Bollywood : తెలుగు సినిమాలపై బాలీవుడ్ కన్ను..

సౌత్ సినిమాల మీద బాగా కాన్సన్‌‌ట్రేట్ చేస్తోంది బాలీవుడ్.. అందుకే సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు.. స్టోరీ ఏదైనా సరే, హీరో ఎవరైనా సరే.. వెంటనే రీమేక్ రైట్స్ తీసేసుకుంటోంది బాలీవుడ్..

10TV Telugu News

Bollywood: బాలీవుడ్‌లో రీమేక్ హవా ఊపందుకుంటోంది. సౌత్‌లో సూపర్ హిట్ అయిన సినిమాల రీమేక్ రైట్స్‌ని ఇమ్మీడియెట్‌‌గా తీసేసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్. రీసెంట్‌గా మరొక రెండు సినిమాల రీమేక్ వర్క్‌ని స్పీడప్ చేస్తున్నారు. ఆ సినిమాలేంటో లెట్స్ హ్యావ్ ఎ లుక్.

సౌత్ సినిమాల మీద బాగా కాన్సన్‌‌ట్రేట్ చేస్తోంది బాలీవుడ్. అందుకే సినిమా సక్సెస్ అయ్యిందంటే చాలు.. స్టోరీ ఏదైనా సరే, హీరో ఎవరైనా సరే.. వెంటనే రీమేక్ రైట్స్ తీసేసుకుంటోంది బాలీవుడ్. లేటెస్ట్‌గా సౌత్ నుంచి ఎక్స్‌పోర్ట్ అయిన సినిమా ‘రాచ్చసన్’. తమిళ్‌లో విష్ణు విశాల్ లీడ్ రోల్‌లో హిట్ అయిన ‘రాచ్చసన్’ సినిమా తెలుగులో ‘రాక్షసుడుగా రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.

Ajay Devgn : హిందీలోకి నరేష్ ‘నాంది’..

తెలుగులో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమాని బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. అక్షయ్ కుమార్ లీడ్ రోల్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ నటించబోతోంది. సూపర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘రాక్షసుడు’ సినిమా కాన్సెప్ట్ యూనివర్శల్ కావడంతో ఈ సినిమా మీద బాలీవుడ్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందుకే ఈ సినిమా పనుల్ని స్పీడప్ చేస్తోంది అక్షయ్ అండ్ టీమ్.

లేటెస్ట్‌గా మరో చిన్న సినిమా, అల్లరి నరేష్ సూపర్ హిట్ ‘నాంది’ సినిమాని బాలీవుడ్‌లో రీమేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు దిల్ రాజు. అందుకే ఈ సినిమాని రీమేక్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అజయ్ దేవ్‌గణ్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నామని దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేసింది టీమ్. ఈ సినిమాని దిల్ రాజుతో పాటు పరాగ్ దేశాయ్, కుల్‌దీప్ తో పాటు అజయ్ దేవ్‌గణ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

10TV Telugu News