RGV: బోర్ కొట్టేసిన వర్మ కాంట్రవర్సీలు.. డేంజరస్‌కి థియేటర్లెక్కడ?

నిజమే వర్మ అంటే మూస బాటలో వెళ్లే తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపిన బాటసారే. సినిమా అంటే వందలమంది కావాలి.. పెద్ద పెద్ద క్రేన్ లు.. డ్రోన్ లు కావాలి అనే సిద్ధాంతాలకు స్వస్తి..

RGV: బోర్ కొట్టేసిన వర్మ కాంట్రవర్సీలు.. డేంజరస్‌కి థియేటర్లెక్కడ?

Dangerous

RGV: ‌నిజమే వర్మ అంటే మూస బాటలో వెళ్లే తెలుగు సినిమాకు సరికొత్త దారి చూపిన బాటసారే. సినిమా అంటే వందలమంది కావాలి.. పెద్ద పెద్ద క్రేన్ లు.. డ్రోన్ లు కావాలి అనే సిద్ధాంతాలకు స్వస్తి చెప్పి సెల్ ఫోన్ కెమెరా చాలు సినిమా తీసేస్తా అని చెప్పిన సిద్ధాంతి కూడా వర్మనే. డేరింగ్ డాషింగ్ దర్శకులకు ఆయనే ఆదర్శం.. నూతన దర్శకులకు ఆర్జీవీ అంటే ఓ గ్రంధాలయం. ఇదంతా నాణేనికి ఒకవైపు అయితే.. వివాదాలతో తల గోక్కొని.. ఆ మంటలో చలి కాచుకోడంతోనే వర్మ సంసారం చేసేస్తున్నాడన్నది ఆయనలోని మరో కోణం.

RGV : వివాదంలో ఆర్జీవీ ‘డేంజెరస్’ మూవీ.. సుప్రీంకోర్టుని అవమానిస్తున్నారన్న వర్మ

ఒకప్పుడు ఇండస్ట్రీకి నడక నేర్పిన ఆ దార్శనికుడే ఈ మధ్య ప్రేక్షకులకు విసుగు పుట్టించేశాడు. బయోపిక్ సినిమాల పేరిట.. సినిమాని చుట్టేసి.. తన పబ్లిసిటీ జిమ్మికులతో తానో తెలివి కలిగిన వాడినని జనాలను నమ్మిస్తూ వచ్చిన వర్మ సినిమాలంటే ఇప్పుడు ప్రేక్షకులు కన్నెత్తి కూడా చూడని స్థితికి తెచ్చుకున్నాడు. అందుకు నిదర్శనమే ఆయన తాజా సినిమాకి కనీసం హైదరాబాద్ లాంటి నగరంలో థియేటర్ కూడా దొరకకపోవడం. ఔను నిజమే.. ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాకు ఇప్పుడు థియేటర్ల కొరత వచ్చిపడింది.

RGV: నీ మొహం రా.. అంటూ కేఏ పాల్‌కు వర్మ కౌంటర్!

ఈ నెల 8న వర్మ ఖ‌త్రా డేంజ‌ర‌స్ సినిమా రిలీజ్ కానుంది. అయితే, హైదరాబాద్‌లో ఈ సినిమాకు ఒక్క షోకు కూడా థియేటర్లు కేటాయించ‌లేదు. థియేట‌ర్లు కేటాయించ‌డం డిమాండ్ మేర‌కే ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్ల‌తో వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేయించి, ఇంటిమేట్ సీన్లు పెట్టినా సోష‌ల్ మీడియాలో కూడా ఎవ‌రూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవ‌ట్లేదు. ప్రేక్ష‌కుల్లో అస‌లేమాత్రం ఈ సినిమా ప‌ట్ల ఆస‌క్తి లేదు. ఈ నేప‌థ్యంలోనే థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మైన‌ట్లుంది.

RGV-Upendra: ఉప్పీతో వర్మ.. అభిమానులలో బోలెడు ఆశలు.. మరి రిజల్ట్?

పీవీఆర్, ఐనాక్స్ లాంటి మ‌ల్టీప్లెక్సులు ఇది లెస్బియ‌న్ సినిమా కావడంతో ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ఇవ్వ‌ట్లేద‌ని, ఇది ఎల్జీబీటీ క‌మ్యూనిటీ హ‌క్కుల‌ను కాల‌రాయ‌డ‌మే అంటూ వ‌ర్మ ట్విట్ట‌ర్లో కాంట్ర‌వ‌ర్శీ క్రియేట్ చేయ‌డానికి కూడా గ‌ట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ ప్రేక్షకులలోనే పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు. థియేటర్లలో ఇలాంటి సినిమా వచ్చినా పబ్లిక్ గా వెళ్లేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపడం కష్టమే కనుక.. ఇలాంటి ప‌రిస్థితులలో వ‌ర్మ త‌నే సొంతంగా పెట్టుకున్న ఓటీటీలో రిలీజ్ చేయడమే బెటర్ గా కనిపిస్తుంది. మరి వర్మాజీ ఏం చేస్తాడో చూడాలి.