బ్రోచేవారెవరురా – టీజర్

బ్రోచేవారెవరురా టీజర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : April 20, 2019 / 07:38 AM IST
బ్రోచేవారెవరురా – టీజర్

బ్రోచేవారెవరురా టీజర్ రిలీజ్..

విలక్షణమైన కథలను ఎంపిక చేసుకుంటూ, సినిమా సినిమాకీ నటుడిగా తనని తాను సరికొత్తగా ప్రూవ్ చేసుకుంటున్నాడు శ్రీ విష్ణు. ప్రస్తుతం ఇంతకు ముందు తనతో మెంటల్ మదిలో సినిమా చేసిన వివేక్ ఆత్రేయతో కలిసి, బ్రోచేవారెవరురా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి, చలనమే చిత్రము, చిత్రమే చలనము అనే ఢిఫరెంట్ ట్యాగ్ లైన్ పెట్టారు. మన్యం క్రియేషన్స్ బ్యానర్‌పై, మన్యం విజయ్ కుమార్ నిర్మిస్తుండగా, నివేథా థామస్, నివేథా పేతురాజ్ ఫీమేల్ లీడ్స్‌గా నటిస్తున్నారు. రీసెంట్‌గా బ్రోచేవారెవరురా టీజర్ రిలీజ్ అయ్యింది. సత్యదేవ్, నివేథా పేతురాజ్‌కి స్టోరీ నెరేట్ చెయ్యడంతో స్టార్ట్ అయిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది..

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ.. ఆర్ 3 బ్యాచ్ (రాకీ, రాంబో, రాహుల్) గా కనిపించనున్నారు. మనకి డబ్బులైతే కావాలి, ఈజీగా పనై పోవాలి, కానీ మనమని ఎవరికీ తెలియకూడదు.. అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్ చూస్తే హీరో అండ్ గ్యాంగ్ క్యారెక్టర్స్ ఏంటో అర్థమైపోతుంది. ప్రిన్సిపల్ డాటర్, కాలేజ్ స్టూడెంట్ కమ్ కూచిపూడి డాన్సర్‌ మిత్రగా నివేథా  థామస్ కనిపించనుంది. సాయి శ్రీరామ్ కెమెరా వర్క్, వివేక్ సాగర్ ఆర్ఆర్ బాగున్నాయి. క్రైమ్ కామెడీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న బ్రోచేవారెవరురా జూన్‌లో రిలీజ్ కానుంది. ఈ సినిమాకి ఎడిటింగ్ : రవితేజ గిరిజాల, లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి, హషిత్ గోలి, భరద్వాజ్, ఆర్ట్ : రామాంజనేయులు, ఫైట్స్ : గణేష్, రాబిన్ సుబ్బు, నబా.

వాచ్ బ్రోచేవారెవరురా టీజర్..