Love Couples Age Gap : బాలీవుడ్ జంటల ప్రేమలకు ఏజ్ తో సంబంధమే లేదు.. కానీ మరీ ఇంతా గ్యాపా?

ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు ఈ బాలీవుడ్ స్టార్ కపుల్. ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబందం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్లు. 5,6 ఏళ్లంటే కామన్ కానీ చూస్తూ చూస్తూ మరీ 10 ఏళ్లు పెద్దవాళ్లు, 15 ఏళ్లు చిన్నవాళ్లతో ప్రేమ అంటే................

Love Couples Age Gap : బాలీవుడ్ జంటల ప్రేమలకు ఏజ్ తో సంబంధమే లేదు.. కానీ మరీ ఇంతా గ్యాపా?

Bollywood stars love and marriages with too much age gap partners going viral

Love Couples Age Gap :  ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్నారు ఈ బాలీవుడ్ స్టార్ కపుల్. ప్రేమకి, పెళ్లికి వయసుతో సంబందం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఈ బాలీవుడ్ స్టార్లు. 5,6 ఏళ్లంటే కామన్ కానీ చూస్తూ చూస్తూ మరీ 10 ఏళ్లు పెద్దవాళ్లు, 15 ఏళ్లు చిన్నవాళ్లతో ప్రేమ అంటే షాక్ అవ్వడం కామనే. కానీ మా ప్రేమకు వయసు అడ్డు కాదంటూ ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ కపుల్స్.

49 ఏళ్ల హృతిక్ రోషన్ 32 ఏళ్ల యంగ్ అమ్మాయి సబా ప్రేమలో ఉన్నారు. సుజానే ఖాన్ తో డివోర్స్ అయిన తర్వాత తనకంటే 17 ఏళ్లు చిన్నదైన సబా ఆజాద్ తో డేటింగ్ చేస్తున్నారు హృతిక్. మొన్నటి వరకూ వీళ్ల మధ్యే ఉన్న ప్రేమ లేటెస్ట్ గా ఎయిర్ పోర్ట్ దగ్గర మీడియాకి కూడా దొరికిపోయింది. అప్పటి నుంచి వీళ్ల ప్రేమ గురించి వార్తలు హైలెట్ అవ్వడంతో మరో సారి వీళ్ల పెళ్లి మాట హాట్ టాపిక్ అయ్యింది. ఇంతగా ప్రేమించుకుంటున్న సబా, హృతిక్ ఈ సంవత్సరం చివర్లో పెళ్లి చేసుకుంటున్నారని, నవంబర్ లోనే వీళ్ల పెళ్లి జరగబోతోందని టాక్ నడుస్తోంది.

లాస్ట్ ఇయర్ 10 ఏళ్ల ఏజ్ గ్యాప్ తో పెళ్లి పీటలెక్కిన జంట ఆలియాబట్, రణబీర్ కపూర్. మరీ చిన్న పిల్లలా ఉన్న ఆలియాను ఎలా పెళ్లి చేసుకుంటాడంటూ రకరకాల రూమర్స్ నడిచాయి రణబీర్ మీద. అయితే 29 ఏళ్ల వయసులో కెరీర్ ఫుల్ స్పీడ్ మీదున్న టైమ్ లో ఆలియా పెళ్లి చేసుకుంటే రణబీర్ 40ల్లోకి వెళ్లకుండా ముందు జాగ్రత్తగా 39 ఏళ్ల వయసులోనే పెళ్లిపీటలెక్కేశాడు. 10 ఏళ్ల వయసు తేడా ఉన్నా కూడా కరెక్ట్ మెచ్యూరిటీతో 4 ఏళ్ల తమ రిలేషన్ ని పెళ్లిగా మార్చుకుని కూతురు రాయాతో సూపర్ హ్యపీ లైఫ్ లీడ్ చేస్తోంది ఈ జంట.

మరో స్టార్ కపుల్ ప్రియాంకా చోప్రా భర్త నిక్ జోనస్ మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఎక్కువే. 39 ఏళ్ల స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా 29ఏళ్ల నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 10ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా అది జస్ట్ ప్రపంచానికే కానీ మాకు, మా ప్రేమకు కాదు అంటూ కూతురు మాల్తీతో హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ జంట.

ప్రేమకు వయసు అడ్డుకాదని ప్రూవ్ చేసిన బాలీవుడ్ ప్రజెంట్ హాట్ కపుల్ అర్జున్ కపూర్, మలైకా అరోరా. ఈ ఇద్దరి మధ్యా ఏజ్ గ్యాప్ 12 ఏళ్లు. సల్మాన్ తమ్ముడు ఆర్బాజ్ తో విడాకులు తీసుకున్నాక 49 మలైకా 37 ఏళ్ల హీరో అర్జున్ కపూర్ ని ఇష్టపడింది. 50 ఏళ్లకు దగ్గరవుతున్న వయసులో తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన హీరోతో డేటింగ్ అవసరమా అంటూ కాంట్రవర్సీలు, ట్రోలింగ్ వచ్చినా అసలు పట్టించుకోలేదు. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని బాలీవుడ్ న్యూస్.

కరీనా కపూర్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. అప్పటికే సైఫ్ కి పెళ్లై పిల్లలుకూడా ఉన్నారు. వీళ్లిద్దరికీ వయసులో 10 ఏళ్లు తేడాకూడా ఉంది. అయినా ఇవేం పట్టించుకోకుండా ప్రేమించేసుకున్నారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటున్న ఈ జంట ఇప్పటికీ అదే ఈజ్ తో కపుల్ గోల్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ డివోర్స్ అయిన 52 ఏళ్ల వయసున్న సైఫ్ అలీ ఖాన్ ని వయసులో 10 ఏళ్లు చిన్నదైన 42 ఏళ్ల కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకుంది.

Kabzaa Trailer : కబ్జ ట్రైలర్ రిలీజ్.. కథా వేరేమో.. టేకింగ్ మాత్రం అచ్చం KGF.. సినీ పరిశ్రమలో మరో KGF కానుందా??

బాలీవుడ్ మోడల్, నటుడు, ఫ్రిట్ నెస్ ఫ్రీక్ అయిన మిలింద్ సోమన్ అయితే తనకంటే 26 ఏళ్లు చిన్నదైన అంకితను పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యతో విడిపోయిన తర్వాత 57 ఏళ్ల మిలింద్ 31 ఏళ్ల అంకితని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కూతురు వయసున్న అమ్మాయితో ప్రేమ, పెళ్లి ఏంటని నెగెటివిటీ ఫేస్ చేసినా తమ ప్రేమ ముందు అవన్నీ పట్టించుకోలేదు ఈ జంట. ఇలా బాలీవుడ్ జంటలు ఎక్కువ ఏజ్ ఉన్నా ప్రేమ, పెళ్ళికి ఓకే అంటూ అందరికి ఆశ్చర్యం కలిగిస్తున్నారు.