టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్: బడ్జెట్, రెమ్యునరేషన్లు తగ్గించుకోక తప్పదు..

  • Published By: sekhar ,Published On : June 30, 2020 / 01:53 PM IST
టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్: బడ్జెట్, రెమ్యునరేషన్లు తగ్గించుకోక తప్పదు..

ఒక్క వైరస్ యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అన్నట్లుగా క‌రోనా ప‌రిస్థితుల‌ను మార్చేసింది. సినిమా షూటింగ్స్ అనే కాదు.. మార్కెటింగ్, బిజినెస్ విష‌యంలో క‌రోనా ప్ర‌తికూల ప్ర‌భావాన్నిక్రియేట్ చేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఊహించని దెబ్బ కొట్టిందీ మహమ్మారి. రోజువారీ వేతనానికి పనిచేసే సినీ కార్మికులు, చిన్నతరహా టెక్నీషియన్లు ఉపాధి కోల్పోయారు. స్టార్ హీరోల సినిమాల‌కు ఉండే ఓవ‌ర్‌సీస్ బిజినెస్ దెబ్బతింది.

దీంతో ఇప్పుడు స్టార్స్‌, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు బ‌డ్జెట్‌ను త‌గ్గించుకుని సినిమాలు చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. మరో అడుగు ముందుకేసి కోట్లలో పారితోషికాలు అందుకునే స్టార్ హీరోలు కూడా కొంచెం రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతకు అండగా నిలబడాలని కోరుతూ పలువురు సినీ ప్రముఖులు ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్ సినిమా బ‌డ్జెట్ కూడా త‌గ్గించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. దీంతో పాటు నిర్మాణ దశలో ఉన్న మరికొన్ని పెద్ద సినిమాల బడ్జెట్ కూడా సాధ్యమైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే కరోనా కట్టడి అయి, థియేటర్లు, షూటింగులు ప్రారంభమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ కళకళలాడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సినీ వర్గాలవారు.

Read:అమీర్ ఖాన్ ఇంట్లో కరోనా.. ఏడుగురికి పాజిటివ్