Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!

లివింగ్ రిలేషన్‌లో ఉన్న బాలీవుడ్ జంటలన్నీ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాయి..

Bollywood Couples : పెళ్లి అప్పుడే అంటున్న బాలీవుడ్ కపుల్స్..!

Bollywood Couples

Bollywood Couples: 2021 ఎండింగ్ కల్లా హాట్ బాలీవుడ్ కపుల్స్ ఇంట పెళ్లి భాజా మోగనుంది. నిజానికి ముంబై సర్కిళ్లలో పెళ్లి ఊసెత్తకుండా కొందరు క్రేజీ కపుల్స్ రచ్చ చేస్తుంటే.. పెళ్లి పీటలెక్కుతామని ప్రకటించి హల్ చల్ చేస్తున్నవారూ ఉన్నారు. వీళ్లతో పాటే ఏజ్‌తో పాటు, గతంతో మాకు సంబంధం లేదంటూ ముంబై వీధుల్లో ప్రేమ పావురాల్లా విహరిస్తున్నారు ఇంకొంతమంది. మరి వాళ్ల మ్యారేజ్ ప్రపోజల్స్‌పై లేటెస్ట్ అప్‌డేట్స్ ఏంటో చూద్దాం..

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..
ఇంకా పెళ్లి కాలేదు కానీ.. ఇలా ఎక్కడికెళ్లినా మ్యారీడ్ కపుల్‌లా సందడి చేయడం రణ్‌బీర్, ఆలియా భట్ స్పెషాలిటీ. ఎందుకంటే ఇద్దరి ఫ్యామిలీస్ అంగీకారంతో పెళ్లి పీటలెక్కాలనుకున్నారు కాబట్టి. 2020 లోనే ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కొవిడ్‌ ఉండడం.. రణ్‌బీర్ ఫాదర్ రిషి కపూర్ మరణంతో వీళ్ల పెళ్లి వాయిదాపడింది. లేదంటే ఈపాటికే వీరిని మూడు ముళ్లబంధంతో చూసేవాళ్లం. బాలీవుడ్ జనాల్లో ప్రస్తుతం నడుస్తోన్న చర్చ ప్రకారం రణ్‌బీర్, ఆలియాల వెడ్డింగ్ ఈ ఇయర్ డిసెంబర్‌లో ఉండొచ్చు. ఏదేమైనా దీపికా, కత్రినాలతో ఫెయిల్యూర్ అఫైర్స్ తర్వాత ఆలియాతో రిలేషన్ షిప్‌ను బాగానే మెయింటైన్ చేస్తున్నాడు రణ్‌బీర్.

Alia Ranbir

ప్రస్తుతం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మ్యారేజ్ గురించే. చాలా రోజుల నుంచి డేటింగ్ చేస్తున్న వీళ్ల ఎంగేజ్‌మెంట్ రీసెంట్‌గా జరిగిపోయిందనే టాక్ నడుస్తోంది. అయితే విక్కీ తమ్ముడు సన్నీ కౌశల్ మాత్రం అవన్నీ వట్టి పుకార్లే అని కొట్టిపారేసాడు. అయినా సరే డిసెంబర్‌లో వెడ్డింగ్ డేట్‌ను లాక్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ ఉదయ్ పూర్‌లో కత్రినా – విక్కీ ఒక్కటి కాబోతున్నారన్న టాపిక్ కూడా ట్రెండ్ అవుతోంది.
Katrina-Vicky: ఏంటి.. కత్రినా-విక్కీ నిశ్చితార్ధం జరిగిపోయిందా?

శ్రద్ధా కపూర్ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉందని ఇప్పటికే చాలాసార్లు వార్తలు తెరపైకి వచ్చాయి. రీసెంట్‌గా ఈ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ బీటౌన్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నాన్నగా నేను ఆశీర్వదించడానికి రెడీ అని చెప్పుకొచ్చారు. ఇక వీళ్లతో పాటూ అర్భాజ్ ఖాన్‌కి విడాకులిచ్చి.. తనకంటే చాలా చిన్నవాడైనా అర్జున్ కపూర్‌తో మలైకా అరోరా చేస్తోన్న డేటింగ్ ఎప్పుడూ బాలీవుడ్ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. లాస్ట్‌ఇయర్ అర్జున్ – మలైకా డేటింగ్ చేస్తున్నట్టు అఫీషియల్‌గానే అనౌన్స్ చేశారు. అటు మలైకా మాజీ భర్త.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్ సైతం జార్జియా ఆండ్రియానిని ఈ ఇయర్ పెళ్లాడబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌పై కూడా రొమాంటిక్ రచ్చ చేస్తున్నారు బాలీవుడ్ కపుల్స్. హా మేము లవర్స్ అని కొన్ని జంటలు అఫీషియల్‌గా తేల్చేస్తున్నాయి. ఇంకొన్ని జోడీలు మాత్రం అనఫీషియల్‌‌గా లవ్ బర్డ్స్‌గా చక్కర్లు కొట్టేస్తున్నాయి.. రొమాంటిక్ మూడ్‌లో వీడియోలు పోస్ట్ చేస్తున్నాయి. మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా.. జంట అదిరింది.. పెళ్లెప్పుడన్న ప్రశ్నలతో ట్రెండ్ చేస్తున్నారు.

