Brahmastra Trailer : మెగా వాయిస్ తో.. బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్..

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులని మెప్పిస్తుంది. భారతీయ శాస్త్రాల ప్రకారం................

Brahmastra Trailer : మెగా వాయిస్ తో.. బ్రహ్మాస్త్రం ట్రైలర్ రిలీజ్..

Brahmastram Trailer

Brahmastra Trailer :  బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న చిత్రం “బ్రహ్మాస్త్ర”. తెలుగులో “బ్రహ్మాస్త్రం” పేరిట రిలీజ్ కాబోతుంది. ఎప్పుడో సెప్టెంబర్ 9న ఈ సినిమా రిలీజ్ ఉండగా ఇప్పట్నుంచే ప్రమోషన్స్ లో జోరు చూపిస్తున్నారు. రణబీర్ కపూర్ తెలుగు మార్కెట్ మీద కూడా కన్నేసి ఈ సినిమాని తెలుగులో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాని రాజమౌళి సమర్పించడం, ముందుండి ప్రమోషన్స్ చేయడం చేస్తున్నారు. ఇక ఇందులో నాగార్జున ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, మెగాస్టార్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ ట్రైలర్ ప్రేక్షకులని మెప్పిస్తుంది. భారతీయ శాస్త్రాల ప్రకారం మనకి ఉన్న అస్త్రాలు, అన్నిటికంటే ఎక్కువ శక్తివంతమైన అస్త్రం బ్రహ్మాస్త్రం, వాటిని కాపాడే వాళ్ళు, వాటి కోసం వెతికే వాళ్ళు, వాటికి హీరోకి సంబంధం ఏంటి?, హీరో, హీరోయిన్ ల మధ్య ప్రేమ ఇలా పలు ఆసక్తికర అంశాలతో సినిమా తెరకెక్కుతుంది.

VirataParvam : ‘లేడీ పవర్ స్టార్’ బిరుదుపై స్పందించిన సాయిపల్లవి..

ఈ సినిమాకి VFX చాలా ప్లస్ అవ్వనున్నాయి. ట్రైలర్ చూస్తుంటేనే అది అర్ధమవుతుంది. హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ లాంటి సినిమాలకి వాడే రేంజ్ గ్రాఫిక్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇండియన్ సినిమా నుంచి ఇంత స్థాయిలో గ్రాఫిక్స్ తో, ఇంత అత్యద్భుతమైన విజువల్స్ తో రావడం ఇదే మొదటిసారి కావచ్చు. కచ్చితంగా ఈ సినిమా మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక సినిమాలో అమితాబ్, నాగార్జున కీలక పాత్రలు పోషిస్తున్నారు. “బ్రహ్మాస్త్రం పార్ట్ 1 శివ” పాన్ ఇండియా లెవెల్లో ఈ సెప్టెంబర్ 9న రిలీజ్ అవ్వనుంది.