Bollywood : బాలీవుడ్ దర్శకుల పై రచయిత అసహనం.. రీమేక్‌లు ఆపండి!

బాలీవుడ్ ఆడియన్స్ హిందీ సినిమాలను బాయ్‌కాట్ చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి సినిమాలు బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి ఉదాహరణ షారుఖ్ ఖాన్ 'పఠాన్' చిత్రం. గత కొంత కాలంగా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు అన్ని రీమేక్ చిత్రాలే. కాగా ఈ విషయం పై ప్రముఖ బాలీవుడ్ రైటర్ అసహనం వ్యక్తం చేశాడు.

Bollywood : బాలీవుడ్ దర్శకుల పై రచయిత అసహనం.. రీమేక్‌లు ఆపండి!

Bollywood writer Darab Farooqui comments on bollywood remakes

Bollywood : బాలీవుడ్ ఆడియన్స్ హిందీ సినిమాలను బాయ్‌కాట్ చేశారు అంటూ చెప్పుకొస్తున్నారు. నిజానికి సినిమాలు బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. దానికి ఉదాహరణ షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ చిత్రం. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలకు సరిగా 100 కోట్ల కలెక్షన్స్ కూడా రాని తరుణంలో.. పఠాన్ మూవీ ఏకంగా 500 కోట్ల షేర్ ని సాధించింది. ఇక ఈ సినిమా తరువాత ఇటీవల విడుదలైన మరో బాలీవుడ్ స్టార్ మూవీ ‘సెల్ఫీ’. అక్షయ్ కుమార్ నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్ట లేక డిజాస్టర్ గా నిలిచింది.

Virupaksha: విరూపాక్ష కోసం వస్తున్న వీరమల్లు.. ఫ్యాన్స్‌కు పండగే!

ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కి రీమేక్. ఈ చిత్రమే కాదు గత కొంత కాలంగా బాలీవుడ్ లో డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు అన్ని రీమేక్ చిత్రాలే. బాలీవుడ్ ఆడియన్స్ హిందీ సినిమాలను రిజెక్ట్ చేయడానికి అసలైన కారణం ఇదే. అలవైకుంఠపురం, విక్రమ్ వేద, ఫారెస్ట్ గంప్ (లాల్ సింగ్ చద్దా), హెలెన్, జెర్సీ.. ఇలా సూపర్ హిట్ చిత్రాలని రీమేక్ చేసి బాలీవుడ్ లో పరాజయం అందుకుంటున్నారు. కాగా ఈ విషయం పై ప్రముఖ బాలీవుడ్ రైటర్ అసహనం వ్యక్తం చేశాడు.

దేద్ ఇష్కీయ, నోట్ బుక్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన దారాబ్ ఫారూఖీ రీమేక్ చిత్రాలు గురించి మాట్లాడుతూ.. ‘హీరోలకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చి, మిగిలిన సాంకేతిక నిపుణలకు ఇవ్వాల్సింది కూడా ఇవ్వకుండా ఉండడం మానండి. రచయితలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వండి. రాయడం అనేది ఒక ప్రత్యేకమైన పని. దాని గురించి మీకు తెలుసు అనుకుంటే మీరే కథలు రాసుకోండి. అంతేగాని ఇలా రీమేక్ లు వైపు చూడడం మానండి. స్క్రిప్ట్ లు చదవడం నేర్చుకోండి’ అంటూ బాలీవుడ్ దర్శకుల పని తీరు పై మండి పడ్డాడు.