : రణబీర్ ఫేవరేట్ ఆలియా కాదట.. ఆ క్రికెటర్ భార్యే ఇష్టం అంటున్న రణబీర్..
1Uttam Kumar Reddy: 50 వేల మెజారిటీ రాకుంటే రాజకీయాలు వదిలేస్తా: ఉత్తమ్ కుమార్ రెడ్డి
2Shruti Haasan: తన ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన శ్రుతి హాసన్
3Viral News: కొత్త ఆలోచన.. వినూత్నరీతిలో కంపెనీలకు రెజ్యూమ్‌లు పంపిన యువకుడు..
4China: అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభించిన చైనా.. ఇండియాకు మాత్రం నో ఎంట్రీ!
5The Warrior: ది వారియర్ కోసం కదిలివస్తున్న కోలీవుడ్.. ఏకంగా 28 మంది!
6IAF Fighter Jets : హిస్టరీ క్రియేట్ చేసిన తండ్రీకూతురు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఇదే ఫస్ట్!
7JOBS : బ్యాంకుల్లో క్లర్క్ పోస్టులకు కామన్ రిక్రూట్ మెంట్
8Telangana Rains: తెలంగాణకు నాలుగు రోజులపాటు భారీ వర్ష సూచన
9TS Covid: తెలంగాణలో కొవిడ్ విజృంభణ.. భారీగా పెరిగిన కొత్త కేసులు..
10NTR: బుచ్చిబాబుకు ఎన్టీఆర్ ఆర్డర్.. అది మార్చాల్సిందేనట!
-
Xiaomi Mi Band 7 Pro : GPS సపోర్టుతో Mi బ్యాండ్ 7ప్రో ప్రీమియం వెర్షన్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Belly Fat : యోగాసనాలతో పొట్ట చుట్టూ కొవ్వు కరిగించండి!
-
Airtel New Plans : అతి తక్కువ ధరకే ఎయిర్టెల్ 4 కొత్త స్మార్ట్ రీఛార్జ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ తెలుసా?
-
Chiranjeevi: మెగా సస్పెన్స్.. గాడ్‌ఫాదర్ టీజర్లో ఇది గమనించారా?
-
Boult Smartwatches : ఇండియాకు 2 బౌల్ట్ స్మార్ట్‌వాచ్‌లు.. ధర తక్కువ.. హెల్త్ ఫీచర్లు ఎక్కువ..!
-
RC15: చరణ్ ఎంట్రీకే రూ.10 కోట్లు పెట్టిస్తున్న శంకర్..?
-
Ridge Gourd : రక్తంలో చక్కెర స్ధాయిని నియంత్రణలో ఉంచే బీరకాయ!
-
Vijayendra Prasad: మహేష్ మూవీపై బాంబ్ పేల్చిన జక్కన్న తండ్రి