Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా మామూలు రేంజ్ లో లేదు. పుష్ఫకు ముందు పుష్ప తర్వాత అన్నట్లుగా బన్నీ గ్రాఫ్ మారిపోయింది.

Allu Arjun: బన్నీ కోసం బాలీవుడ్ ప్రెస్టీజియస్ బ్యానర్స్ వెయిటింగ్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హవా మామూలు రేంజ్ లో లేదు. పుష్ఫకు ముందు పుష్ప తర్వాత అన్నట్లుగా బన్నీ గ్రాఫ్ మారిపోయింది. రెబల్ స్టార ప్రభాస్ తర్వాత బాలీవుడ్ ఇప్పుడు అల్లు అర్జున్ వెనకాల పడుతోంది. బాలీవుడ్లో రెండు పెద్ద బానర్లు.. అగ్ర దర్శకులు బన్నీతో సినిమాలు చేయడానికి ప్లాన్లు గీసుకుంటున్నారు. అన్నీ కుదిరితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఓ రెండేళ్లపాటు డైరెక్టు తెలుగు సినిమాలకు దూరమయ్యే అవకాశం ఉంది.

Allu Arjun: బన్నీ గ్రాఫ్ మార్చేసిన పుష్ప.. క్రేజ్ మామూలుగా లేదు!

అలవైకుంఠపురంలో హిందీ డబ్బింగ్ సినిమాను ఆపడానికి ముంబైలో పెద్ద పెద్ద రాయాబారాలే నడిచాయి. ప్రస్తుతం బన్నీకు ఉన్న క్రేజ్ కి అలవైకుంఠపురంలో డబ్బింగ్ వర్షన్ రిలీజ్ అయితే … తమ సినిమా తేలిపోతుందని వరిజినల్ రీమేక్ షెహజాదే మేకర్స్ ఆందోళన చెందారు. నార్త్ ఇండియా మార్కెట్ లో అల్లు అర్జున్ ఇన్ఫులియన్స్ ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపులు చాలు. అల్లు అర్జున్ తో డైరెక్ట్ సినిమాలు చేయడానికి బాలీవుడ్ మేకర్స్ రెడీ అయిపోయారు. బాలీవుడ్ ప్రెస్టీజియన్ ప్రొడక్షన్ హౌజ్ యశ్ రాజ్ ఫిలింమ్స్ ఇప్పటికే బన్నీతో ప్రాజెక్టు కోసం బ్యాక్ గ్రౌండ్ సెట్ చేస్తోంది.

Allu Arjun : తమిళ్ డైరెక్టర్‌తో బన్నీ పాన్ ఇండియా సినిమా

హీరోలందరి డ్రీమ్ బానర్ యశ్ రాజ్ ఫిలిమ్స్ బన్నీ కాల్షీట్స్ కోసం రంగంలోకి దిగడంతో – బాలీవుడ్లోని మిగతా ప్రొడ్యుసర్లు కూడా తమ లక్ పరీక్షించుకునే పనిలో పడ్డారు. క్రేజీ మూవీస్ ప్రొడ్యుసర్ సాజిద్ నడియాడ్ వాలా కూడా అల్లు అర్జున్ డేట్స్ కోసం కర్చీప్ పట్టుకున తిరుగుతున్నాడు. ఏ రేంజ్ మూవీకైనా రెడీ అంటూ సిగ్నల్స్ పంపిస్తున్నాడు. ప్రభాస్ తర్వాత బాలీవుడ్లో మోస్టీ క్రేజీ పాన్ ఇండియా హీరోగా అల్లు అర్జున్ ను ముంబై ఇండస్ట్రీ చూస్తోంది.

Allu Arjun : ఇద్దరిలో ఎవరితో బన్నీ పాన్ ఇండియా మూవీ?

ఎప్పటి నుంచో తెలుగు హీరోతో సినిమా చేయాలని చూస్తున్న బాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ సంజయ్ లీలా భన్సాలీ ఐకాన్ స్టార్ తో మూవీ తీయాలని మనసులో మాట బయటపెట్టాడు. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్, రామ్ లీలా, పద్మావతీ, బాజీ రావు మస్తానీ, గంగుభాయ్ లాంటి బిగ్ రేంజ్ సినిమాల దర్శకుడు భన్సాలీ.. కథ చెప్పాలనకుంటున్నాడంటే… బన్నీ గ్రాఫ్ ఏ స్థాయికి చేరిందో అర్ధమవుతుంది. చూస్తూ ఉంటే ఇన్నాళ్లు టాప్ పొజిషన్ కోసం టాలీవుడ్లో తలపడిన మన హీరోలు ఇప్పుడు బాలీవుడ్ను బాటిల్ ఫీల్డ్ చేసుకునేటట్లు కనిపిస్తోంది.