Rowdy Boys: కృష్ణుడు వచ్చాడే.. రాధను చూశాడే.. ‘రౌడీ బాయ్స్’ సాంగ్ రిలీజ్!

నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు కుటుంబం నుండి హీరో రాబోతున్నాడు. ఆయన శ్రీ వెంకటేశ్వరా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ఆయన సోదరుడు శిరీష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంటాడనే సంగతి తెలి

Rowdy Boys: కృష్ణుడు వచ్చాడే.. రాధను చూశాడే.. ‘రౌడీ బాయ్స్’ సాంగ్ రిలీజ్!

Rowdy Boys

Rowdy Boys: నిర్మాత, డిస్టిబ్యూటర్ దిల్ రాజు కుటుంబం నుండి హీరో రాబోతున్నాడు. ఆయన శ్రీ వెంకటేశ్వరా బ్యానర్ లో వచ్చే ప్రతి సినిమాకు ఆయన సోదరుడు శిరీష్ సహా నిర్మాతగా వ్యవహరిస్తుంటాడనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈయన కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆశిష్ రెడ్డి హీరోగా ‘రౌడీ బాయ్స్’ మూవీ తెరకెక్కింది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. జక్కన్న డ్రీమ్‌కు దిష్టి తగిలిందా? పార్ట్-1

అందుకే, ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టిన రౌడీ బాయ్స్ టీం సోమవారం ఈ సినిమాలోని ఓ పాటను విడుదల చేసింది. ‘బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే’ అనే పాట లిటికల్ వీడియోలో.. అనుపమ పరమేశ్వరన్‌ డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఆమె హావభావాలు కుర్రకారుని కట్టిపడేసేలా ఉన్నాయి. సుద్దాల అశోక్‌తేజ రచించిన ఈ పాటను మంగ్లీ ఆలపించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

RRR Movie: తొలి నుంచి కష్టాలే.. రిస్క్ తీసుకోలేమన్న ట్రిపుల్ఆర్ టీమ్! పార్ట్-2

దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు కాగా.. కాలేజీ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో కార్తిక్‌ రత్నం, తేజ కూరపాటి, కోమలి ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ఖరారుకానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ కుర్రకారును ఆకట్టుకోగా ఇప్పుడు విడుదలైన పాట సినిమా మీద ఆసక్తిని పెంచుతుంది.