Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!
రెండేళ్ల నుంచి రిలీజ్ లు లేక, అసలు సరిగా షూటింగ్స్ జరక్క.. కామ్ అయిపోయిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు బిజీ అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చెయ్యడమే కాకుండా వాటి రిలీజ్ డేట్స్..

Bollywood Star Heroes: రెండేళ్ల నుంచి రిలీజ్ లు లేక, అసలు సరిగా షూటింగ్స్ జరక్క.. కామ్ అయిపోయిన బాలీవుడ్ హీరోలు ఇప్పుడు బిజీ అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చెయ్యడమే కాకుండా వాటి రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేస్తూ.. ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నారు. ఒకరితో ఒకరు పోటీపడి వరస పెట్టి సినిమాల్ని లైన్లో పెడుతూ బాలీవుడ్ హీరోలు బిజీ అవుతున్నారు. రెండేళ్ల నుంచి సరైన షూటింగ్స్ లేక కెరీర్ లో కోవిడ్ ఇచ్చిన బ్రేక్ తీసుకున్న హీరోలు ఇప్పుడు ఫుల్ స్పీడ్ మీదున్నారు. ఒకొక్కరు.. రెండు, మూడు సినిమాలతో ఫుల్ ఎంగేజ్ అయిపోయారు.
Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!
లేటెస్ట్ గా హృతిక్ రోషన్ మరో సినిమాని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కోయి మిల్ గయా సినిమాతో ఇండియన్ సూపర్ హీరోని ఆడియన్స్ ని పరిచయం చేసిన హృతిక్ రోషన్ ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న క్రిష్ 4 ప్రీ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేస్తున్నారు. క్రిష్ 4 మీద బాలీవుడ్ లో ఎప్పటి నుంచో హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ జూన్ 23న క్రిష్ 4 ఉంటుందని త్వరలోనే సెట్స్ మీదకెళుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు హృతిక్ రోషన్. ఇప్పుడు ఈ సినిమా సమ్మర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది.
Bollywood Heroins: సౌత్ క్రేజ్.. మన హీరోలపై మనసు పారేసుకుంటున్న బాలీవుడ్
ఈ సినిమాతో పాటు ఆల్రెడీ సైఫ్ అలీఖాన్ తో చేస్తున్న విక్రమ్ వేద కూడా ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. రౌడీ షేడ్స్ ఉన్నవేద క్యారెక్టర్ లో హృతికి్, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ క్యారెక్టర్ లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. విక్రమ్ వేద లాంటి పవర్ పుల్ యాక్షన్ సబ్జెక్ట్ తో పాటు.. వార్ మూవీతో కమర్షియల్ గా, కెరీర్ పరంగా మంచి మైలేజ్ ఇచ్చిన సిద్దార్ద్ తో సినిమా చేస్తున్న హృతిక్ ఫైటర్ సినిమాని కూడా రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. దేశం కోసం పోరాడే పేట్రియాటిక్ రోల్ లో కనిపించబోతున్నారు హృతిక్ రోషన్. మార్ ఫ్లిక్స్ ప్రొడక్షన్స్ లో దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28 2023 న రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసింది.
Bollywood Movies: అనౌన్స్మెంట్తోనే సినిమా చూపించేస్తున్న బాలీవుడ్!
బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కూడా 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆల్రెడీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా, జాన్ అబ్రహం విలన్ గా భారీ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న పఠాన్ మూవీ ఫుల్ స్వింగ్ లో స్పెయిన్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఇప్పటికే షూటింగ్ డిలే అయ్యిందని.. ఇక ఏమాత్రం లేట్ అవ్వకూడదని నాన్ స్టాప్ గా షూటింగ్ చేస్తున్నారు షారూఖ్. ఈ పవర్ ఫుల్ పఠాన్ మూవీ.. జనవరి 25 2023లో రిలీజ్ కాబోతోంది. పఠాన్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ తో పాటు.. అట్లీతో నయనతార హీరోయిన్ గా మరో మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని కూడా ప్యార్లల్ గా చేస్తున్నారు షారూఖ్ ఖాన్. రాజుహిరానీతో మరో సినిమాని కూడా ఫైనల్ చెయ్యడానికి ప్లాన్ లో ఉన్నారు షారూఖ్. ఈ సినిమాలతో పాటు టైగర్ 3, బ్రహ్మాస్త్ర, రాకెట్రీ లాంటి సినిమాలతో క్యామియో రోల్స్ కూడా చేసి ఫాన్స్ ని అప్పుడప్పుడు మెస్మరైజ్ చెయ్యబోతున్నారు.
