Bollywood : అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారు

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెంట్లు మోసం చేసి..అశ్లీల చిత్రాలలో నటింప చేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారంటూ..ఆరోపణలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Bollywood : అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారు

Raj

Sofia Hayat : పోర్నోగ్రఫీ కేసు బాలీవుడ్ ను కుదిపేస్తోంది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను అరెస్టు చేయడం కలకలం రేపింది. ఈ కేసుపై పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు. బాలీవుడ్ నటీ, నటీమణులు పలు విషయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా..పోర్నో గ్రఫీ కేసులో నటి, మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోఫియా హయత్ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయ్యింది.

Read More : 5 Men In Pak : మేకపై అత్యాచారం, జంతువులకు కూడ రక్షణ లేదా ? ప్రధానిపై సెటైర్లు

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకొనే అమ్మాయిలను కొంతమంది ఏజెంట్లు మోసం చేసి..అశ్లీల చిత్రాలలో నటింప చేస్తున్నారని సోఫియా ఆరోపించింది. అవకాశాల పేరిట పోర్న్ వీడియోలు చేయిస్తున్నారంటూ..ఆరోపణలు చేయడం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తనకు జరిగిన సంఘటనను కూడా వెలువరించారు ఈమె. తాను బిగ్ బాస్ షో చేస్తున్న సమయంలో ఓ ఏజెంట్ ఇంటిమేట్ సీన్స్ చేయాలని అభ్యర్థించారని, అంతేగాకుండా..షూటింగ్ ముందే అలాంటి సీన్స్ రిహార్సల్స్ చేసి వీడియోలు పంపమని కోరినట్లు ఆరోపణలు గుప్పించారు.

Read More : Apple iPhone 13 Series : ఆపిల్ ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ ఎప్పుడంటే?

తాను హాలీవుడ్ చిత్రాల్లో బెడ్ రూం సీన్స్ లో నటించినట్లు, ఎవరూ తనను ముందుగా వచ్చి…రిహార్సల్స్ చేయమని అడగలేదని వెల్లడించారు. నిజంగా ఫ్రొఫెషనల్ గా శృంగార సన్నివేశాలు చిత్రీకరించే వాళ్లు..ఎవరూ ముందుగా అలాంటి సీన్స్ చేసి చూపించమని అడగరని స్పష్టంగా వెల్లడించారు. అమ్మాయిలను మోసం చేసి..అశ్లీల సినిమాల్లో నటించేలా చేయడం అత్యాచారంతో సమానమని ..కోర్టులు వీరిపై కఠినంగా వ్యవహరించాలని సోఫియా వెల్లడించారు. సోఫియా చేసిన ఆరోపణలపై ఎలాంటి స్పందనలు వ్యక్తమౌతాయో చూడాలి.