NBK108: బాలయ్య సినిమాకు అల్ట్రా స్టైలిష్ టైటిల్.. నిజమేనా?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్....

NBK108: బాలయ్య సినిమాకు అల్ట్రా స్టైలిష్ టైటిల్.. నిజమేనా?

Bro I Dont Care Is The Title For Balakrishna Nbk108

NBK108: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన కెరీర్‌లోని 107వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కిస్తుండటంతో, ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్య ఊరమాస్ లుక్‌లో కనిపిస్తుండటం కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేసింది. అయితే ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ మూవీని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో తెరకెక్కించనున్నాడు.

NBK108: బాలయ్య కోసం సీనియర్ హీరోయిన్..?

ఈ సినిమాను త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త జోరుగా హల్‌చల్ చేస్తోంది. బాలయ్యతో అనిల్ రావిపూడి తెరకెక్కించబోయే సినిమాకు అప్పుడే టైటిల్ కూడా లాక్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘‘బ్రో ఐ డోంట్ కేర్’’ అనే స్టైలిష్ టైటిల్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసిందట. ఈ సినిమాలో బాలయ్య పాత్ర, యాటిట్యూడ్‌కు పర్ఫెక్ట్ యాప్ట్‌గా ఈ టైటిల్ ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తుందట.

NBK108: బర్త్ డే రోజున ఫ్యాన్స్ కు బాలయ్య రోరింగ్ ట్రీట్!

ఇక ఈ సినిమాలో బాలయ్య ఓ తండ్రి పాత్రలో నటిస్తుండగా, ఆయన కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీలా నటించనుంది. కాగా.. బాలయ్య సరసన ఓ మాజీ హీరోయిన్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సాహు గారపాటి, హరీశ్ పెద్దిలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా అప్‌డేట్ ఉంటుందా అనేది చూడాలి.