K.Viswanath : ‘కళాతపస్వి’పై సినీ పుస్తకం

ఆ కళాతపస్విపై తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. కె.విశ్వనాథ్‌ గారి అభిమాని డాక్టర్‌ రామశాస్త్రి ‘విశ్వనాథ్‌ విశ్వరూపం’’ పేరుతో ఆయన సినిమాల గురించి ఓ పుస్తకాన్ని రచించారు.

K.Viswanath :  కళాతపస్వి కె.విశ్వనాథ్‌ గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. సినీ పరిశ్రమకి ఆయన సినిమాలు ఆదర్శం. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతి కిరణం’, ‘స్వర్ణకమలం’, ‘శుభసంకల్పం’, ‘సిరివెన్నెల’ ఇలా ఎన్నో సినిమాలు.. ఒక్కోటి ఒక్కో అద్భుతమైన కావ్యం. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా సినీ పరిశ్రమకి ఎన్నో సేవలు చేశారు. ప్రస్తుతం వయోభారంతో ఇంటివద్దే సినిమాలకి దూరంగా ఉంటున్నారు. ఆయన సినిమాలే కాదు ఆయన కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

ఆ కళాతపస్విపై తాజాగా ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. కె.విశ్వనాథ్‌ గారి అభిమాని ఆర్‌బీఐ మాజీ ఉన్నతోద్యోగి డాక్టర్‌ రామశాస్త్రి ఆయన సినిమాల గురించి ఓ పుస్తకాన్ని రచించారు. ‘‘విశ్వనాథ్‌ విశ్వరూపం’’ పేరుతో రచించిన పుస్తకాన్ని ఇవాళ దసరా సందర్భంగా కె.విశ్వనాథ్‌ చేతులమీదుగా ఆవిష్కరించారు. రామశాస్త్రి 2017లో కె.విశ్వనాథ్‌పై ఓ పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అంగీకారంతోనే పుస్తకాన్ని మొదలు పెట్టారు. రామశాస్త్రి నాలుగు నెలలపాటు పూర్తి సమయాన్ని కేటాయించి పుస్తకాన్ని పూర్తి చేశారు.కానీ అనేక కారణాల వాళ్ళ ఇవాళ్టికి ఆ పుస్తకం బయటకి వచ్చింది. విశ్వనాథ్‌ సినిమాలను మళ్లీ మళ్లీ చూసి అందులో సందర్భాలను విశ్లేషించి పుస్తకంలో పొందుపర్చారు. విశ్వనాథ్ అన్ని సినిమాల గురించి ఇందులో విశ్లేషించారు. కేవలం విశ్వనాధ్ గారి అభిమానులే కాదు ప్రతి సినీ అభిమాని చదవాల్సిన పుస్తకం ఇది అని ఆయన తెలిపారు.

Vijay Devarakonda : అభిమానులకి వరాలు కురిపించిన విజయ్ దేవరకొండ

ఈ పుస్తక ఆవిష్కరణలో ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ళ భరణి గారు కూడా పాల్గొన్నారు. ఈ పుస్తకాన్ని చదివిన కె.విశ్వనాథ్‌ సంతోషం వ్యక్తం చేశారు. పుస్తకం చదువుతుంటే ప్రస్తుతం తన చిత్రాలను తానే చూసుకున్నట్టుందని రామశాస్త్రిని అభినందించారు.

ట్రెండింగ్ వార్తలు