‘డిస్కోరాజా’ జంటగా దీపావళి శుభాకాంక్షలు

మాస్ మహారాజా రవితేజ, నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ‘డిస్కోరాజా’ నుంచి దీపావళి సందర్భంగా న్యూ పోస్టర్ విడుదల..

  • Published By: sekhar ,Published On : October 27, 2019 / 06:26 AM IST
‘డిస్కోరాజా’ జంటగా దీపావళి శుభాకాంక్షలు

మాస్ మహారాజా రవితేజ, నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ‘డిస్కోరాజా’ నుంచి దీపావళి సందర్భంగా న్యూ పోస్టర్ విడుదల..

మాస్ మహారాజా రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.. ‘డిస్కోరాజా’.. సైన్స్ ఫిక్షన్ అండ్ పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీలో రవితేజ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. నభా నటేశ్, పాయల్ రాజ్‌పుత్, తాన్యా హోప్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.. ఎస్.ఆర్.టి. బ్యానర్‌పై రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన ‘నిను చూసిన క్షణంలో’ పాటకు భారీ స్పందన వస్తుంది..
దీపావళి సందర్భంగా న్యూ పోస్టర్ విడుదల చేశారు. రవితేజ, నభా నటేష్ వర్షంలో నడుస్తున్న పోస్టర్ ఆకట్టుకుంటుంది. రవి, నభాల కెమిస్ట్రీ బాగుంది. బ్యాగ్రౌండ్‌లో ఎర్రకోట చూపించారు. ఎక్కడా రాజీపడకుండా చిత్రాన్ని భారీగా షూట్ చేస్తున్నామని, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఉంటాయని మూవీ టీమ్ చెబుతుంది.

Read Also : వైకుంఠపురం ఫ్యామిలీ దీపావళి శుభాకాంక్షలు

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న చిత్రాన్ని రిలీజ్ చెయ్యనున్నారని తెలుస్తోంది. బాబీ సింహా, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ : థమన్, సినిమాటోగ్రాఫర్ : కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్ : నవీన్ నూలి, డైలాగ్స్ : అబ్బూరి రవి.