Bro Daddy : హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’..

‘లూసీఫర్’ తర్వాత ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్.. పాపులర్ యాక్టర్ అండ్ డైరెక్టర్ పృథ్వీ రాజ్ సుకుమారన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘బ్రో డాడీ’ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది..

Bro Daddy : హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘బ్రో డాడీ’..

Bro Daddy

Bro Daddy: ప్రస్తుత పరిస్థితుల్లో సీనియర్ హీరోలు, స్టార్ హీరోలు తమ సినిమాలను ఓటీటీల్లో విడుదల చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇటీవల ‘దృశ్యం 2’ తో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన
ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తన తర్వాతి సినిమాను కూడా ఓటీటీలోనే రిలీజ్ చేసి మరో సూపర్ హిట్ కొట్టారు.

Mohanal : ‘మాన్‌స్టర్’ గా మోహన్ లాల్.. లుక్ అదిరిందిగా..

‘లూసీఫర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పాపులర్ మలయాళీ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ ‘బ్రో డాడీ’ అనే సినిమా చేశారు. పృథ్వీరాజ్, మోహన్ లాల్ తండ్రీ కొడుకులుగా నటించారు. మీనా, కళ్యాణి ప్రియదర్శన్, కనిక (నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఫేమ్), ఉన్ని ముకుందన్ (జనతా గ్యారేజ్ ఫేమ్) కీలకపాత్రలు పోషించారు.

Bro Daddy

 

ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఆంటోని పెరువంబూర్ నిర్మించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26 నుండి డిస్నీ+హాట్ స్టార్‌లో ‘బ్రో డాడీ’ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో కేవలం మలయాళీ వర్షన్ మాత్రమే విడుదల చేశారు. అయినా అన్ని ఏరియాల ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.

NBK 107 : బాబు రెడీ బాబు.. ఈసారి నాలుగు భాషల్లో!

కథ, కథనాలు.. ఫాదర్ అండ్ సన్‌గా పృథ్వీ రాజ్, మోహన్ లాన్‌ల పర్ఫార్మన్స్, కామెడీతో పాటు చక్కని మెసేజ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుందీ మూవీ. ఫస్ట్ డే సబ్‌స్ర్కిప్షన్స్ పరంగా, సెకండ్ హయ్యస్ట్ వాచ్ టైమ్ (ఫస్ట్ డే) గా సెన్సేషన్ క్రియటే చేసింది ‘బ్రో డాడీ’.