Bollywood Directors: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. యంగ్ డైరెక్టర్ల మిస్ ఫైర్!

ఆడియన్స్ కి నచ్చితేనే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు యాక్ట్ చేసిన సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్లు ఎంతో..

Bollywood Directors: అనుకున్నదొక్కటి అయినదొక్కటి.. యంగ్ డైరెక్టర్ల మిస్ ఫైర్!

Bollywood Directors

Bollywood Directors: ఆడియన్స్ కి నచ్చితేనే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా. అందుకే పెద్ద పెద్ద స్టార్ హీరోలు యాక్ట్ చేసిన సినిమా అయినా కూడా ఫ్లాప్ అవుతున్నాయి. ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్లు ఎంతో కష్టపడి చేసిన సినిమాలు కూడా ఒక్కోసారి నిరాశపరుస్తుంటాయి. తమ కష్టంతో పాటు కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరవుతాయి.

Bollywood Star Heroes: కమ్ బ్యాక్ బాలీవుడ్.. హీరోలు బిజీ బిజీ!

సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్లు మాత్రం పెద్దగా రావు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన చాలా సినిమాలు టాక్‌ పరంగా ఆకట్టుకున్నా కలెక్షన్ల విషయంలో నిరాశపరుస్తూ ఉంటాయి. ఇదే లెక్కలో వచ్చిందే అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో వచ్చిన బాంబే వెల్వట్. 2015లో 120 కోట్ల బారీ బడ్జెట్ తో రణబీర్ కపూర్, అనుష్క శర్మ, కరణ్ జోహార్ లాంటి స్టార్ కాస్ట్ తో వచ్చిన ఈ పీరియాడికల్ థ్రిల్లర్ డ్రామాలో స్టోరీ బావున్నా.. అనురాగ్ కశ్యప్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్ తో డిజాస్టర్ అయ్యింది.

Bollywood Movies: టార్గెట్ 2023.. వచ్చే ఏడాదే బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్!

సల్మాన్ ఖాన్ 135 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ట్యూబ్ లైట్ సినిమా సల్మాన్ కెరీర్ లో మరో ఫ్లాప్ ఇచ్చింది. కబీర్ ఖాన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ 120 కోట్లు కూడా కలెక్ట్ చెయ్యలేకపోయింది. సూపర్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రేస్ కి సీక్వెల్ గా వచ్చిన రేస్ 3 కూడా బిగ్గెస్ట్ ఫ్లాప్ అయ్యింది. కొరియోగ్రాఫర్ గా ఉన్న రెమోడిసౌజా రేస్ 3 డైరెక్టర్ గా చేశారు. సల్మాన్, అనిల్, బాబీ, జాక్విలిన్ లాంటి బారీ స్టార్ కాస్ట్ తో 180 కోట్ల బడ్జెట్ తో రెమో చేసిన ఈ ప్రయోగం బాక్సాఫీస్ దగ్గర మిస్ ఫైర్ అయ్యి కనీసం 160 కోట్లు కూడా రాబట్టలేదు. ఇలా ఎంత పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నా ఆస్టార్స్ ని డైరెక్ట్ చేసే ఛాన్సున్నా.. యంగ్ డైరెక్టర్లకు ఒకేసారి పెద్ద సినిమాలు చేసే ఛాన్స్ వస్తే అంతగా యూజ్ చేసుకోలేక ఫ్లాప్స్ ఫేస్ చేస్తున్నారు.