Chandan K Anand : పఠాన్ వాస్తవానికి దూరంగా ఉంది.. పఠాన్, బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు..

లవ్ ఆజ్ కల్, గుంజన్ సక్సేనా, రంగబాజ్.. లాంటి పలు సినిమాల్లో నటించిన నటుడు చందన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పఠాన్ సినిమా హిట్ అయి ఉండొచ్చు కానీ అది వినోదం మాత్రమే. పఠాన్ సినిమా చాలా....................

Chandan K Anand :  బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత పఠాన్ సినిమాతో వచ్చి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే పఠాన్ సినిమా 850 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటి 1000 కోట్లకు పరుగులు తీస్తుంది. ఇక ఈ సినిమాకి ముందు నుంచి నెగిటివిటి ఉన్న సంగతి తెలిసిందే. సినిమా కొన్ని కారణాల వల్ల హిట్ అయి కలెక్షన్స్ వస్తున్నా ఇది అంత గొప్ప సినిమా ఏమి కాదు అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు చందన్ ఆనంద్ పఠాన్ సినిమా విజయంపై, బాలీవుడ్ పై ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు.

లవ్ ఆజ్ కల్, గుంజన్ సక్సేనా, రంగబాజ్.. లాంటి పలు సినిమాల్లో నటించిన నటుడు చందన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పఠాన్ సినిమా హిట్ అయి ఉండొచ్చు కానీ అది వినోదం మాత్రమే. పఠాన్ సినిమా చాలా వాస్తవికతకు దూరంగా ఉంది. అందులో చూపించిన చాలా సన్నివేశాలు రియల్ లైఫ్ లో జరగవు. ఇటీవల వచ్చిన క్లాస్ సిరీస్ మధ్య తరగతి, చాలా మంది ప్రేక్షకులకు దగ్గరగా ఉంది, అందరికి కనెక్ట్ అవుతుంది అని తెలిపారు.

Shiva Rajkumar : అందుకే గెస్ట్ రోల్స్ చేస్తున్నా అంటున్న స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ అంటే కచ్చితంగా అది వచ్చి ఉండాలి..

అలాగే బాలీవుడ్ పై కూడా చందన్ పలు వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో స్టార్ పార్టీలు జరుగుతాయి. ఆ పార్టీలో మద్యం, డ్రగ్స్ ఉంటాయని అంతా అంటారు. ఆ పార్టీలకు వెళ్తేనే మనకి అవకాశాలు వస్తాయని కూడా అంటారు. కానీ నేను వెళ్ళను. మన పని మనకి అవకాశకు తెప్పిస్తుంది. బాలీవుడ్ లో డ్రగ్స్ లాంటి నెగిటివ్ అంశాలు ఉన్నాయని అంతా అనుకుంటారు. కానీ ఇక్కడ అందరూ డ్రగ్స్ తీసుకోరు అని కామెంట్స్ చేశాడు. దీంతో చందన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో చర్చగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు