Rajiv Gandhi Web Series : రాజీవ్‌గాంధీ హత్యపై వెబ్ సిరీస్..

‘సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌’ వెబ్ సిరీస్ ఫేం నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో రాజీవ్ గాంధీ హత్య, దాని తర్వాత, ముందు జరిగిన పరిణామాలని వెబ్ సిరీస్ గా............

Rajiv Gandhi Web Series : రాజీవ్‌గాంధీ హత్యపై వెబ్ సిరీస్..

Bollywood Planing Rajiv Gandhi Web Series

Rajiv Gandhi Web Series :  మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య అప్పట్లో దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్యోదంతం, తదనంతర పరిణామాలపై రచయిత అనిరుధ్య మిత్రా ‘నైంటీ డేస్‌: ది ట్రూ స్టోరీ ఆఫ్‌ హంట్‌ ఫర్‌ రాజీవ్‌గాంధీస్‌ అసాసిన్‌’ అనే నవల రాశారు. ఈ బుక్ కూడా బాగా పాపులర్ అయింది. ఇప్పుడు ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్ లో ఓ వెబ్‌సిరీస్‌ తెరకెక్కించనున్నారు.

‘సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌’ వెబ్ సిరీస్ ఫేం నగేష్‌ కుకునూర్‌ దర్శకత్వంలో రాజీవ్ గాంధీ హత్య, దాని తర్వాత, ముందు జరిగిన పరిణామాలని వెబ్ సిరీస్ గా తీయనున్నారు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ ఈ సిరీస్ ని నిర్మించనున్నారు. నిర్మాత సమీర్‌ నాయర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ”సంచలనం సృష్టించిన రాజీవ్‌ గాంధీ హత్య, దర్యాప్తు, హంతకులను పట్టుకోవడం.. ఇవన్నీ మనం మనం పత్రికల ద్వారా తెలుసుకున్నాం. ఈ సంఘటలన్నింటినీ ఇప్పుడు దృశ్య రూపంలో తెరకెక్కించబోతున్నాం” అని తెలిపారు.

Ponniyin Selvan 1 Trailer : పొన్నియిన్ సెల్వన్ ట్రైలర్ చూశారా.. బాహుబలికి మించి ఉందిగా..

అయితే ఈ సిరీస్ లో ఎవరెవరు నటిస్తారు, రాజీవ్ గాంధీ పాత్రలో ఎవరు నటిస్తారు లాంటి వివరాలు ఇంకా తెలియచేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.