అజిత్ పర్ఫామెన్స్ కి ఫిదా అయ్యాను: బోనీ కపూర్!

  • Edited By: veegamteam , April 10, 2019 / 06:17 AM IST
అజిత్ పర్ఫామెన్స్ కి ఫిదా అయ్యాను: బోనీ కపూర్!

తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్ తర్వాత అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు అజిత్. ఇటీవల విశ్వాసం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అజిత్, ప్రస్తుతం బోని క‌పూర్‌ నిర్మాణంలో పింక్ రీమేక్ చిత్రం నెర్కొండ పార్వాయి చేస్తున్నాడు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా శ్ర‌ద్ధా శ్రీనాథ్‌, అభిరామి వెంక‌టచ‌లం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్ర‌లలో క‌నిపించనున్నారు. అజిత్‌ కి ఇది 59వ చిత్రం.

ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో అజిత్ కోట్ వేసుకొని సీరియ‌స్ లుక్‌లో క‌నిపించారు. బోనీ కపూర్ తాజాగా చిత్ర రషెస్ చూసాడట. అయితే అజిత్ నటన చూసి నేను ఫిదా అయ్యాను. అజిత్ త్వరలో మరికొన్ని హిందీ సినిమాలలో నటిస్తాడని అనుకుంటున్నాను. ప్రస్తుతం అజిత్ కోసం మూడు యాక్షన్ స్క్రిప్ట్ లు సిద్దంగా ఉన్నాయి. అందులో ఒకదానికైనా అజిత్ ఓకే చెప్తాడని కోరుకుంటున్నాను అంటూ బోనీ కపూర్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.