Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

సౌత్ సినిమాలు ఆల్ ఓవర్ ఇండియా తెగ హడావిడి చేస్తున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా రికార్డు కలెక్షన్లతో వరసగా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి.

Bollywood Movies: బాలీవుడ్ కి చేతకావట్లేదా? సౌత్ ను చూసి నేర్చుకోవాల్సిందేనా?

Bollywood Movies

Bollywood Movies: సౌత్ సినిమాలు ఆల్ ఓవర్ ఇండియా తెగ హడావిడి చేస్తున్నాయి. ఏ సినిమా రిలీజ్ అయినా రికార్డు కలెక్షన్లతో వరసగా బాలీవుడ్ బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్నాయి. ఈ సినిమాల్లో నటించిన బాలీవుడ్ స్టార్లు.. సక్సెస్ కి సంతోష పడుతూ సౌత్ ని మెచ్చుకుంటూనే బాలీవుడ్ వాళ్లకి చీవాట్లు పెడుతున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకుని ఎందుకు సౌత్ సినిమాలకు తల వంచుతున్నాం..? మన దగ్గర చేవ లేదా..? మంచి సినిమాలు చెయ్యడం మనవాళ్లకు చేతకాదా అంటూ హీరోల దగ్గరనుంచి డైరెక్టర్లవరకూ మీడియా సాక్షిగా బాగానే దులిపేస్తున్నారు.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

పుష్ప దగ్గరనుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 వరకూ ఈ సౌత్ సినిమాలన్నీ బాలీవుడ్ బాక్సాఫీస్ బెండు తీసిన సినిమాలే. దాంతో ఒక్కసారిగా ఆలోచినలో పడింది బాలీవుడ్. ఇన్ని వందల కోట్లు, స్టార్ కాస్ట్ తో ఎన్ని సినిమాలు చేసినా అసలు మినిమం హిట్ కొట్టడం కష్టమైపోతోంది. కానీ సౌత్ సినిమాలు మాత్ర వరసగా బ్లాక్ బస్టర్ హిట్లు అవడంతో సౌత్ సినిమా మేకింగ్ ని పొగుడుతూనే.. సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ ని తిట్టిపోస్తున్నారు బాలీవుడ్ స్టార్లు. సల్మాన్ ఖాన్ దగ్గరనుంచి సంజయ్ దత్ వరకూ వరసగా అందరూ సౌత్ నుంచి బాలీవుడ్ నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ ఓపెన్ గానే బాలీవుడ్ కి చురకలు పెడుతున్నారు.

Bollywood Movies: అనౌన్స్‌మెంట్‌తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!

ఇదే విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓపెన్ గా చెప్పారు. బాలీవుడ్ సినిమాలు సౌత్ లో అంతగా వర్కవుట్ అవ్వడం లేదు.. కానీ సౌత్ మాత్రం బాలీవుడ్ లో స్టామినా చూపిస్తోందంటున్నారు సల్మాన్. స్పెషల్లీ సౌత్ ఇండస్ట్రీలో హీరోయిజం ఎక్కువగా ఉండే సినిమాలు తీస్తున్నారు. కానీ బాలీవుడ్ ఎక్కడో మిస్ ఫైర్ అవుతోంది. నార్త్ లో కూడా మూవీ మేకింగ్ స్టైల్ మారాలి. వపర్ ఫుల్ సబ్జెక్ట్ రావాలి అంటూ ఓపెన్ గానే సౌత్ ని తెగ పొగుడుతూ బాలీవుడ్ ని డైరెక్ట్ గా తిట్టకుండానే.. చురకలు అంటించారు సల్మాన్. సౌత్ రైటర్లు చాలా కష్టపడి డిఫరెంట్ కాన్సెప్ట్ లతో ముందుకు వస్తున్నారని, బాలీవుడ్ కూడా ఇలాంటి గూస్ బంప్స్ వచ్చే స్టోరీస్ ని చెయ్యాలని మేకర్స్ కి సలహా కూడా ఇచ్చారు.

Bollywood Movies: బాలీవుడ్ మైండ్ బ్లాంక్.. సక్సెస్ ఫార్ములా మర్చిపోయిందా?

స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా టాలీవుడ్ ని చూసి నేర్చుకోవాలంటూ ఓపెన్ గానే చెప్పారు. ఇప్పటికే సౌత్ లో సినిమాలకు, హీరోలకు మేకింగ్ స్టైల్ కి ఫుల్ ఫిదా అయిపోయిన కరణ్ జోహార్ .. తెలుగు ఇండస్ట్రా నుంచి వస్తున్న డిఫరెంట్ మూవీస్ ని చూసి బాలీవుడ్ నేర్చుకోవాలని, రొటీన్ సినిమాలు కాకుండా కొత్త కాన్సెప్ట్ వైపు బాలీవుడ్ కాన్సన్ ట్రేట్ చెయ్యాలన్నారు. బాలీవుడ్ లో బయోపిక్స్, మెసేజ్ ఓరియంటెడ్ ఇలా ఏ సినిమా హిట్ అయితే అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తారని, కానీ సౌత్ లో సొంత కథలతో తెరమీదకు వస్తూ.. బ్లాక్ బస్టర్ హిట్లుకొడుతూ ప్రపంచాన్నే ఆకర్షిస్తు న్నారని, ఇది చూసైనా బాలీవుడ్ మారాలని స్ట్రాంగ్ గానే బాలీవుడ్ కి హితబోధ చేశారు కరణ్.

