Surrogacy Parents: సరోగసీతో మాతృత్వాన్ని చూస్తున్న బాలీవుడ్!

రీసెంట్ గా సరోగసి పద్ధతి ద్వారా ట్విన్స్ కి జన్మనిచ్చింది సొట్టబుగ్గల ప్రీతి జింటా. ఇదే ప్రాసెస్ ను ఎక్కువగా ఫాలో అయ్యే బాలీవుడ్ లో గతంలోనూ కవలకు పేరెంట్స్ అయ్యారు ముంబై స్టార్స్.

Surrogacy Parents: సరోగసీతో మాతృత్వాన్ని చూస్తున్న బాలీవుడ్!

Surrogacy Parents

Surrogacy Parents: రీసెంట్ గా సరోగసి పద్ధతి ద్వారా ట్విన్స్ కి జన్మనిచ్చింది సొట్టబుగ్గల ప్రీతి జింటా. ఇదే ప్రాసెస్ ను ఎక్కువగా ఫాలో అయ్యే బాలీవుడ్ లో గతంలోనూ కవలకు పేరెంట్స్ అయ్యారు ముంబై స్టార్స్. జనాలను ఎడ్యుకేట్ చేస్తూ తమ లైఫ్ లో పిల్లలతో ఎంజాయ్ చేస్తోన్న సరోగసి పేరెంట్స్ ఎవరో ఓసారి చూద్దాం.

Amala Paul: అమలా పాల్ అందాల దాడి..!

టాలీవుడ్ టు బాలీవుడ్ అప్పట్లో సందడి చేసిన ప్రీతిజింటా తన ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది. భర్త జీని గుడ్‌ ఎనఫ్‌ తో కలిసి సరోగసీ పద్ధతి ద్వారా మాతృత్వాన్ని ఆస్వాదిస్తుంది ప్రీతి జింటా. వాళ్లకి కవల పిల్లలుగా ఒక బాబు, ఒక పాప జన్మించారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా ప్రకటించిన ప్రీతి.. పిల్లల పేర్లు జై, జియాలుగా ప్రకటించింది. అంతేకాదు ఈ సందర్భంగా సరోగేట్‌ మదర్‌ తో పాటు ఆసుపత్రి వర్గాలకు ఆమె థ్యాంక్స్ చెప్పుకుంది.

Special Songs: స్పెషల్ సాంగ్స్‌తో ట్రెండ్ సృష్టిస్తున్న స్పెషల్ గర్ల్స్..!

తనను తాను గే అని ప్రకటించుకున్న బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా సరోగసి ద్వారా తండ్రిగా మారాడు. రూహీ, యశ్ అనే కవలలతో తన పేరెంట్ హుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు కరణ్ జోహార్. ఇక ఐవీఎఫ్ ప్రొసీజర్ ద్వారా సంజయ్ దత్, మాన్యా కపుల్ షహ్రాన్, ఇక్రా అనే పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. సన్నీలియోన్, డేనియల్ జంట కూడా సరోగసి విధానం ద్వారా యేషర్, నోహ్ లకు పేరేంట్స్ గా మారారు. వీరికి నిషా అనే అడాప్టర్ డాటర్ కూడా ఉంది.

RRR: అంతా సిద్ధం.. ట్రైలర్ కూడా రెడీ.. ఇక రచ్చ రచ్చే!

సరోగసి ప్రొసిజర్ తో సింగిల్ ఛైల్డ్ కు పేరంట్స్ అయినవారూ ఉన్నారు. షారుఖ్ ఖాన్-గౌరీ కపుల్ చిన్న కొడుకు అబ్రం ఖాన్ సరోగేట్ ఛైల్డ్. అటు ఆమిర్ ఖాన్, కిరణ్ రావు కూడా తమ కొడుకు అజాద్ రావును కన్నది సరోగసి విధానంలోనే. యాక్టర్ తుషార్ కపూర్ లక్ష్య అనే బాబుకు ఇదే విధానం ద్వారా తండ్రిగా మారాడు. తుషార్ సిస్టర్ ఏక్తాకపూర్ సైతం ఇదే ఐవిఎఫ్ సరోగసి ద్వారా ఓ బాబుకు అమ్మగా మారింది. 2020లో శిల్పాశెట్టి-రాజ్ కుంద్రా దంపతులు కూడా పండంటి పాపకు సరోగసి ద్వారానే తల్లిదండ్రలయ్యారు.