Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

కొత్త సంవత్సరం రాబోతుంటే కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు బాలీవుడ్ గ్లామర్ డాల్స్. ఒకరేమో బ్రేకప్ చెప్పి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోబోతుంటే.. మరొకరు అదే న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ ను..

Bollywood Heroins: కొత్త సంవత్సరం.. బీ టౌన్ లవ్ బర్డ్స్ డేరింగ్ డెసిషన్స్!

Bollywood Heroins

Bollywood Heroins: కొత్త సంవత్సరం రాబోతుంటే కొత్త డెసిషన్స్ తీసుకుంటున్నారు బాలీవుడ్ గ్లామర్ డాల్స్. ఒకరేమో బ్రేకప్ చెప్పి న్యూ ఇయర్ సెలెబ్రేట్ చేసుకోబోతుంటే.. మరొకరు అదే న్యూ ఇయర్ రోజు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఇక 2022 వచ్చేస్తోంది.. మా వెడ్డింగ్ డేకు రెడీ కండంటూ కలరింగ్ ఇస్తున్నారు ఇంకొంతమంది. కత్రినా కైఫ్ – విక్కీ, పత్రలేఖ – రాజ్ కుమార్ రావ్, అంకితా లోఖండే – విక్కీ లాంటి వాళ్లు ఇయర్ ఎండింగ్ లో పెళ్లి చేసేసుకని కొత్త కాపురాలు కూడా పెట్టేస్తుంటే.. ముంబై హాట్ కపుల్స్ ఇప్పుడు రచ్చ చేస్తున్నాయి.

Kiara Advani: కైరా అద్వానీ కొత్త సోయగాలు!

అన్నింటికి మించి అన్న లెవెల్ లో రణ్ బీర్-ఆలియాల వెడ్డింగ్ డిటేల్స్ ట్రెండ్ అవుతున్నాయి. నిజానికి 2021లోనే పెళ్లి పీటలెక్కుదామనుకున్న వీళ్లు.. 2022కి దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలోనే రణ్ బీర్-అలియా ఒక్కటవుతారని వార్తలొస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ లో వీళ్లిద్దరూ బిహేవ్ చేస్తున్నారు. అయితే డెస్టినేషన్ వెడ్డింగ్ లా కాకుండా సింపుల్ గా వివాహం చేసుకోవాలనేది ఈ స్వీట్ కపుల్ ప్లాన్.

Films Re-Shoot: రీ షూట్.. ప్యాకప్ చెప్పిన సినిమాలకు మళ్ళీ ప్యాచప్!

సౌత్ టు నార్త్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్న హీరోయిన్ కియారా అద్వానీ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేం చేసిన హాట్ టాపిక్ గానే మారుతుంది. అలాంటిది సిద్దార్ధ్ మల్హోత్రాతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే.. జనాలు చూస్తూ ఊరుకోరు కదా. 2021లో వీళ్ల మాల్డీవుల హడావిడీ, ముంబై షికార్లను చూసి లవ్ బర్డ్స్ అనేస్తున్నారు. కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నట్టు కనిపిస్తోన్న కియారా – సిద్ధార్ద్ జంట త్వరలోనే అఫీషియల్ టచ్ ఇవ్వబోతున్నారు. న్యూ ఇయర్ ఎంట్రీలో వాళ్ల రిలేషన్ షిప్ మ్యాటర్ ను బహిరంగంగా రివీల్ చేయబోతున్నారని సమాచారం.

Shraddha Srinath: అందాల ప్రదర్శనలో అంత `శ్రద్ధా`!

48 ఏళ్ల వయసులోనూ మతిపోయేలా గ్లామర్ రచ్చ చేస్తోంది మలైకా అరోరా. ఏం చేసినా హై లెవెల్ అన్నట్టు.. అర్జున్ కపూర్ తో మలైకా డేటింగ్ అంతే రేంజ్ లో వైరల్ గా మారింది. పెళ్లెప్పుడు అన్న దానిపై ఎప్పుడూ సమాధానం చెప్పరు కానీ వాళ్ల రిలేషన్ షిప్ పై బహిరంగంగానే స్పందిస్తారు ఇద్దరూ. అయితే వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంతో 2022లో ఒక్కటవుతారని ముంబైలోని ప్రముఖ జ్యోతిష్కుడు కామెంట్ చేశాడు. దానిని వీళ్లిద్దరూ కొట్టిపారేయలేదు. ముంబై సర్కిల్స్ ప్రకారం అది నిజమయ్యే ఛాన్స్ 2022లో కనిపిస్తోంది.

Radhe Shyam: ప్రభాస్ అభిమానులకు కిక్కిచ్చిన పాన్ ఇండియా డైరెక్టర్స్!

ఐదేళ్ల ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లడానికి బాలీవుడ్‌ యాక్టర్ అలీ ఫజల్, హీరోయిన్ రిచా చద్దా రెడీ అయిపోయారు. అతి త్వరలో వీళ్ల పెళ్లి జరుగబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో దానికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. 2017లో ‘ఫక్రీ రిటర్న్స్‌’లో ఈ ఇద్దరూ జంటగా నటించారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రిచా పంజాబీ అమ్మాయిగా అలీది ఉత్తర్‌ప్రదేశ్‌. పెద్దల అంగీకారంతోనే ఈ జంట పెళ్లి గ్రాండ్ గా జరగబోతుంది.

RRR: ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా ప్రచారం.. నిజమెంత?

అందరితో లెక్కయితే మాదొకటి అన్నట్టు.. 2022లోకి ఒంటరిగానే ఎంటరవుతానంటోది సుస్మితాసేన్. తనకంటే 16 ఏళ్ల చిన్నవాడైన రోహ్మాన్ షాల్ తో ఇన్నాళ్లు డేటింగ్ చేసిన సుస్మితా.. రీసెంట్ గా పెటాకులైనట్టు ప్రకటించింది. 2018లో అధికారికంగా డేటింగ్ లో ఉన్నట్టు అనౌన్స్ చేసింది సుస్మితా. సడెన్ గా ఏమైందో ఏమో.. మేం స్నేహితులుగానే మా జర్నీ స్టార్ట్ చేసాం.. స్నేహితులుగానే విడిపోతున్నామంటూ బాంబ్ పేల్చేసింది.