Sulochana Latkar : ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నుమూత.. విషాదంలో బాలీవుడ్..
తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సులోచన లాట్కర్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబై వద్ద ఉన్న దాదర్ లో సుశ్రూష ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 94 ఏళ్ళ వయసులో మరణించారు.

Bollywood Senior actress Sulochana Latkar passes away
Sulochana Latkar : ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ సులోచన లాట్కర్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ముంబై వద్ద ఉన్న దాదర్ లో సుశ్రూష ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ 94 ఏళ్ళ వయసులో మరణించారు.
స్వతంత్రం ముందు కర్ణాటకలో పుట్టిన సులోచన ముంబైకి వెళ్లి సినీ పరిశ్రమలో 1940 లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ ఆరంభంలో హిందీ, మరాఠి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా బాలీవుడ్ లో చాలా సినిమాలు చేసింది. ఎక్కువగా అమ్మ పాత్రల్లో కనిపించి బాలీవుడ్ అమ్మగా పేరు సంపాదించింది. 1980ల కాలంలో దాదాపు స్టార్ హీరోలు, హీరోయిన్స్ అందరికి అమ్మలా నటించింది సులోచన. దాదాపు 60 ఏళ్ళ లాంగ్ కెరీర్ లో 250కు పైగా హిందీ, మరాఠి సినిమాల్లో నటించింది.
Allu Arjun : తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్ పై బన్నీ ఎమోషనల్ కామెంట్స్..
చివరిసారిగా ఆమె 2007లో ఓ హిందీ సినిమాలో నటించింది. అప్పట్నుంచి ఆమె సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. 1999లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు సులోచన లాట్కర్. 2009లో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి మహారాష్ట్ర భూషణ్ అవార్డు అందుకున్నారు. సులోచన లాట్కర్ మరణంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
Sulochana Tai was one of the most loved and graceful actresses cinema has seen. My favourite film of hers will always be Sangate Aika. Her performance in every film was memorable. I will miss our conversations may you rest in peace. Your contribution to Indian cinema will always…
— Madhuri Dixit Nene (@MadhuriDixit) June 4, 2023