BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో ఉన్నాడు....

BoyapatiRAPO: తమ సినిమాకు రెమ్యునరేషన్ వదులుకున్న బోయపాటి-రామ్‌లు

Boyapati Ram Pothineni Slashes Remuneration For Their Movie

BoyapatiRAPO: మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘అఖండ’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలవడంతో ఈ డైరెక్టర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని రెడీ చేసే పనిలో ఉన్నాడు. యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో కలిసి బోయపాటి తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవల ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ కూడా చేశారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

హీరో రామ్ కోసం బోయపాటి ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేసినట్లుగా చిత్ర యూనిట్ వెల్లడించింది. అయితే ఈ సినిమా కోసం హీరో రామ్, దర్శకుడు బోయపాటి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా రాబోయే ఈ సినిమా ప్రొడక్షన్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వారు చెబుతున్నారు. అయితే వారు ఈ సినిమా నుండి కొంత షేర్ మాత్రం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

RAPO20: రామ్-బోయపాటి.. బాలీవుడ్ భామలు కాదు.. క్రష్మికే ఫైనల్?

ఈ సినిమా లాభాల నుండి 25 శాతం వాటాను వారు తమ రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ లెక్కన బోయపాటి ఈ సినిమా నుండి రూ.8 కోట్లు, రామ్ రూ.7 కోట్లు తమ వాటాలుగా తీసుకోవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అంటే, ఇది వారి రెమ్యునరేషన్ కంటే ఎక్కువే అని చెప్పాలి. ఏదేమైనా బోయపాటి, రామ్ పోతినేనిలు ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, ఇలా రెమ్యునరేషన్ కాదని, లాభాల్లో వాటాను అడుగుతారని పలువురు కామెంట్ చేస్తున్నారు.