Brahmanandam: ‘‘మాస్టారు..మాస్టారు..’’ బ్రహ్మీ సారు అదరగొట్టారు!

టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ‘సార్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. తమిళ హీరో ధనుష్ నటించిన ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా, అందాల భామ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయగా, రెండింట్లోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ‘మాస్టారు మాస్టారు..’ సాంగ్‌కు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Brahmanandam: ‘‘మాస్టారు..మాస్టారు..’’ బ్రహ్మీ సారు అదరగొట్టారు!

Brahmanandam In Sir Movie Video Edit Goes Viral

Brahmanandam: టాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ‘సార్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. తమిళ హీరో ధనుష్ నటించిన ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించగా, అందాల భామ సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయగా, రెండింట్లోనూ ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాలోని ‘మాస్టారు మాస్టారు..’ సాంగ్‌కు మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

Brahmanandam: ‘రంగమార్తాండ’లో బ్రహ్మానందం నటనకు ఫిదా.. సన్మానం చేసిన మెగా ఫ్యామిలీ!

ఈ పాటకు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇంప్రెస్ కావడంతో ఈ పాట చార్ట్ బస్టర్స్‌లో ఇప్పటికీ వినిపిస్తోంది. ఇక ఈ పాటకు సోషల్ మీడియాలోనూ అదిరిపోయే ఫాలోయింగ్ ఉండటంతో, ఈ సాంగ్ సూపర్ హిట్‌గా అవతరించింది. తాజాగా ఈ పాటలో ధనుష్ ప్లేస్‌లో కామెడీ కింగ్ బ్రహ్మానందం కనిపించి అందరినీ అవాక్కయ్యేలా చేశాడు. ‘మాస్టారు మాస్టారు..’ అంటూ సంయుక్తా సిగ్గు పడుతోండగా, బ్రహ్మానందం తనదైన స్టయిల్‌లో ఈ పాటలో మెరిసాడు. సాంగ్‌కు పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యే విధంగా బ్రహ్మీ వీడియోను ఎడిట్ చేసి నెట్టింట పెట్టారు కొందరు అభిమానులు.

Sir Movie: ధనుష్ ‘సార్’ వంద కొట్టాడు..!

ప్రస్తుతం ఈ ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారడంతో, చిత్ర హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా ఈ వీడియోపై స్పందించింది. ఈ వీడియో ఎడిట్ నెక్ట్స్ లెవెల్ క్రియేటివిటీ అంటూ పొగిడేసింది ఈ బ్యూటీ. ఇక ఈ వీడియోను చూసిన అభిమానులు మాస్టారు.. మాస్టారు.. బ్రహ్మీ సారు అదరగొట్టారు.. అంటూ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.