Bollywood Films : ‘పుష్ప’ తో సహా రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్న పది సినిమాలు..
అలీ ఫాజల్, రిచా చద్దా.. ఈ కపుల్ మ్యారేజ్ కూడా 2020 లోనే కావాల్సింది. పాండమిక్‌తో వాయిదా పడ్డ వీళ్ల పెళ్లి ఈ ఇయర్‌లో జరిగిపోతుందని అంటున్నారు. ముంబై, లక్నో, న్యూఢిల్లీ సిటీల్లో అలీ, రిచా పెళ్లి వేడుకలు జరుగబోతున్నాయి. 2010 నుంచే డేటింగ్ చేస్తోన్న జంట రాజ్ కుమార్ రావ్, పత్రలేఖ. వీళ్లెమో గానీ ఈ జంట ఫ్యాన్స్ మాత్రం త్వరగా పెళ్లి చేసుకోమని సలహాలు ఇచ్చేస్తున్నారు. లవ్లీ సెలెబ్రిటీ కపుల్ ఫర్హాన్ అక్తర్, షిబానీ దండేకర్ ఫ్యాన్స్ కపుల్ గోల్స్ సెట్ చేస్తున్నారు. పెళ్లి త్వరలోనే అంటూ కథలు చెప్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Richa Chadha (@therichachadha)

కపూర్ ఫ్యామిలీ సెలెబ్రెషన్స్‌లో ఎప్పటికప్పుడు సందడి చేసే జంట అదర్ జైన్, తారా సుతారియా. ఎన్నో వెకేషన్స్‌ని ఎంజాయ్ చేసిన వీళ్ల మ్యారేజ్ ఈ ఏడాదే సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ముదురు భామ సుస్మితా సేన్ సైతం పెళ్లి కూతురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రోహ్మన్ షాళ్‌తో లాంగ్ రన్ లవ్ నడిపిస్తోన్న సుస్మితా.. త్వరలోనే వెడ్డింగ్ డేట్‌ను అనౌన్స్ చేయొచ్చనే టాక్ నడుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sushmita Sen (@sushmitasen47)

ఇలాంటి వీడియోలతో సోషల్ రచ్చ చేస్తున్నారు కియారా – సిద్ధార్థ్. వీటిని చూస్తోన్న ఫ్యాన్స్ పెళ్లెప్పుడని కియారా – సిద్ధార్థ్ జంటని క్వశ్చన్స్‌తో అటాక్ చేస్తున్నారు. తెరపైనే కాదు.. బయట కూడా జోడీ అదిరిపోయిందని.. ఇక మ్యారేజ్ చేసుకోండని డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు. ప్రెజెంట్ సోషల్ మీడియాలో సిద్ధార్థ్ – కియారా మ్యారేజ్‌పై ఓ రేంజ్‌లో చర్చ నడుస్తోంది. కొవిడ్ టైంలో మాల్టీవుల్లో హీటెక్కించిన ఈ జంటపై అప్పటినుంచే రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఇక రీసెంట్ ‘షేర్షా’ మూవీలో సూపర్ జోడీగా ఆన్ స్క్రీన్ కనిపించడమే కాదు.. ఆఫ్ స్క్రీన్ ప్రమోషన్స్‌లో, పార్టీలో కూడా రొమాంటిక్ కపుల్‌గా కనిపిస్తూ హాట్ టాపిక్‌గా మారుతున్నారు.

Kiara Sidharth

దిశా పటానీ – టైగర్ ష్రాప్‌లది కూడా బాలీవుడ్‌లో క్యూట్ జోడీనే. పెళ్లెప్పుడంటే నోరు విప్పరు కానీ బాలీవుడ్ క్రేజీ డేటింగ్ కపుల్‌గా మాత్రం పేరు తెచ్చుకుంటున్నారు. దిశా పటానీ.. టైగర్ సిస్టర్ కృష్ణ ష్రాఫ్‌తో కూడా క్లోజ్‌గా ఉంటుంది. ఈ ముగ్గురు కలిసి హ్యాంగ్ అవుట్ అవుతూనే ఉంటారు. ‘భాగీ 2’, ‘భాగీ 3’ సినిమాలతో పాటే దిశా, టైగర్‌ల మధ్య లవ్ బాండింగ్ ఓ రేంజ్‌లో పెరిగింది. ఆఫ్ ది రికార్డ్ కలిసి షికార్లు చేయడం, ప్రేమ కబుర్లు చెప్పుకోవడం లాంటి విషయాలన్నీ బాలీవుడ్ ఓపెన్ సీక్రెట్సే..

Disha Tiger

ఇప్పటివరకు ఇండస్ట్రీకి పరిచయం కాలేదు కానీ సోషల్ మీడియా హాట్ షాట్స్‌తో జనాలకి బాగా దగ్గరైన భామ ఐరా ఖాన్. ఆమిర్ ఖాన్ కూతురుగా సెలెబ్రిటీ హోదా దక్కించుకున్నా పాపులరయింది మాత్రం నుపూర్ శిఖారేతో డేటింగ్‌తోనే. ఈయన ఎవరో కాదు ఆమె పర్సనల్ ఫిటెనస్ ట్రైనర్. చాలాసార్లు పబ్లిక్‌గానే బాయ్ ఫ్రెండ్ గురించి ఐరా.. గర్ల్ ఫ్రెండ్ గురించి నుపూర్ ఓపినియన్స్ డ్రాప్ చేశారు. వీళ్లు కూడా పెళ్లి ప్రస్తావన తీసుకురారు కానీ ఏమాత్రం సిగ్గు పడకుండా హాట్ ఫోటోస్ షేర్ చేస్తున్నారు.