Bigg Boss OTT Telugu: కంటెస్టెంట్లకు బూస్టర్ డోస్.. షో మొదలు ఎప్పుడంటే?

బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి.

Bigg Boss OTT Telugu: కంటెస్టెంట్లకు బూస్టర్ డోస్.. షో మొదలు ఎప్పుడంటే?

Bigg Boss Telugu Ott

Bigg Boss OTT Telugu: బిగ్ బాస్ తెలుగులో ఐదు సీజన్లు పూర్తిచేసుకోగా ఆరవ సీజన్ కు ఐదారు నెలల సమయం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే.. ఈ మధ్యలోనే ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా సీజన్లు మొదలైపోయాయి. హిందీలో ఇప్పటికే బిగ్ బాస్ 15 సీజన్ జరుగుతుండగా ఓటీటీ తొలి సీజన్ కూడా పూర్తయింది. ఇప్పుడు తెలుగులో కూడా ఓటీటీ మొదలు కానుంది. ఇప్పటికే ఈ మేరకు నాగార్జున అధికారికంగా ప్రకటించగా దానికి కూడా ఆయనే హోస్ట్.

Pushpa-Viral Video: వామ్మో.. బన్నీ హుక్ స్టెప్ దింపేసిన బుడ్డోడు!

ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ కోసం ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా మొదలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీళ్ళే ఓటీటీ తొలి సీజన్ కంటెస్టెంట్లు అంటూ కొందరి పేరు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓటీటీ తొలి సీజన్ కు హైప్ తెచ్చేందుకు గతంలో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లను కూడా రంగంలోకి దింపేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.

Trivikram Heroines: నచ్చితే చాలు.. హీరోయిన్స్ ను రిపీట్ చేస్తున్న త్రివిక్రమ్!

బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వచ్చిన క్రేజ్ ను బాగా యూజ్ చేసుకున్న కంటెస్టెంట్ అరియనాతో పాటు మాజీ కంటెస్టెంట్లు ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజలు కూడా ఓటీటీ బిగ్ బాస్ తొలి సీజన్ లో ఇంట్లోకి వెళ్లేందుకు సిద్దమైనట్లు వినిపిస్తుంది. వీరు కాకుండా కొత్తగా.. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ శివ, డ్యాన్స్‌ షో ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌’వెబ్‌ సిరీస్‌ ఫేమ్‌ వైష్ణవి, సోషల్‌ మీడియా స్టార్‌ వరంగల్‌ వందన, యాకర్‌ ప్రత్యూష పేర్లు ఓటీటీ బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వినిపిస్తున్నాయి.

Ashoka Vanam Lo Arjuna Kalyanam: కళ్యాణం డేట్ ఫిక్స్.. చూసేందుకు మీరు సిద్ధమా?

ఓటీటీ తొలి సీజన్ కోసం హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లు బూస్టర్ డోస్ తో సహా మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని షో నిర్వాహకులు కండిషన్ పెట్టగా.. ఫిబ్రవరి చివరి ఆదివారం నుండి షో మొదలు పెట్టేందుకు సన్నాహాలు మొదలయ్యాయట. ఇప్పటికే ఓటీటీ షో కోసం బిగ్‌బాస్‌ హౌస్‌లో కొన్ని మార్పుచేర్పులు చేసి మెరుగులు దిద్దిన టీం.. ఫిబ్రవరి రెండో వారం నుండి కంటెస్టెంట్లకు హోమ్ క్వారంటైన్ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది.