Brahmanandam: ఇతరులను నవ్వించే జన్మనివ్వమని దేవుణ్ణి వరం కోరుకుంటాను – బ్రహ్మానందం

నూతన తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. FNCC స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందంని ఘనంగా సన్మానించారు.

Brahmanandam: ఇతరులను నవ్వించే జన్మనివ్వమని దేవుణ్ణి వరం కోరుకుంటాను – బ్రహ్మానందం

Brahmanandam Felicitated By Film Nagar Cultural Center

Brahmanandam: నూతన తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఫిలిం నగర్‌లోని ఫిలిం నగర్‌ కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణంతో పాటు, పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. FNCC స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, హాస్యబ్రహ్మ డా. బ్రహ్మానందంని ఘనంగా సన్మానించారు.

Brahmanandam Felicitated By Film Nagar Cultural Center

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి నృత్యాలు, వివిధ తెలుగు పండుగలను తెలియజేస్తూ చేసిన ప్రత్యేక నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి. బ్రహ్మానందం జీవితానికి సంబంధించి పలు వివరాలతో కూడిన ఏవీ వీక్షకులను ఆకట్టుకుంది. అనంతరం పద్మశ్రీ, గిన్సీస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ గ్రహీత, డాక్టర్‌ బ్రహ్మానందంను శాలువా, గజమాలతో సత్కరించి, ఆయనకు కలియుగదైవం వేంకటేశ్వరుని ప్రతిమ, సన్మానపత్రం అందజేశారు.

Brahmanandam: ‘‘మాస్టారు..మాస్టారు..’’ బ్రహ్మీ సారు అదరగొట్టారు!

ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ.. ఉగాది వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా పద్మశ్రీ బ్రహ్మానందం గారిని సత్కరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. 1250కి పైగా చిత్రాల్లో నటించి కోట్లమందిని నవ్వించే భాగ్యం ఆయనకు దక్కడం భగవంతుని వరం అని ఆయన అన్నారు.

ఇక మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ..‘‘గిన్నీస్‌బుక్‌ రికార్డు సాధించి, కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బ్రహ్మానందం గారు మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. కళకు, కళాకారులకు భాష, ప్రాంతం, కులం, మతం ఉండవు. 1250 సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారతదేశం గర్వించదగ్గ నటులు.’’ అని తెలిపారు.

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు.. ఆయన కూడా ఎప్పుడూ నవ్వుతూనే బతుకుతుంటారు. నవ్వు ఆయన జీవన విధానం అయిపోయింది. మనం ఏదైనా చెబితే విననట్టే ఉంటారు. కానీ మనం ఆ సీన్‌ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన అందులో పరకాయప్రవేశం చేసేసి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు లాక్కుంటారు. మనకు భౌతికంగా కనిపించే బ్రహ్మానందం వేరు.. మానసికంగా శిఖరాగ్రానికి చేరిన బ్రహ్మానందం వేరు. చాలా లోతైన వ్యక్తి. ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి.. మానసికంగా ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి ఈ కమెడియన్‌ పాత్రను పోషిస్తున్నారు.’’ అని అన్నారు.

Brahmanandam : చచ్చేవరకు నేను కమెడియన్ నే.. మధ్యమధ్యలో ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తుంటా..

ఇక ఈ సన్మాన కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ..‘‘ఈరోజు నాకు జరిగిన సన్మానం చూస్తుంటే హృదయం మొత్తం సంతోషంతో నిండిపోతే.. నోరు మూగబోతుంది అనే సామెత గుర్తుకు వస్తోంది. నాకు జరిగిన ఈ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనిది అని ఈ వేదికపై నుంచి మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. నేను దేవుణ్ణి మోక్షం వద్దు మళ్లీ మళ్లీ జన్మించాలని.. ఆ జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని కోరుకుంటాను.’’ అని భాగోద్వేగంతో అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.