జోకు తప్పుగా పేలింది.. ట్విట్టర్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ

జోకు తప్పుగా పేలింది.. ట్విట్టర్ డిలీట్ చేసిన బ్రహ్మాజీ

జోక్ వేయాలని ప్రయత్నించిన Brahmajiకి సీన్ రివర్స్ అయింది. హైదరాబాద్ వరదలపై చేసిన కామెంట్‌లో అంతగా ఎఫెక్ట్ చూపిస్తందనుకోలేదు. ‘ఓ మోటారు బోటు కొనుక్కోవాలనుకుంటున్నాను. ఎవరైనా సలహా ఇవ్వండి’ అంటూ పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. సరదాగా పెట్టిన పోస్టుకు కొందరు బాగానే రిప్లై ఇచ్చినా వరదల్లో నష్టపోయిన వారు మాత్రం ఘాటుగా రిప్లై ఇచ్చారు.




కొంతమంది బ్రహ్మాజీని తెలంగాణ ద్రోహి అంటూ నిందించారు. ఊహించని విధంగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న మూకుమ్మడి దాడిని తట్టుకోలేక బ్రహ్మాజీ ఇబ్బందిపడ్డాడు. అలా ట్వీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇచ్చి.. అకౌంట్ ను డిలీట్ చేసేశాడు.

కొద్ది రోజులుగా కురుస్తున్న వరదలకు బ్రహ్మాజీ అపార్ట్‌మెంట్‌లోకి నీళ్లు చేరి.. సెల్లార్ జలమయమైంది. దీంతో బ్రహ్మాజీ, అతడి కుమారుడు దగ్గర్లోని మరో అపార్ట్‌మెంట్‌లో కారు పార్క్ చేసి ఇంటికి చేరుకునే ప్రయత్నం చేశారు.
https://10tv.in/akkineni-nagarjuna-contributes-lakhs-to-telangana-cm-relief-fund-for-hyderabad-floods/



వరద వల్ల అది సాధ్యం కాకపోవడంతో.. చుట్టుపక్కల జనాల సహాయంతో అతి కష్టం మీద ఇంటికి చేరుకున్నారట. ఈ ఘటన మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఓ చిన్న జోక్ వేశానని, అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని బ్రహ్మాజీ చెప్పుకొచ్చారు.

తన ఉద్దేశం వేరైనా.. జనాల్లోకి నెగెటివ్ సెన్స్ లోనే వెళ్లిందని గత్యంతరం లేక ట్విట్టర్ అకౌంట్‌‍ను డిలీట్ చేసేశాడు బ్రహ్మాజీ.