Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!

సెలబ్రిటీలు ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉండాలనుకుంటారు. కానీ జస్ట్ యాక్టింగ్ తోనే సెలబ్రిటీలు అయిపోరు అందరూ. వాళ్లు చేసే ఇంట్రస్టింగ్ యాక్టివిటీస్ తో సెలబ్రిటీ స్టేటస్ తో ఎప్పుడూ..

Star Heroins Business: బ్రాండ్ వాల్యూ క్యాష్ చేసుకుంటున్న స్టార్ బ్యూటీస్!

Star Heroins Business

Star Heroins Business: సెలబ్రిటీలు ఎప్పుడూ లైమ్ లైట్లోనే ఉండాలనుకుంటారు. కానీ జస్ట్ యాక్టింగ్ తోనే సెలబ్రిటీలు అయిపోరు అందరూ. వాళ్లు చేసే ఇంట్రస్టింగ్ యాక్టివిటీస్ తో సెలబ్రిటీ స్టేటస్ తో ఎప్పుడూ లైమై లైట్లో ఉండే ఛాన్స్ దక్కించుకుంటారు. అలా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎప్పుడూ బిజీగా సినిమాలు చేస్తూ.. డబ్బులు వెనకేసుకోవడమే కాదు.. స్టార్టప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ స్మాల్ బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్.. తన క్రేజ్ ని జస్ట్ సినిమాల కోసమే కాకుండా స్టార్టప్ బిజినెస్ లకు హెల్ప్ చెయ్యడానికి కూడా వాడుతోంది. ఇప్పటికే చాలా సోషల్ యాక్టివిటీస్ చేస్తున్న దీపికా.. మల్టిపుల్ స్టార్టప్ లకి ఇన్వెస్ట్ మెంట్ హెల్ప్ చేస్తోంది. డ్రమ్స్ ఫుడ్ ఇంటర్నేషనల్, ఎపిగామియా, బెంగుళూరు బేస్డ్ స్పేస్ టెక్ స్టార్టప్ బెల్లాట్రిక్స్, డిజిటల్ పెట్ కేర్ ఫౌండేషన్ తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్ట్ కంపెనీ బ్లూ స్మార్ట్ అనే చాలా కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది.

New Film Releases: కొత్త సినిమా వచ్చిందా.. తెలంగాణ వైపు సరిహద్దు ఏపీ ప్రేక్షకులు!

ఈమధ్య పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కూడా హయ్యస్ట్ పెయిడ్ ఆర్టిస్ట్ తోపాటు అంతే తెలివిగా ఇన్వెస్ట్ చేసే హీరోయిన్స్ లో ఒకరు. ఈ స్టార్ హీరోయిన్ తన ఓన్ బ్యూటీ బ్రాండ్ ‘కే’ లో ఇన్వెస్ట్ చెయ్యడమే కాకుండా మరికొన్ని బ్యూటీ బ్రాండ్స్ కి ఎంబాసిడర్ గా పని చేస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయన్ ఆలియా భట్ కూడా స్టార్టప్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేస్తోంది. సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించడమే కాకుండా తెలివిగా వాటిని ఇన్వెస్ట్ చేస్తోంది. ఫ్యాషన్ స్టార్టప్ స్టైల్ క్రాకర్ అనే ఫ్యాషన్ కంపెనీలో స్టేక్ హోల్డర్ అయ్యింది. అంతేకాదు.. మరో బ్యూటీ బ్రాండ్ నైకాలో కూడా షేర్ తీసుకుంది ఆలియా భట్.