Bollywood Heroins: మిసెస్ హీరోయిన్స్.. కెరీర్ తో పెళ్లి కూడా ముఖ్యమే!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.. ఇప్పుడిప్పుడే జూలు విదిలిస్తున్నారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే సల్మాన్ ఖాన్.. ఇప్పుడు ప్యార్లల్ గా సినిమాలు చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ రాధే, అన్తిమ్ తో వచ్చిన సల్మాన్ ఖాన్.. ఈ సారి కూడా ఫాన్స్ కి ఇదే రేంజ్ లో యాక్షన్ ఫీస్ట్ ప్లాన్ చేశారు. కోవిడ్ టైమ్ లో కూడా సినిమాలు రిలీజ్ చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసిన సల్మాన్ ఖాన్.. తన కెరీర్ కి మంచి బూస్టప్ ఇచ్చిన టైగర్ సినిమాకి సీక్వెల్ టైగర్ 3ని కూడా అదే రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా పవర్ ఫుల్ కాప్ స్టోరీ గా ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 21, 2023 లో రిలీజ్ అవుతోంది. టైగర్ 3 సినిమాతో పాటు సల్మాన్ ఖాన్.. షారూఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ లో కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు.
Bollywood Stars: లేట్లతీఫ్.. లాగ్ గ్యాప్ తీసుకుంటున్న స్టార్ హీరోలు!
ఇక అమీర్ ఖాన్ చేస్తున్న లాల్ సింగ్ చద్దాలో కూడా స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తున్నారు సల్మాన్ ఖాన్. ఫరాద్ సమ్జీ డైరెక్షన్లో సల్మాన్, పూజాహెగ్డే జంటగా తెరకెక్కుతున్న కభీ ఈద్, కభీ దివాళి సినిమా కూడా సెట్స్ మీద బిజీగా ఉంది. యాక్షన్ సినిమాలతో పాటు.. హిలేరియస్ ఎంటర్ టైన్ మెంట్ తో వచ్చిన నో ఎంట్రీ సినిమాకి సీక్వెల్ కూడా త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. వీటితో పాటు కిక్ 2 ప్లాన్ కూడా రెడీ చేస్తున్నారు సల్మాన్ భాయ్. ఈ సినిమాలే కాకుండా తెలుగులో మోహన్ రాజా డైరెక్షన్లో చిరంజీవి హీరోగా చేస్తున్న గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీస్ తో పాటు కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అయిన భజరంగీ భాయ్ జాన్ సినిమాకి కూడా సీక్వెల్ చేస్తున్నట్టు.. అనౌన్స్ చేశారు సల్మాన్ ఖాన్.
Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!
బాలీవుడ్ హిట్ మెషీన్ అక్షయ్ కుమార్, బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ఇంకా స్పీడందుకున్నాయి. బాక్సాఫీస్ దగ్గర ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా అంతగా ఆడదో గెస్ చెయ్యగలిగే అక్షయ్ కి.. రామ్ సేతు, బచ్చన్ పాండే, పృద్విరాజ్ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలే కాకుండా రక్షాబంధన్, ఓ మై గాడ్ కు సీక్వెల్ మూవీస్ కూడా షూటింగ్ ప్రాసెస్ లోనే ఉన్నాయి. సినిమాలతో పాటు ప్రైవేట్ సాంగ్స్ చేస్తూనే వెబ్ ది ఎండ్ అనే వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు అక్షయ్. ఇలా అటు బిగ్ స్క్రీన్ తో పాటు.. ఓటీటీల్ని కూడా కవర్ చేస్తున్నారు. ప్రజెంట్ బచ్చన్ పాండేలో లుక్ తో పాటు డిఫరెంట్ యాక్షన్ తో రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ఇలా బాలీవుడ్ హీరోలు బ్యాక్ టూ ఫామ్ లో ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్నారు.
- Salman Khan : టాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్న సల్మాన్..
- Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్
- Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న సల్మాన్ ఖాన్
- Ram Charan: బాలీవుడ్లో చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా..?
- Adivi Sesh : నాకు ఆయనలా లవ్ అఫైర్లు లేవు.. కానీ లవ్ లో దెబ్బ తిన్నాను..
1Ukraine: యుద్ధం కొనసాగినన్ని రోజులు ఉక్రెయిన్‌కు సాయం చేస్తూనే ఉంటాం: బైడెన్
2Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
3Maharashtra: మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా ఫడ్నవీస్
4Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
5Maharashtra: అలాగైతే వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమని గ్రహించాం: ఏక్నాథ్ షిండే
6PSLV C53: పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
7Nurse Gang Raped : బెదిరించి, మద్యం తాగించి కారులో యువతిపై గ్యాంగ్ రేప్.. చెన్నైలో దారుణం
8Eknath Shinde: షిండే సీఎం అయ్యిండు.. టేబుళ్లెక్కి డ్యాన్స్ చేసిన సేన రెబల్స్ ఎమ్మెల్యేలు.. వీడియో వైరల్
9Anasuya: యాంకర్ అనసూయ కొత్త ఫోటోలు.. చూసి తీరాల్సిందే!
10NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..
-
Bunny Vas: మరోసారి కథనే నమ్ముకున్న GA2 పిక్చర్స్
-
Oppo Reno 8 Series : ఒప్పో రెనో 8 వచ్చేస్తోందోచ్.. ఫీచర్లు అదుర్స్.. ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Pigeon Droppings : పావురాల వ్యర్ధాలతో శ్వాసకోశ జబ్బులు!