Bigg Boss 5: బ్రేకింగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 5 నుండి బిగ్‌బాస్ స్టార్ట్!

బిగ్ బాస్.. బిగ్ బాస్.. యావత్ ప్రపంచంలోనే సక్సెస్ ఫార్ములాగా పేరున్న ఈ రియాలిటీ షో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ

Bigg Boss 5: బ్రేకింగ్ అప్‌డేట్.. సెప్టెంబర్ 5 నుండి బిగ్‌బాస్ స్టార్ట్!

Bigg Boss 5

Bigg Boss 5: బిగ్ బాస్.. బిగ్ బాస్.. యావత్ ప్రపంచంలోనే సక్సెస్ ఫార్ములాగా పేరున్న ఈ రియాలిటీ షో సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో కూడా ఏ భాషలో అయినా ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉండే బిగ్ బాస్ టాపిక్.. ఇప్పుడు మరింత చర్చగా మారింది. తెలుగులో ఐదవ సీజన్ టైం వచ్చేసింది. కొన్నిరోజులుగా కంటెస్టెంట్లు వీరే అంటూ లిస్ట్ కాస్త వైరల్ అవుతుండడంతో బిగ్ బాస్ అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా స్టార్ మా బిగ్ బాస్ ఐదవ సీజన్ డేట్ ఇచ్చేసింది. బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ సెప్టెంబర్ 5 నుండి మొదలు కానుంది. ఈ తాజా సీజన్‌కు కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ చేయనుండగా చెప్పండి బోర్ డమ్ కి గుడ్ బై అంటూ ప్రోమోలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీ షూట్ కూడా పూర్తిచేయగా నేటి నుండి హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్లకు క్వారంటైన్ విధించనున్నారు.

ఆగష్టు 26 నుండి సెప్టెంబర్ 3 వరకు కంటెస్టెంట్లను హైదరాబాద్ నగరంలో ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్లో క్వారంటైన్ లో ఉంచనుండగా.. సెప్టెంబర్ 4 నుండి బిగ్ బాస్ షూటింగ్ మొదలు కానుంది. అనంతరం సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ ఐదవ సీజన్ ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని స్టార్ మా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.