F3 Movie : తెలుగు సినీ పరిశ్రమని వేడుకున్న బ్రహ్మానందం

ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో అందరి కామెడీ టైమింగ్ బాగుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు నవ్వులు పూయించారు. నేను తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక విన్నపం............

F3 Movie : తెలుగు సినీ పరిశ్రమని వేడుకున్న బ్రహ్మానందం

Brahmanandam

Brahmanandam :  వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, మెహరీన్, తమన్నా, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సినిమా F3. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా రిలీజ్ అయిన రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుంది. హిట్ టాక్ తో దూసుకుపోతున్న F3 సినిమా ఇప్పటికే 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.

దీంతో సినిమా రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత కూడా ప్రమోషన్స్ మరింత పీక్స్ లో చేస్తున్నారు. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు ఇలా ఏదో ఒక ప్రోగ్రాంని నిర్వహిస్తూ F3 సినిమాని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఈ పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా కామెడీ కింగ్ బ్రహ్మానందంతో ఇంటర్వ్యూ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం.. వెంకటేష్, వరుణ్ తేజ్, అలీ, అనిల్ రావిపూడిలని ఇంటర్వ్యూ చేశారు.

Vikram : కమల్ హాసన్ అన్న.. సూర్య తంబి.. స్పెషల్ ట్వీట్..

ఈ ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో అందరి కామెడీ టైమింగ్ బాగుంది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు నవ్వులు పూయించారు. నేను తెలుగు చిత్ర పరిశ్రమకి ఒక విన్నపం చేస్తున్నాను. ఇటీవల తెలుగు సినిమాల్లో ఆరోగ్యవంతమైన కామెడీ తగ్గింది. తెలుగులో ఉన్నంత మంది కమెడియన్స్‌ ఏ చిత్ర పరిశ్రమలోనూ లేరు. తెలుగులో సినిమాలు తీసేవాళ్ళు మీ సినిమాల్లో కమెడియన్స్‌ లేకపోయినా పర్వాలేదు కానీ సినిమాలో మాత్రం మంచి కామెడీ ఉంచండి’’ అని వేడుకున్నారు. అలాగే ఈ సినిమాలో అనిల్ తనని యాక్ట్ చేయమని అడిగారని, కానీ కరోనా పరిస్థితుల వల్ల ఇంత మంచి సినిమాలో భాగం కాలేకపోయాను అని తెలిపారు బ్రహ్మానందం.