Bollywood Remakes: తెలుగు కథలకు బాలీవుడ్ ఫిదా.. రీమేక్స్ దండయాత్ర షురూ!

బాలీవుడ్ లో టాలీవుడ్ రీమేక్ సందడి మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా వల్ల గతంలో ఎక్కడ సినిమాలు అక్కడ సర్ధుకున్నాయి. ఇక పాండమిక్ టైమ్ అయిపోవడంతో.. రీమేక్ సినిమాలకు ఊపు వచ్చింది.

10TV Telugu News

Bollywood Remakes: బాలీవుడ్ లో టాలీవుడ్ రీమేక్ సందడి మళ్లీ స్టార్ట్ అయ్యింది. కరోనా వల్ల గతంలో ఎక్కడ సినిమాలు అక్కడ సర్ధుకున్నాయి. ఇక పాండమిక్ టైమ్ అయిపోవడంతో.. రీమేక్ సినిమాలకు ఊపు వచ్చింది. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. టాలీవుడ్ టాలెంట్ కు ఫిదా అయిపోయిన బాలీవుడ్.. మన కథలతోపాటు మన డైరెక్టర్ల పై కూడా కన్నేసింది. ఇప్పటికే కబీర్ సింగ్ లాంటి తెలుగు రీమేక్ సినిమాలు 250 కోట్లుకు పైగా కలెక్షన్స్ తో అక్కడ సత్తా చాటాయి. ఇప్పుడు మరికొన్ని తెలుగ కథలు నార్త్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. షూటింగ్ స్టేజ్ లో కొన్ని సినిమాలు ఉంటే.. రిలీజ్ కు ముస్తాబయ్యి మరికొన్ని సినిమాలు వెయిట్ చేస్తున్నాయి. కొన్ని సినిమాలు రిలీజ్ డేట్స్ కూడా ఇచ్చేశాయి.

Mahesh Babu: త్వరలో సూపర్ స్టార్ మరో సైడ్ బిజినెస్?

తెలుగులో సూపర్ హిట్ అయ్యి నానీని ఫెయిల్యూర్స్ నుంచి బయట పడేసిన సినిమా జెర్సీ. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన సినిమా.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా.. గౌతమే డైరెక్టర్ గా రీమేక్ అయ్యింది. కరోనా వల్ల ఆగిపోయిన ఈమూవీ ఈ ఏడాది డిసెంబర్ 31న రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన హిందీ జెర్సీ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అల్లు అరవింద్ తో కలిసి దిల్ రాజు హిందీ జెర్సీ ని నిర్మిస్తున్నారు. భారీ కలెక్షన్స్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.

Mannara Chopra: ఈ పోజు ఏంటో.. చీరకట్టులోనూ ఇంత హాటా!

తెలుగులో నానీ ప్రోడ్యూసర్ గా యంగ్ స్టార్ విశ్వక్ సేన్ హీరోగా.. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన హిట్ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. రాజ్ కుమార్ రావ్ హీరోగా.. తెలుగు హిట్ డైరెక్టర్ శైలేష్ కొలను హిందీలో కూడా ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈమూవీకి సంబంధించిన ముంబయ్ షూటింగ్ అప్ డేట్స్ ను శేర్ చేసుకున్నారు టీమ్. కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్ మళ్ళీ రీ ఓపెన్ చేశారు. వచ్చే ఏడాది మే 22న హిందీ హిట్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఓటీటీలో ఈమూవీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.

Mega Hero’s: మెగా నామ సంవత్సరంగా 2022.. ఫ్యాన్స్‌కు పండగే!

ఇక టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అయిన అలవైకుంఠపురమలో మూవీకి రీమేక్ గా హిందీలో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను కూడా అల్లు అరవింద్ ఏక్తా కపూర్ తో కలిసి నిర్మిస్తున్నారు. కార్తిక్ ఆర్యన్ హీరోగా కృతి సనన్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈమూవీకి షెహజాది అనే టైలిల్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కరోనా కారణంగా ఇప్పటివరకూ స్టార్ట్ అవ్వని ఈమూవీని వచ్చే నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

Telugu Stars: నెక్స్ట్ ఏంటి.. కన్ఫ్యూజన్‌తో జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్!

అటు అల్లరి నరేష్ హీరోగా తెలుగులో సూపర్ సక్సెస్ సాధించిన నాంది సినిమా కూడా హిందీలో రీమేక్ అవుతోంది. ఈ ఎక్స్ పెర్మెంట్ మూవీని చూసి ముచ్చట పడిన బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హిందీ రీమేక్ హక్కులు తీసుకున్నారు. తెలుగులో అల్లరి నరేష్ చేసిన పాత్రను అజయ్ దేవగణ్ స్వయంగా నటించబోతున్నారు. ఈ మూవీ ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఇక రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది.

Aishwarya Rajesh: ప్యూర్ హోమ్లీ లుక్‌లో ఐశ్వర్య.. ఫోటోలు!

ఇవే కాదు బాలీవుడ్ లో ఇంకా చాలా తెలుగు సినిమాలు రీమేక్ కు రెడీగా ఉన్నాయి. అడవి శేష్ క్షణం క్షణం, నవీన్ పొలిశెట్టి ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ, శ్రీవిష్ణు బ్రోచేవారు ఎవురురా.. కీరవాణి తనయుడు సింహా నటించి మత్తువలరా లాంటి చాలా సినిమాలు బాలీవుడ్ రీమేక్ కు రెడీ అవుతున్నాయి. ఈ సినిమాల నుంచి అప్ డేట్ రావాల్సి ఉంది.

×