2022 Summer Film Releases: సమ్మర్‌లో కూడా హీట్ పెంచేయనున్న స్టార్ హీరోలు!

మరో యంగ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కూడా ఈ సంవత్సరం ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేసింది. డి2సి అనే బ్యూటీ బ్రాండ్ కి పెట్టుబడి పెడుతోంది శ్రద్దా. బ్రాండ్ ప్రొడక్ట్స్ ని ఎండార్స్ చెయ్యడమే కాకుండా తన ఓన్ వెబ్ సైట్ ద్వారానే ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ అయ్యే వెబ్ సైట్, యాప్ లను కూడా ప్రమోట్ చేస్తోంది శ్రద్దా. ఫిట్ నెస్ ఫ్రీక్ శిల్పాశెట్టి కూడా దాదాపు కోటిన్నర వరకూ బేబీ ప్రొడక్ట్స్ స్టార్టప్ కంపెనీ మమా ఎర్త్ లో ఇన్వెస్ట్ చేసింది. ఈ బ్రాండ్ ఆసియాలోనే సేఫ్ మేడ్ అనే సర్టిఫికెట్ సంపాదించిన ఫస్ట్ బ్రాండ్. ఈ బిజినెస్ లోనే కాకుండా సింపుల్ సోలో ఫుల్ అనే హోలిస్టిక్ వెల్ నెస్ హెల్త్ యాప్ స్టరా్ట్ చేసిన ఎక్స్ పర్ట్స్ చేత యోగా, ఎక్సర్ సైజెస్ తో పాటు ఇమ్యూనిటీ, డైట్ ప్రోగ్రామ్స్ కూడా చేయిస్తోంది శిల్పాశెట్టి.

Samantha: సామ్ క్రేజీ ఫార్ములా.. సినిమాలన్నీ డిఫరెంట్ రోల్సే!

బాలీవుడ్ దీవా ఐశ్వర్యారాయ్ చాలా కంపెనీల్లో వాటాలు కొనేసింది. న్యూట్రిషన్ బేస్డ్ కంపెనీతో పాటు బెంగుళూరు బేస్డ్ ఎన్విరాన్ మెంటల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అంబీ కంపెనీలో 50 లక్షలు పెట్టుబడి పెట్టింది. ఈ స్టార్టప్ హెల్త్ రీసెర్చెస్, మీడియా కంపెనీస్, డేటా డెవలపర్స్ కి బెటర్ డెసిషన్ మేకింగ్ కి హెల్ప్ చేస్తోంది. ఇప్పటికే మీడియా హెడ్ లైన్స్ లో ఉన్న జాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా స్టార్టప్ కంపెనీస్ లోఇన్వెస్ట్ చేసింది. రా ప్రెసరీ అనే బ్రాండ్ తో జ్యూస్ అమ్మే ముంబై బేస్డ్ స్టార్టప్ రక్యాన్ బివరేజెస్ లో పెట్టుబడి పెట్టింది. ఈ కంపెనీ ఇండియాలోనే హై ప్రెషర్ ప్రోసెసింగ్ టెక్నాలజీతో న్యూట్రిషన్ వాల్యూస్ పోకుండా నాచరల్ ప్రొడక్ట్స్ తయారుచేసే కంపెనీగా మంచిపేరు సంపాదించింది.

Anasuya: ఓ రేంజ్‌లో అనసూయ గ్లామర్ ట్రీట్.. ఫోటోలు వైరల్!

మరో స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా బాలీవుడ్ సెలబ్రిటీ ఇన్వెస్టర్లలో ఒకరు. 2018లోనే బంబుల్ అనే అమెరికా బేస్డ్ డేటింగ్ యాప్ లో పార్టనర్ తో పాటు ఎడ్వైజర్ గా కొనసాగుతోంది. అంతే కాదు దాదాపు 60 కోట్ల వరకూ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకునే హోబర్ట్ స్కూల్ లో భారీగా ఇన్వెస్ట్ చేసింది. దీంతో పాటు అమెరికా టెక్నాలజీ బేస్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీ లో కూడా భారీగానే పెట్టుబడులుపెట్టింది ప్రియాంకా. ఇలా హీరోయిన్లు డబ్బు సంపాదించడమే కాకండా చిన్న బిజినెస్ లు, స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు.