Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోషికం!

హార్ర‌ర్ సినిమాలంటే మనలో చాలామంది అదొక వ్యసనంగా చూస్తుంటారు. హర్రర్ సినిమాలంటే ఒకపక్క భయపడుతూనే ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తారు. కొన్ని సన్నివేశాలు వచ్చినపుడు..

Horror Movies: బంపర్ అఫర్.. ఈ హార్ర‌ర్ సినిమాలు చూస్తే రూ.ల‌క్ష పారితోషికం!

Horror Movies

Horror Movies: హార్ర‌ర్ సినిమాలంటే మనలో చాలామంది అదొక వ్యసనంగా చూస్తుంటారు. హర్రర్ సినిమాలంటే ఒకపక్క భయపడుతూనే ఆ సినిమాలను ఎంజాయ్ చేస్తారు. కొన్ని సన్నివేశాలు వచ్చినపుడు భయంతో కళ్ళు మూసుకొనేంత భయం ఉన్నా.. ఆ భయాన్ని కూడా ఎంజాయ్ చేయడం కొందరికి సరదా. అయితే.. అలాంటి హర్రర్ సినిమాలు చూస్తే పారితోషకం కూడా చెల్లించే సంస్థలున్నాయి. అప్పుడప్పుడు మన ఫిల్మ్ మేకర్స్ కూడా హర్రర్ సినిమాలకు ఇలాంటి ఆఫర్స్ ప్రకటిస్తుండగా అమెరికాలో మాత్రం భారీ ఆఫర్స్ ఇచ్చారు.

Big Boss 5: సవాళ్లు.. మధ్యలో నానాబూతులు.. ఇది నిజంగా ‘మండే’నే!

ఫైనాన్స్‌బజ్ అనే కంపెనీ.. హర్రర్ మూవీ హార్ట్ రేట్ ఎనలిస్ట్ (Horror Movie Heart Rate Analyst) అనే పేరుతో ఓ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఏంటంటే.. కేవ‌లం 10 రోజుల్లో 13 హార్ర‌ర్ సినిమాలు చూడాలి. అలా 13 హార్ర‌ర్ సినిమాలు చూసిన వాళ్ల‌కు పారితోష‌కం కింద 1300 డాల‌ర్ల‌ను ఆ కంపెనీ అందించ‌నుంది. అంటే మ‌న క‌రెన్సీలో సుమారు ల‌క్ష రూపాయ‌లు అన్న‌మాట‌. మరి ఈ కంపెనీ ఈ ఆఫర్ ఎందుకు ప్రకటించిందనే అనుమానాలు రావడం సహజమే కనుక దాని వెనుక కారణం కూడా ఆ కంపెనీనే ప్రకటించింది.

Big Boss 5: నక్క టీమ్.. గద్ద టీమ్.. ఈ వారం ఎలిమినేషన్‌లో ఏడుగురు!

హార్ర‌ర్ సినిమాల నిర్మాణం కోసం అయ్యే బ‌డ్జెట్‌ను బ‌ట్టి.. హార్ర‌ర్ సినిమాలను చూసేవాళ్ల భ‌యం, టెన్ష‌న్‌, ఆందోళ‌న ఉంటుందా అనేది తెలుసుకొనేందుకు ఈ ఆఫర్ ప్రకటించింది. ఈ సినిమాలు చూసేవాళ్ళకి ఫిట్‌బిట్ సాయంతో వాళ్ల హార్ట్ రేట్‌ను మానిట‌ర్ చేస్తారు. సినిమా ప్రీమియం ఛార్జ్ కూడా వాళ్ళే చెల్లించి వాళ్లకి కావాల్సిన సర్వేను వాళ్ళు చేసుకుంటారు. ఇందుకుగాను ముందుగా 26 సెప్టెంబ‌ర్ 2021 చివ‌రి తేదీ లోపు 18 సంవ‌త్స‌రాలు నిండిన యూఎస్ సిటిజ‌న్స్ ఎవ‌రైనా అప్లై చేసుకోవాలి.

Bigg Boss 5: వారానికి సరయూ అందుకున్న పారితోషకం ఇదే?

ఇంతకీ చూడాల్సిన ఆ 13 సినిమాలు ఏంటంటే.. సా (Saw ), ఏమిటివిల్లే హర్రర్ (Amityville Horror), ఏ క్వైట్ ప్లేస్ (A Quiet Place), ఏ క్వైట్ ప్లేస్ పార్ట్ 2 (A Quiet Place Part 2), క్యాండిమెన్ (Candyman), ఇన్సిడియస్ (Insidious), ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్ (The Blair Witch Project), సినిస్టర్ (Sinister), గెట్ అవుట్ (Get Out), ది పర్జ్ (The Purge), హలో వీన్ (Halloween (2018)), పారానమోల్ యాక్టివిటీ (Paranormal Activity), అన్నబెల్లే (Annabelle) సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.