Shahid Kapoor: సినిమాల కోసం బెగ్గర్‌లా అడుక్కున్న బాలీవుడ్ స్టార్ హీరో!

ర్సీ మూవీ.. నాని కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ లో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రిలీజ్ కురెడీ అవుతోంది. లేటెస్ట్ గా షాహిద్ హీరోగా జెర్సీ ట్రైలర్..

10TV Telugu News

Shahid Kapoor: జెర్సీ మూవీ.. నాని కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ లో ఓ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా. ఆ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లో రిలీజ్ కురెడీ అవుతోంది. లేటెస్ట్ గా షాహిద్ హీరోగా జెర్సీ ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. అర్జున్ రెడ్డి రీమేక్‌గా వచ్చిన కబీర్ సింగ్‌తో 200 కోట్ల కలెక్షన్లు కొట్టిన షాహిద్ కపూర్‌కి.. మొదట్లో అసలు ఎవరూ సినిమా అవకాశాలే ఇవ్వలేదట.

Samantha: పెంపుడు కుక్కకు బర్త్‌డే విషెస్‌.. నెటిజన్ల ఆగ్రహం!

తెలుగులో నాని హీరోగా వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా జెర్సీ.. హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రిలీజ్‌కు రెడీ అవుతోంది. డిసెంబర్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లోనే బాలీవుడ్‌లో కూడా రిలీజ్ అవుతోంది.

Drushyam 2 Telugu: అమెజాన్‌లో వచ్చేసిన వెంకీ మరో దృశ్యం!

షాహిద్ కపూర్ జెర్సీ సినిమా కంటే ముందే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ అయిన కబీర్ సింగ్‌తో సూపర్ హిట్ అందుకున్నాడు . 200 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా తర్వాత షాహిద్ కపూర్ సినిమాలు సెలక్ట్ చేస్కోవడం కోసం చాలా కష్టపడ్డాడు. 18 ఏళ్ల కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అంత కమర్షియల్ సక్సెస్ సాధించిన షాహిద్.. ఫస్ట్ టైమ్ 200 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవ్వడంతో.. ఆల్ మోస్ట్ బెగ్గర్ లాగా.. సినిమాల కోసం ఆ రేంజ్ డైరెక్టర్లని, ప్రొడ్యూసర్లని కలిశానంటూ ఇంట్రస్టింగ్ న్యూస్ చెప్పాడు షాహిద్.

Akhanda: ఎన్నో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్‌తో అఖండ!

కబీర్ సింగ్ రిలీజ్ అవ్వడానికి రెండు వారాల ముందే జెర్సీ సినిమా చూశానని, ఆ తర్వాత గౌతమ్ తనతో సినిమా గురించి డిస్కస్ చేశాడన్నాడు షాహిద్. అసలు సినిమా చెయ్యకుండా ఉండడానికి చాలా ట్రై చేశానని, కానీ తన కోసం గౌతమ్ వెయిట్ చెయ్యడంతో జెర్సీ మూవీని కమిట్ అయ్యానంటున్నాడు షాహిద్.