BOYAPATIRAPO: బోయపాటి మార్క్ మాస్ పోస్టర్‌తో దసరా బరిలోకి దిగుతున్న రామ్!
యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

BOYAPATIRAPO Movie Locks Release Date
BOYPATIRAPO: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం తన తాజా చిత్రాన్ని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బోయపాటి మరోసారి తనదైన సత్తా చాటాలని చూస్తున్నాడు.
BoyapatiRAPO: వరుస అప్డేట్స్‌తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!
ఇక పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌గా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది చిత్ర యూనిట్. ఓ మాస్ పోస్టర్‌తో ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. పండుగ సంబరాల్లో ఓ ఎద్దును లాక్కెళ్తున్న రామ్ పోస్టర్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉందని చెప్పాలి. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
BoyapatiRAPO: వరుస అప్డేట్స్‌తో అదరగొట్టిన రామ్ బోయపాటిలు!
పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రాబోతుండగా, ఈ సినిమాలో రామ్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట బోయపాటి. ఇక యాక్షన్ లవర్స్‌కు కావాల్సిన అన్ని అంశాలను పుష్కలంగా చూపించబోతున్నాడు ఈ మాస్ డైరెక్టర్. ఈ సినిమాలో అందాల భామ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌తో ఈ అంచనాలు ఒక్కసారిగా రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.
Instant Impact 🔥🔥🔥💥
MASSive Energetic Combo of Ustaad @ramsayz & Mass Director #BoyapatiSreenu with massy whistles🔥#BoyapatiRAPOonOct20
MASSIVE ENERGY in theatres for 20-10-2023 on Dussehra❤️🔥@sreeleela14 @MusicThaman @srinivasaaoffl @detakesantosh @SS_Screens pic.twitter.com/xirRYGiWba
— Srinivasaa Silver Screen (@SS_Screens) March 27, 2023