Mega Family : మెగా ఫ్యామిలీపై రోజా చేసిన వ్యాఖ్యలకు బ్రహ్మాజీ కౌంటర్..

ఇటీవల జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది జగన్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు రోజా స్పందిస్తూ మెగా ఫ్యామిలీ పై తీవ్ర విమర్శలు చేసింది. ఈ వ్యాఖ్యలకు నటుడు బ్రహ్మాజీ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశాడు.

Mega Family : మెగా ఫ్యామిలీపై రోజా చేసిన వ్యాఖ్యలకు బ్రహ్మాజీ కౌంటర్..

Mega Family roja brahmaji

Mega Family : ఏపీ రాజకీయాలు ఆంధ్రాతో పాటు టాలీవుడ్ లోను హీట్ ని పుట్టిస్తున్నాయి. ఇటీవల శ్రీకాకుళం రణస్థలిలో జరిగిన జనసేన ‘యువశక్తి’ మీటింగ్ లో ప్రముఖ టీవీ ఛానల్ కామెడియన్ హైపర్ ఆది.. అధికార పార్టీ పై చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో అధికార పార్టీ నాయకులు ఈ వ్యాఖ్యలకు కౌంటర్లు ఇస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటకశాఖ మంత్రి రోజా మెగా ఫ్యామిలీ పై తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఆమె వ్యాఖ్యలు తప్పుబడుతూ పలువురు రోజాకి కౌంటర్లు ఇస్తున్నారు.

Minister Roja : భయంతోనే మెగా ఫ్యామిలీతో ఉన్నారు..

ఈ క్రమంలోనే టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ, మినిస్టర్ రోజాకి గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు అనే భయంతో ఇలాంటి చిన్న ఆర్టిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు’ అని పలికిన రోజా మాటలకూ బదులిచ్చాడు బ్రహ్మాజీ. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామలీ పొలిటికల్ కాంపెయిన్ చెయ్యమని లేదా ఆ పార్టీలో చేరమని కానీ అడగలేదు. అయినా చిన్న ఆర్టిస్ట్ లే కదా మిమ్మల్ని విమర్శ చేసింది. మరెందుకు అంత భయపడుతున్నారు’ అంటూ ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. అయితే బ్రహ్మజీ ట్వీట్ కి కారణం.. మెగా ఫ్యామిలీని మొత్తం ఉద్దేశించి రోజా వ్యాఖ్యలు ఉండడం. ఇటీవల పవన్ కళ్యాణ్ ని విమర్శించకుండా మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఉద్దేశిస్తూ రోజా తీవ్ర ఆరోపణలు చేయడం. దానికి నాగబాబు ఘాటుగా స్పదించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి మెగా ఫ్యామిలీపై రోజా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయింది. మరి దీని పై నాగబాబు కూడా స్పందిస్తాడా? లేదా? అనేది వేచి చూడాలి.