Bollywood : 2023లో అయినా బాలీవుడ్ కంబ్యాక్ ఇస్తుందా?? కొత్త సినిమాలతో 2023ని టార్గెట్ చేసిన బాలీవుడ్..

2022 మొత్తంలో బాలీవుడ్ హిట్స్ అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భారీ హిట్స్ అంటే చెప్పుకోవడానికి మూడు, నాలుగు సినిమాలు తప్ప వేరే లేవు. దీంతో 2022 బాలీవుడ్ కి భారీ నష్టాలని మిగిల్చి ఒక పీడకలగా మిగిలింది. వరుస సినిమాలతో చిన్న నుంచి పెద్ద స్టార్ల వరకు తమ సినిమాలని 2023 లో...............

Bollywood : 2023లో అయినా బాలీవుడ్ కంబ్యాక్ ఇస్తుందా?? కొత్త సినిమాలతో 2023ని టార్గెట్ చేసిన బాలీవుడ్..

Bollywood Target 2023

Bollywood :  కరోనా తర్వాత 2022లో సౌత్ పికప్ అయినంత స్పీడ్ గా బాలీవుడ్ పెద్దగా పికప్ అవ్వలేకపోయింది. రెండేళ్ల నుంచి వెయిట్ చేసి భయంభయంగానే సినిమాలు రిలీజ్ చేసినా అవి కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి భారీ నష్టాలు మిగల్చడంతో బాలీవుడ్ ఆశలన్నీ ఈ సంవత్సరం మీదే పెట్టుకుంది. సల్మాన్, షారూఖ్ లాంటి స్టార్ హీరోల దగ్గరనుంచి యంగ్ హీరోల వరకూ అందరూ ఈ సంవత్సరం అయినా లక్ మారుతుందని, సక్సెస్ వస్తుందని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే ఇంట్రస్టింగ్ కంటెంట్ తో రీలోడ్ అయిన బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించడానికి అదిరిపోయే సినిమాల్ని ఈ 2023లో రిలీజ్ కి రెడీ చేస్తోంది.

ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అవుతోంది బాలీవుడ్. పోయిన సంవత్సరం బాక్సాఫీస్ దగ్గర అంతగా ఎఫెక్ట్ చూపించలేకపోయిన బాలీవుడ్ స్టార్లు ఈ సారి ఆడియన్స్ ని మెప్పించడానికి సాలిడ్ కంటెంట్ తో రెడీ అవుతున్నారు. ముఖ్యంగా 5 ఏళ్ల నుంచి అసలు ధియేటర్లలో అడ్రసే లేని షారూఖ్ ఖాన్ ఈ సారి మొత్తం 3 సినిమాలతో ట్రిపుల్ ఫీస్ట్ ప్లాన్ చేశారు. స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా షారుఖ్ హీరోగా దీపికా పదుకోన్, జాన్ అబ్రహం లీడ్ రోల్స్ లో 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న పఠాన్ మూవీని 2023 జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు షారూఖ్. 2023 లోనే రిలీజ్ కు రెడీ అవుతున్న షారూఖ్ ఖాన్ మరో మూవీ జవాన్. యంగ్ సౌత్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో మాస్ యాక్షన్ మూవీ గా తెరకెక్కుతున్న జవాన్ మూవీ జూన్ 2న సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. నయనతార, ప్రియమణి, షారూఖ్ ఖాన్, విజయ్ సేతుపతి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న జవాన్ మూవీ ఫస్ట్ లుక్ వీడియోతోనే ఇంటెన్స్ మూవీ గా ఆడియన్స్ లో ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఈ ఇయర్ ఎండ్ కి కూడా మరో సినిమా రిలీజ్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు షారూఖ్. రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా డిసెంబర్ 23న రిలీజ్ అనౌన్స్ చేశారు. ఇలా వరసగా 6 నెలల గ్యాప్ లో ప్రతి సీజన్ కీ ఒక్కో సినిమా రిలీజ్ తో ఆడియన్స్ కి ట్రిపుల్ ట్రీట్ ప్లాన్ చేశారు షారూఖ్ ఖాన్. మరి ఈ మూడు సినిమాలు షారుఖ్ కి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో చూడాలి.

