Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..

నిర్మాత వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ''వాజ్‌పేయికి నేను వీరాభిమానిని. భారతదేశ నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన జీవితాన్ని వెండితెరపైన చూపించబోతున్నాం. దీనిని మేము...........

Vajpayee Biopic : వెండితెరపై వాజ్‌పేయి జీవితకథ..

Vajpayee

Vajpayee Biopic :  ఇప్పటికే అన్ని పరిశ్రమలలో బయోపిక్ లను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ లో అయితే చెప్పాల్సిన పని లేదు. వరుస బయోపిక్ లతో హోరెత్తిస్తున్నారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల జీవితాల్ని తెరకెక్కిస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. తాజాగా బాలీవుడ్ మరో బయోపిక్ ని ప్రకటించింది. భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి జీవితకథని త్వరలో సినిమాగా తెరకెక్కించనున్నారు.

ప్రముఖ రచయిత ఉల్లేఖ్‌ ఎన్‌.పి రచించిన ‘ది అన్‌టోల్డ్‌ వాజ్‌పేయి: పొలిటీషియన్‌ అండ్‌ పారడాక్స్‌’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపం దాల్చనుంది. తాజాగా ఈ పుస్తక హక్కులను నిర్మాతలు వినోద్‌ భానుషాలి, సందీప్‌ సింగ్‌ దక్కించుకున్నారు.

Mahesh Babu : బిల్‌గేట్స్ తో మహేష్ మంతనాలు.. వైరల్ గా మారిన ఫొటో

ఈ సందర్భంగా నిర్మాత వినోద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ”వాజ్‌పేయికి నేను వీరాభిమానిని. భారతదేశ నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారు. అందుకే ఆయన జీవితాన్ని వెండితెరపైన చూపించబోతున్నాం. దీనిని మేము గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. ఈ సినిమాలో ఆయన రాజకీయ సిద్ధాంతాలనే కాక మానవీయ, కవితా కోణాల్ని కూడా చూపించబోతున్నాం. ప్రస్తుతం వాజ్‌పేయి పాత్ర పోషించగల నటుడి కోసం వెతుకుతున్నాం. త్వరలో ఈ సినిమా దర్శకుడ్ని ప్రకటిస్తాం. వచ్చే ఏడాది ఆరంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. వాజ్‌పేయి 99వ జయంతి సందర్భంగా 2023 క్రిస్మస్‌కు ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం”అని తెలిపారు. దీనిపై వాజ్‌పేయి, బీజేపీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.