Karan Johar: సౌత్ స్టార్స్ కోసం నేనున్నా అంటున్న కరణ్..!

మిగిలిన బాలీవుడ్ మేకర్స్ సంగతెలా ఉన్నా.. కరణ్ జోహార్ మాత్రం సౌత్ సత్తా బాగా తెలుసుకున్నాడు. అందుకే ఇక్కడి హీరోల కోసం హోస్ట్ అవుతున్నాడు. అక్కడ పార్టీలను హోస్ట్ చేస్తున్నాడు.

Karan Johar: సౌత్ స్టార్స్ కోసం నేనున్నా అంటున్న కరణ్..!

Karan Johar

Karan Johar: మిగిలిన బాలీవుడ్ మేకర్స్ సంగతెలా ఉన్నా.. కరణ్ జోహార్ మాత్రం సౌత్ సత్తా బాగా తెలుసుకున్నాడు. అందుకే ఇక్కడి హీరోల కోసం హోస్ట్ అవుతున్నాడు. అక్కడ పార్టీలను హోస్ట్ చేస్తున్నాడు. సౌత్ పాన్ ఇండియా స్టార్స్ ని ప్రమోట్ చేసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇప్పటికే సౌత్ స్టార్స్ ని బాగా మోసేస్తున్న కరణ్.. ఇప్పుడు కొత్త పనులను కూడా భుజాన వేసుకున్నాడు.

South Star’s: రారమ్మని ఊరిస్తున్న బాలీవుడ్.. సౌత్ స్టార్స్ ఆరాటం!

సౌత్ కంటెంట్, సౌత్ స్టార్స్ ను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు కరణ్ జోహార్. పాన్ ఇండియా రేంజ్ లో ఇక్కడివారు ఎదుగుతున్నారని.. నార్త్ లో కొంతమంది పెదవి విరుస్తున్నా.. కరణ్ జోహార్ మాత్రం జస్ట్ చిల్ అంటున్నారు. రీసెంట్ గా కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం ఆ టీమ్ తో చేతులు కలిపాడు. మార్చ్ 27న జరుగబోతున్న కేజీఎఫ్2 ట్రైలర్ లాంచ్ కు హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు కరణ్ జోహార్. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ గా రాబోతున్న రాకింగ్ స్టార్ సినిమాకు హోస్ట్ గా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ రావడం ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపికయింది.

Brahmasthra : టార్గెట్ ‘బాహుబలి’.. రాజమౌళికి దీటుగా కరణ్ జోహార్ ‘బ్రహ్మాస్త్రం’..

తెలుగు, తమిళ్, మలయాళీ సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తోన్న కరణ్ జోహార్.. హృదయం అనే మలయాలీ మూవీ రీమేక్ హక్కులను దక్కించుకున్నాడు. హిందీతో పాటూ ఈ మూవీ తెలుగు, తమిళ్ రైట్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సొంతం చేసుకున్నట్టు ప్రకటించాడు కరణ్ జోహార్. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్ లో ప్రణవ్ మోహన్ లాల్, కల్యాణి ప్రియాదర్శన్ నటించిన హృదయం కేరళ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

KGF2: యష్ కోసం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి అతిథిగా శివన్న!

పుష్ప సినిమాను మెచ్చుకున్నాడు. ట్రిపుల్ ఆర్ కు సపోర్ట్ ఇస్తూ ముంబై ఈవెంట్ లో హోస్ట్ గా మెరిసాడు కరణ్ జోహార్. గతంలో బాహుబలి టైమ్ లో కూడా ప్రభాస్, రాజమౌళిని ఆకాశానికెత్తాడు. ప్రస్తుతం పూరీ కనెక్ట్స్ తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ ను నిర్మిస్తున్నాడు. అక్కినేని అఖిల్ ను కరణ్ బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేస్తాడనే ప్రచారమూ జరుగుతోంది. బాలీవుడ్ సినిమాలతో బాగా బిజీగా ఉంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా సౌత్ కోసం కష్టపడేందుకు ఆలోచించట్లేదు ఈ బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్.