Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!

పెద్ద హీరోల్ని చూసి ఎన్నాళ్లయ్యిందో, ఎప్పుడెప్పుడు ధియేటర్లో బొమ్మ పడుతుందా..? ఎప్పుడెప్పుడు స్టార్ హీరోల్ని చూద్దామా అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. స్పెషల్లీ బాలీవుడ్ లో..

Bollywood Star’s: రెండేళ్లుగా ఆడియన్స్ చూడని హీరోలు.. ఈ ఏడాదిపైనే ఆశలన్నీ!

Bollywood Star's

Bollywood Star’s: పెద్ద హీరోల్ని చూసి ఎన్నాళ్లయ్యిందో, ఎప్పుడెప్పుడు ధియేటర్లో బొమ్మ పడుతుందా..? ఎప్పుడెప్పుడు స్టార్ హీరోల్ని చూద్దామా అని ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. స్పెషల్లీ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తప్ప.. స్టార్ హీరోలు ధియేటర్లోకొచ్చి చాలా కాలమైంది. అందుకే ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాల కోసం కాచుకుని కూర్చున్నారు అభిమానులు. 2021లో కోవిడ్ స్టార్ హీరోల్ని ధియేటర్లకు రానివ్వకుండా చేసింది. కొన్ని సార్లు రావడం లేటవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అంటున్నారు ఈ బాలీవుడ్ స్టార్ హీరోలు. ఇప్పటికే లేటయిందనుకుంటున్న హీరోలు ఎట్టి పరిస్తితుల్లో ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రావల్సిందే అని గట్టి ప్లాన్లే వేసుకున్నారు.

Ram Charan: శ్యామ్ దర్శకుడితో చెర్రీ.. ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్టే!

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ దగ్గరనుంచి రణబీర్ కపూర్ వరకూ లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సంవత్సరం ధియేటర్లోకొస్తున్నారు స్టార్ హీరోలు. షారూఖ్ ఖాన్ అప్పుడెప్పుడో 2018లో వచ్చిన జీరో సినిమా తర్వాత ఇప్పటి వరకూ ప్రేక్షకుల్ని పలకరించిందే లేదు. దాదాపు మూడేళ్ల పాటు స్టోరీలు విన్న షారూఖ్ ఖాన్ ..లాస్ట్ కి పఠాన్ సినిమాని ఓకే చేశారు. స్పై యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న పఠాన్ లో సల్మాన్ ఖాన్ కూడా కామియో రోల్ ప్లే చేస్తున్నారు. పఠాన్ మూవీని ఎట్టి పరిస్తితుల్లో ఈ సంవత్సరం కంప్లీట్ చేసి బిగ్ స్క్రీన్ మీదకి రావాలనుకుంటున్నారు షారూఖ్.

Bangarraju: అక్కినేని హీరోల దూకుడుకి బ్రేకేసిన కోవిడ్..!

బాలీవుడ్ మ్యాన్ లీ హంక్ హృతిక్ రోషన్ కూడా ధియేటర్లోకొచ్చి రెండేళ్లవుతుంది. 2019లో వార్, సూపర్ 30 సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ కొట్టిన హృతిక్ రోషన్ ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. సౌత్ సూపర్ హిట్ మూవీ విక్రమ్ వేద రీమేక్ లో సైఫ్ అలీఖాన్ తో చేస్తున్న హృతిక్.. ఈ సంత్సరం రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు.బాలీవుడ్ ఖాన్ అమీర్ ఖాన్ కూడా సిల్వర్ స్క్రీన్ మీదకొచ్చి మూడేళ్లవుతోంది. అమితాబ్ బచ్చన్ తో థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ లాంటి డిజాస్టర్ ఫేస్ చేసిన అమీర్ ఖాన్.. నెక్ట్స్ సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్నారు. ఆ తరవాత స్టార్ట్ చేసిన లాల్ సింగ్ చద్దా కోవిడ్ తో పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్దా ఏప్రిల్ 14న రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

మరో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ 2018లో సంజూతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే.. సంజూ తర్వాత సినిమా చెయ్యడానికి మాత్రం చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఆ గ్యాప్ ని ఈ సంవత్సరం రెండు సినిమాలతో కాంపన్సేట్ చెయ్యబోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతున్న బ్రహ్మాస్త్రతో పాటు షంషేర్ లాంటి ఇంట్రస్టింగ్ మూవీతో ఈ సంవత్సరం ధియేటర్లోకొస్తున్నారు రణబీర్ కపూర్. ఇలా రెండుమూడేళ్ల నుంచి అసలు ఆడియన్స్ ని పలకరించని హీరోలు ఈ సంవత్సరం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో రెడీ అవుతున్నారు.