 

బాలీవుడ్ మరో స్టార్ హీరో సల్మాన్ కూడా ఫుల్ ప్యాక్డ్ మూవీస్ తో రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కిసీకా భాయ్ కిసీకీ జాన్ సినిమాని ఈద్ కి 21 ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ వెయిట్ చేస్తున్ మరో ఇంట్రస్టింగ్ మూవీ సల్మాన్ ఖాన్ టైగర్ 3. యాక్షన్ ఎంటర్టైనర్ ఫ్రాంచైజ్ లో బాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టైగర్ 3 మూవీని ఈ ఇయర్ లాస్ట్ లో నవంబర్ 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా మనీష్ శర్మ డైరెక్షన్లో 250 కోట్ల బడ్జెట్ తో సాలిడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది టైగర్ 3.

 

ఈ సంత్సరం రిలీజ్ అవ్వాల్సిన మోస్ట్ అవెయిటింగ్ మూవీస్ లో ఆదిపురుష్ కూడా ఒకటి. తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన ఓమ్ రౌత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ 500కోట్ల భారీ విజువల్ వండర్ గా ఆడియన్స్ ముందుకొస్తోంది. హీరో ప్రభాస్ టాలీవుడ్ అయినా ఇది బాలీవుడ్ సినిమాగానే తెరకెక్కుతుంది. నిజానికి 2023 జనవరిలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా టీజర్ విషయంలో నెగెటివిటీ ఫేస్ చేసిన ఆదిపురుష్ టీమ్ బెటర్ మెంట్స్ కోసం మరో 6 నెలలు టైమ్ తీసుకుని జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. భారీ బడ్జెట్ పాన్ ఇండియా వైడ్ గా ప్రభాస్, కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న ఈ రామాయణాన్ని చూడడానికి ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అలవైకుంఠపురంలో సినిమాని ‘షెహజాదా’గా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా అల్లు ఎంటర్ టైన్ మెంట్స్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న షెహజాదా రోహిత్ ధవన్ డైరెక్షన్లో రీమేక్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ టీజర్ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యడంతో ఫిబ్రవరి 10న రిలీజ్అవ్వబోతున్న సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక్కడ సూపర్ హిట్ కొట్టిన అలవైకుంఠపురంలో సినిమా అక్కడి ప్రేక్షకులని ఎంతగా మెప్పిస్తుందో చూడాలి.

#PVT04 : భయంకరమైన ప్రయాణం అంటూ.. సమ్మర్ బరిలో పంజా వైష్ణవ్ తేజ్..

2022ని మంచి హిట్ తో సెండాఫ్ ఇద్దామనుకున్న రణవీర్ సింగ్ ఆశలన్నీ గల్లంతు చేసింది సర్కస్. కానీ ఈ సారి మాత్రం అన్ని రకాల ఆడియన్స్ ని కనెక్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుని రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కథా అనే బ్యూటిఫుల్ ఫ్యామిలీ లవ్ స్టోరీతో వస్తున్నారు. రణవీర్ సింగ్, ఆలియా భట్ లీడ్ రోల్స్ లో కరణ్ జోహార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సూపర్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీ ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

 

లాస్ట్ ఇయర్ బ్రహ్మాస్త్రతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రణబీర్ కపూర్ ఈ సంవత్సరం మినిమం 2 సినిమాల రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నాడు. సందీప్ రెడ్డి డైరెక్షన్లో రష్మిక మందాన హీరోయిన్ గా రణబీర్ కపూర్ చేస్తున్నయానిమల్ మూవీ ఆగస్ట్ 11న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసకుంది. ఈ సినిమా కంటే ముందే లవ్ రంజన్ డైరెక్షన్లో శ్రద్దాకపూర్ హీరోయిన్ గా తు ఝూటీ మే మక్కార్ అనే క్రేజీ లవ్ కామెడీ ఎంటర్ టైనర్ మార్చి 8న ఆడియన్స్ ముందుకొస్తోంది.

మినిమం గ్యారంటీ హీరోగా పేరున్న అక్షయ్ కుమార్ లాస్ట్ ఇయర్ బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్స్ అందుకన్నారు. వరస పెట్టి రిలీజ్ చేసిన 5 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ సంవత్సరం మాత్రం ఇంట్రస్టింగ్ సబ్జెక్ట్ తో సెల్ఫీ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. అంతే కాదు అక్షయ్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా మలయాళ స్టార్ పృధ్విరాజ్ సుకుమారన్ ఇంపార్టెంట్ రోల్ లో తెరకెక్కుతున్న బడేమియా ఛోటేమియా కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేస్తున్నారు అక్షయ్. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఒకప్పుడు సూపర్ హిట్ అయిన సినిమా బడేమియా చోటేమియాని సేమ్ టైటిల్ తో ఆడియన్స్ ముందుకు తీసుకు రావడంతో ఈ సినిమా మీద ఆడియన్స్ లో ఇంట్రస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన ఓ మైగాడ్ కు సీక్వెల్ ఓ మై గాడ్ 2 తో పాటు తమిళ్ లో సూపర్ హిట్ అయిన సూరారైపోట్రు సినిమాని హిందీలో సుధకొంగర డైరెక్షన్లోనే రీమేక్ చేస్తూ ఈ సంవత్సరం రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