Bollywood Movies: థర్డ్ వేవ్ తిప్పలు.. బాలీవుడ్‌కు మళ్ళీ గతేడాది పరిస్థితులు!

కెజిఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ ని అకౌంట్ లో వేసుకున్న సంజయ్ దత్ కూడా సౌత్ ని పొగుడుతూనే బాలీవుడ్ కి చురకలు అంటిస్తున్నారు. సౌత్ లో హీరోయిజం ఎప్పుడూ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఇప్పటికీ హీరో ఎంట్రీ అంటే.. దుమ్ము రేగాల్సిందే, ధియేటర్లో విజిల్స్ వెయ్యాల్సిందే. ఒకప్పుడు బాలీవుడ్ లో కూడా ఇలాంటి ఎలివేషన్ ఉండేది.. కానీ ఇప్పుడు బాలీవుడ్ లో అంత సీన్ లేదు.. హీరోయిజం ఇంపాక్ట్ బాలీవుడ్ లో తగ్గిపోయింది. సౌత్ లో హీరోతో పాటు విలన్ కూడా అంతే ఇంపార్టన్స్ ఉంటుంది. కానీ బాలీవుడ్ మాత్రం అలా కాదు.. సౌత్ ని చూసి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోవాలని పబ్లిక్ గానే చెప్పారు సంజయ్ దత్.

Bollywood Movies : బాలీవుడ్ బడా సినిమాలు రిలీజ్‌కు రెడీ..

నేల విడిచి సాము చేయడం వల్లే బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ పోరులో వెనకబడుతోందని కాస్త ఘాటుగానే బాలీవుడ్ మీద కామెంట్ చేసింది రవీనా టాండన్. సౌత్ జనాలు రూట్స్ ని మర్చిపోరని, సినిమాతో పాటు కల్చర్ ని, ఎమోషన్స్ ని కూడా మిస్ అవ్వరు. అసలు సినిమాకు కావల్సింది ఎమోషన్స్.. అవి ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యలేకపోతే.. ఎంత పెద్ద సినిమా అయినా కూడా డిజాస్టర్ అవ్వక తప్పదు. ఈ విషయాన్నే బాలీవుడ్ మర్చిపోతోందని, హిందీ సినిమా ఎప్పుడూ హాలీవుడ్‌ ను ఇమిటేట్ చెయ్యడానికి ట్రై చేస్తూ.. ఫెయిల్ అవుతోందని తీవ్రంగానే విమర్శలు చేసింది రవీనా టాండన్.

Pan India Movies: ఇండియా సినిమా కేరాఫ్ టాలీవుడ్.. మ్యాజిక్ చేస్తున్న మలయాళం!

బాలీవుడ్ వాళ్లని తిట్టడానికి ఎప్పుడూ ముందుడే కంగనా.. ఈసారి కూడా బాలీవుడ్ మేకింగ్ ని ఓ ఆట ఆడుకుంది. సౌత్ వాళ్లకు మంచి సినిమాలు చెయ్యాలన్న కమిట్ మెంట్ చూసి ఇప్పటికైనా బాలీవుడ్ సిగ్గుతెచ్చుకోవాలంటోంది కంగనా. అంతేకాదు.. సినిమాల మీద సౌత్ జనాలకున్న ప్రేమ వెలకట్టలేనిదని, బాలీవుడ్ లో కమర్షియాలిటీ తప్పించి క్వాలిటీ మీద కాన్సన్ ట్రేట్ చెయ్యరని అంటోంది కంగనా. అంతేకాదు.. బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ లాంటి గొప్ప యాంగ్రీ మెన్ తర్వాత అంత అగ్రెషన్ ని బాలీవుడ్ మేకర్స్ చూపించలేకపోయారని, సౌత్ హీరోల్ని చూసి, వాళ్ల మేకింగ్ స్టైల్ ని చూసి ఇప్పటికైనా బాలీవుడ్ రూట్ మార్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది ఈ ఫైర్ బ్రాండ్.

Bollywood Couples: ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్.. ప్రేమకు వయసుతో పనేంటి?

ఇప్పటికైనా బాలీవుడ్ మారాలని బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కూడా అన్నారు. సౌత్ లో చేస్తున్న పవర్ ఫుల్ సినిమాల లాంటి సినిమాలతో బాలీవుడ్ కూడా ముందుకు రావాలి అంటూ పబ్లిక్ గానే స్టేట్ మెంట్ ఇచ్చారు రణవీర్ సింగ్. ప్రపంచం మొత్తం తనవైపుకు తిప్పుకునే సౌత్ సినిమాల్ని చూసి బాలీవుడ్ కూడా మారాలంటున్నారు రణవీర్ సింగ్.