BoyapatiRAPO: రామ్ పోతినేని మూవీపై బోయపాటి అప్డేట్.. ఏమిటో తెలుసా?

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేశారు.

BoyapatiRAPO: రామ్ పోతినేని మూవీపై బోయపాటి అప్డేట్.. ఏమిటో తెలుసా?

BoyapatiRAPO Movie Dubbing Work Started

BoyapatiRAPO: మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ప్రస్తుతం యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో ఓ మాస్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ కూడా చేసింది. కాగా, ఈ సినిమాకు ఇంకా ఎలాంటి టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు.

BOYAPATIRAPO: బోయపాటి మార్క్ మాస్ పోస్టర్‌తో దసరా బరిలోకి దిగుతున్న రామ్!

అయితే, ఈ సినిమా నుండి అప్డేట్స్ ఇవ్వాల్సిందిగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా కోరుతున్నారు. దీంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్‌ను బోయపాటి రివీల్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసినట్లు దర్శకుడు బోయపాటి తెలిపారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాలో రామ్ పోతినేని ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.

BoyapatiRAPO: వరుస అప్డేట్స్‌తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!

బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుండగా, అందాల భామ శ్రీలీల ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నుండి మరిన్ని అప్డేట్స్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.