 

ఎప్పుడూ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చేసే అజయ్ దేవగన్ లాస్ట్ ఇయర్ రన్ వే, గంగూభాయ్, దృశ్యం 2 సినిమాలతో మంచి హిట్లు అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యడానికి సాలిడ్ సినిమాలతో వస్తున్నారు. ఫుట్ బాల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న మైదాన్ మూవీతో పాటు తమిళ్ లో సూపర్ హిట్ అయిన కార్తి మూవీ ఖైదీ రీమేక్ భోళా తో ఆడియన్స్ ముందుకొస్తున్నారు.

సమ్ థింగ్ ఇంట్రస్టింగ్ కంటెంట్ తో లాస్ట్ ఇయర్ ఎండ్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ ధావన్ భేడియా మూవీ అంచనాల్ని అందుకోలేక అంతగా హిట్ కాలేకపోయింది. కానీ ఈ సంవత్సరం అలా కాదంటున్నారు వరుణ్ ధావన్. జాన్వికపూర్ హీరోయిన్ గా వరుణ్ మార్క్ కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న బవాల్ మూవీ ఆడియన్స్ కి సూపర్ ఎక్జైటింగ్ గా ఫుల్ ఫన్ ఫిల్డ్ రైడ్ ప్లాన్ చేస్తోంది.

లాస్ట్ ఇయర్ గోవిందా నామ్ మేరా అనే ఇంట్రస్టింగ్ మూవీతో ఆడియన్స్ ని పలకరించిన విక్కీ కౌశల్ ఈ సంవత్సరం ఫుల్ ప్యాక్ మూవీస్ తో రెడీ అవుతున్నారు. ఆనంద్ తివారి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు మేఘనా గుల్జార్ డైరెక్షన్లో వస్తున్న శామ్ బహాదూర్ సినిమా కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతోంది. ఆర్మీ ఆఫీసర్ శామ్ మానెక్ షా లైఫ్ హిస్టరీ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫాతిమా సనా, సాన్యా మల్హోత్రా లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబందించి రిలీజ్ అయిన వీడియో తో నే సినిమా ఇంటెన్సిటీ చూపించి ఇంప్రెస్ చేశారు మేకర్స్ .

ప్రయోగాలు చెయ్యడానికి ఎప్పుడూ రెడీగా ఉండే ఆయుష్మాన్ ఖురానా లాస్ట్ ఇయర్ డాక్టర్ జి, యాన్ యాక్షన్ హీరో లాంటి డిఫరెంట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చి మంచి టాక్ అందుకున్నారు. ఈ సంవత్సరం కూడా తన హిట్ మూవీ సీక్వెల్ డ్రీమ్ గర్ల్ 2 తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా ఆయుష్మాన్ హీరోగా తెరకెక్కుతున్న డ్రీమ్ గర్ల్ ఈ జూన్ లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ మెర్రీ క్రిస్మస్ సినిమా కూడా, బాలీవుడ్ క్వీన్ కంగనా తేజ్ సినిమా, సిద్దార్ద్ మల్హోత్రా మిషన్ మజ్ను, యోధ సినిమాలు, అర్జున్ కపూర్ హిలేరియస్ కామెడీ యాక్షన్ కుత్తే సినిమా.. ఇలా మరిన్ని సినిమాలు 2023 లో బాలీవుడ్ నుంచి రాబోతున్నాయి.

James Camaron : ‘అవతార్ 2’లో పది నిమిషాల సీన్స్ కట్ చేసిన జేమ్స్ కామెరూన్..

2022 మొత్తంలో బాలీవుడ్ హిట్స్ అంటే వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. భారీ హిట్స్ అంటే చెప్పుకోవడానికి మూడు, నాలుగు సినిమాలు తప్ప వేరే లేవు. దీంతో 2022 బాలీవుడ్ కి భారీ నష్టాలని మిగిల్చి ఒక పీడకలగా మిగిలింది. వరుస సినిమాలతో చిన్న నుంచి పెద్ద స్టార్ల వరకు తమ సినిమాలని 2023 లో లైన్లో పెట్టారు. ఈ సారైనా మంచి విజయాలు సాధించి 2023 లో బాలీవుడ్ కి పూర్వ వైభవం తేవాలని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి మరి.